• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘ఆటల్లో గెలుపు ఓటములు సహజం’

SRCL: ఆటల్లో గెలుపు ఓటములు సహజం అని, గెలుపోటములను సమానంగా తీసుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడలో జరుగుతున్న 8వ తెలంగాణ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ఆటగాడు మెస్సిని హైదరాబాద్ తీసుకువచ్చి స్వయాన ఫుట్ బాల్ ఆడి తనకు క్రీడల పట్ల ఉన్న మక్కువను చాటారని తెలిపారు.

February 20, 2026 / 07:18 AM IST

నేడు ఏఐ సమ్మిట్‌కు రేవంత్, శ్రీధర్ బాబు

TG: ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఏఐ సమ్మిట్‌కు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు హాజరుకానున్నారు. ఉదయం 8:30 గంటలకు స్వీడన్ వ్యాపార ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు, స్పెషల్ సీఎస్ భేటీ కానున్నారు. అనంతరం వెస్ట్ వింగ్‌లో శ్రీధర్ బాబు కీలక ఉపన్యాసం చేయనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు రేవంత్ ప్రసంగించనున్నారు.

February 20, 2026 / 07:17 AM IST

‘సీసీ రోడ్లు నిర్మించాలి’

ASR: జీకేవీధి మండలంలో పలు గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించాలని టీడీపీ మండల అధ్యక్షుడు పొత్తూరు కొండలరావు కోరారు. గురువారం పలువురు కూటమి నేతలతో కలిసి ఎంపీడీవో రమణబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. మండలంలో పలు గ్రామాల్లో సీసీ రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కూటమి గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, అధికారులు సహకరించాలని కోరారు.

February 20, 2026 / 07:17 AM IST

ముగ్గురిపై బైండోవర్‌పై కేసులు నమోదు

ELR: చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన ముగ్గురు పాత నాటు సారా కేసుల్లో ముద్దాయిలను గురువారం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద హాజరు పరిచారు. ఈ సందర్భంగా వారిపై మెజిస్ట్రేట్ బైండోవర్ కేసుల నమోదు చేయడం జరిగిందని అన్నారు. అలాగే బైండోవర్ విధించబడిన వారు సత్ప్రవర్తనతో ఉండాలని సూచించారు.

February 20, 2026 / 07:16 AM IST

BHPL జిల్లాకు రానున్న అసెంబ్లీ స్పీకర్:ఎమ్మెల్యే

BHPL:రేగొండ (M) కొడవటంచలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు ఈ నెల 20, 21 తేదీల్లో ఘనంగా జరగనున్నట్లు MLA గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. ఉమ్మడి WGL, కరీంనగర్ జిల్లాల ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని MLA పిలుపునిచ్చారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర మంత్రులు, MPలు హాజరవుతున్నట్లు వెల్లడించారు.

February 20, 2026 / 07:16 AM IST

యాదాద్రి దేవస్థానం నిత్య ఆదాయ వివరాలు

BHNG: శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య ఖజానాకు గురువారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. ఇందులో భాగంగా ప్రసాద విక్రయాలతో రూ.7,06,650, కార్ పార్కింగ్‌తో రూ.1,86,500, VIP దర్శనాలతో రూ. 1,35,000, బ్రేక్ దర్శనాలతో రూ.93,600, వ్రతాలతో రూ.1,18,000, కళ్యాణకట్ట రూ.68,500 లీజులతో రూ. 1 లక్ష, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ. 16,08,397, ఆదాయం వచ్చిందన్నారు.

February 20, 2026 / 07:15 AM IST

సీలేరు మసీదులో రంజాన్ మాసం ప్రారంభం

ASR: ముస్లింలకు ఎంతో ప్రీతిపాత్రమైన రంజాన్ మాసం వచ్చేసింది. ఈ నెలలోనే పవిత్ర ఖురాన్ అవతరించిందని వారు భావిస్తారు. విధిగా 30 రోజులపాటు రోజూ ఉపవాసంతో పాటు ఈ నెలంతా ఖురాన్ పఠనంతో గడుపుతారు. ఈ క్రమంలో సీలేరు మసీదులో ఘనంగా రంజాన్ మాసం ప్రారంభమైంది. అల్లాహ్ నామస్మరణ చేసుకుంటూ.. ఉపవాసం ఆచరించే సమయంలో చెడు అలవాట్లు, దరి చేరకుండా ఉంటాయని ముస్లింలు తెలిపారు.

February 20, 2026 / 07:14 AM IST

మహాశివరాత్రికి ఆర్టీసీ ఆదాయం ఎంతంటే..?

AKP: మహాశివరాత్రికి జిల్లా ఆర్టీసీకి రూ.28 లక్షల ఆదాయం వచ్చినట్లు డీపీటీవో ప్రవీణ గురువారం తెలిపారు. అనకాపల్లి, నర్సీపట్నం డిపోల నుంచి 104 బస్సు సర్వీసులను రెండు రోజులు పాటు వివిధ పుణ్యక్షేత్రాలకు నడిపినట్లు పేర్కొన్నారు. అలాగే, అనకాపల్లి నుంచి విజయవాడకు కొత్త బస్సు సర్వీసు ప్రారంభిస్తామన్నారు. నర్సీపట్నం నుంచి హైదరాబాద్‌కు స్లీపర్ బస్సు నడుపుతామన్నారు.

February 20, 2026 / 07:13 AM IST

‘తండ్రిపై కత్తితో కుమారుడి దాడి.. ఎంజీఎంకు తరలింపు’

MHBD: పెద్దవంగర మండలంలోని పడమటి తండాకు చెందిన ధారావత్ సోమన్నపై తన కుమారుడు దారావత్ విజయ్ గురువారం కత్తితో గొంతుపై దాడి చేశాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రమోద్ కుమార్ గౌడ్ తెలిపారు.

February 20, 2026 / 07:11 AM IST

నేడు నరసాపురం టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్

W.G: నరసాపురం టీడీపీ కార్యాలయంలో శుక్రవారం యథావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి రామరాజు వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి ప్రజలు తమ సమస్యలపై ఆర్జీలు అందజేయవచ్చని తెలిపారు. సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.

February 20, 2026 / 07:11 AM IST

‘పీఎం శ్రీ’ పెండింగ్ బిల్లులపై సమీక్ష

కరీంనగర్ జిల్లాలో ‘పీఎం శ్రీ’ కార్యక్రమం కింద ఎంపికైన పాఠశాలల్లో పెండింగ్ బిల్లుల అంశంపై విద్యాధికారులు, ప్రధానోపాధ్యా యులు, ట్రెజరీ శాఖ అధికారులతో కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడితో కలిసి సమీక్షించారు. వేతన బిల్లులు మినహా అన్నిరకాల చెల్లింపులు వెనువెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

February 20, 2026 / 07:10 AM IST

హత్యాయత్నం కేసులో ఇద్దరు అరెస్ట్

SKLM: కొత్తూరు మండలం బ్రాహ్మణవీధికి చెందిన సాయికుమార్‌పై బీరు సీసాలతో దాడిచేసిన ఘటనలో గురువారం కేసు నమోదు చేసి, ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై కె. వెంకటేశ్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి కొత్తూరుకు చెందిన టి.వినయ్ కుమార్, సిరుసువాడ గ్రామానికి చెందిన కె. తరుణ్‌ను కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్సై పేర్కొన్నారు.

February 20, 2026 / 07:10 AM IST

కోహ్లీ లిస్ట్ అగ్రస్థానంలో సికందర్ రజా

జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా తన ఆల్‌రౌండ్ ప్రదర్శనలతో జట్టును T20 WCలో సూపర్-8కు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతను అంతర్జాతీయ T20 క్రికెట్‌లో అత్యధికంగా 19 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు పొందిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డ్ టీమిండియా కెప్టెన్ సూర్య(17), అంతకుముందు విరాట్ కోహ్లీ(16) పేరిట ఉండేది.

February 20, 2026 / 07:09 AM IST

అంబటిని పరామర్శించిన మాజీ మంత్రి విడదల రజిని

PLD: ఇటీవల పలు కేసుల్లో అరెస్ట్ అయ్యి, జైలు నుంచి విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబును మాజీ మంత్రి విడదల రజిని గురువారం రాత్రి పరామర్శించారు. గుంటూరులోని ఆయన నివాసానికి వెళ్లిన రజిని.. అంబటి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ ఆయనకు ఎప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆమె ధైర్యం చెప్పారు. ఈ పర్యటనలో చిలకలూరిపేట వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

February 20, 2026 / 07:08 AM IST

జిల్లాకు చేరిన యూరియా

CTR: జిల్లాలో రబీ పంటల సాగు కోసం 1150 టన్నుల యూరియా గురువారం చేరింది. ప్రస్తుతం జిల్లాలోని రైతు సేవా కేంద్రాలు, సహకార సంఘాలు, గోదాముల్లో సుమారు 4,200 టన్నుల యూరియా నిల్వ ఉందని వ్యవసాయ శాఖ అధికారి మురళి తెలిపారు. యూరియా కొరత లేదని, అవసరమైన మండలాలకు వెంటనే సరఫరా చేస్తామని స్పష్టం చేశారు.

February 20, 2026 / 07:08 AM IST