• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నిరుద్యోగ యువతకు శుభవార్త

నిరుద్యోగ యువతకు భారతీయ రైల్వే తరఫున RRB శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పోస్టులకు 10, ITI/డిప్లొమా ఉత్తీర్ణులైనవారు అర్హులు కాగా.. వీటిల్లో 674 సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఉండటం విశేషం. CBT 1 & 2, CBAT, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

February 21, 2026 / 10:09 AM IST

తండ్రిపై దాడి చేసి బంగారంతో పరార్

KRNL: ఆదోని(M) కపటి గ్రామంలో ఆస్తి తగాదాతో కొడుకు తన తండ్రిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు SI మహేశ్ తెలిపారు. అనంతరం ఇంట్లోని ఐదు తులాల బంగారం, బుల్లెట్ బైక్‌తో పరారయ్యాడని చెప్పారు. గాయపడిన తండ్రిని కుటుంబ సభ్యులు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI తెలిపారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

February 21, 2026 / 10:09 AM IST

దేవరపల్లిలో స్వచ్ఛ రథం ప్రారంభం

E.G: దేవరపల్లిలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ రథాన్ని గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు కంబాల సత్తిబాబు, టీడీపీ మండలం అధ్యక్షులు తంగేళ్ల మునీశ్వర రావు శనివారం ప్రారంభించారు. స్వచ్ఛ రథం ద్వారా ప్రజల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను స్వీకరించి వాటి విలువను తగ్గట్టుగా నిత్యవసర సరుకులు ఇవ్వడం జరుగుతుందన్నారు. దీనిని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

February 21, 2026 / 10:06 AM IST

SRR కళాశాలలో ఎంటర్ప్రైన్యూర్షిప్ డెవలప్మెంట్పై అవగాహన

KNR: కరీంనగర్‌లోని SRR ప్రభుత్వ కళాశాలలోని ఎంటర్ప్రైన్యూర్షిప్ డెవలప్మెంట్ సెల్ (EDC) ఆధ్వర్యంలో ఎంటర్ప్రైన్యూర్షిప్ స్ఫూర్తిని పెంపొందించడంపై అవగాహన కార్య క్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్, ప్రొఫెసర్ కె. రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యార్థులు ఉద్యోగ అవకాశాలకే పరిమితం కాకుండా స్వయం ఉపాధి దిశగా ఆలోచించాలని సూచించారు.

February 21, 2026 / 10:06 AM IST

వైసీపీ సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శిగా శ్యామ్ సుందర్

ATP: వైసీపీ రాష్ట్ర సోషల్ మీడియా విభాగం సంయుక్త కార్యదర్శిగా పుట్లూరు మండలానికి చెందిన యువనేత శ్యామ్ సుందర్ రెడ్డి బెడదల నియమితులయ్యారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో ఆయన చూపుతున్న చొరవను గుర్తించి అధిష్ఠానం ఈ బాధ్యతలను అప్పగించింది. తన నియామకానికి సహకరించిన పార్టీ ముఖ్య నేతలకు శ్యామ్ సుందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

February 21, 2026 / 10:06 AM IST

‘వ్యాయామం నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి’

SRCL: వాకింగ్, వ్యాయామం నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య సూచించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, ప్రతిరోజు ఉదయాన్నే కనీసం ఒక అరగంట వ్యాయామం, నడక అలవాటు చేసుకోవాలని అన్నారు. సాధ్యమైనంత వరకు బయట ఆహారం తినడం మానివేయాలని పేర్కొన్నారు.

February 21, 2026 / 10:05 AM IST

ఉరివేసుకుని ట్రాక్టర్ డ్రైవర్ మృతి

BDK: అశ్వాపురం మండలం మండికుంట గ్రామ సమీపంలో ఓ ట్రాక్టర్ డ్రైవర్ శనివారం చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా హుటాహుటిన సీఐ అశోక్ రెడ్డి ఘటన స్థలాన్ని చేరుకొని దర్యాప్తు చేపట్టారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవర్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

February 21, 2026 / 10:05 AM IST

మంత్రి పొంగులేటి చొరవతో కిడ్నీ బాధితుడికి LOC

KMM: పొన్నెకల్ నియోజకవర్గ ప్రజల కష్టాలను తన కష్టంగా భావించే మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. అత్యవసర వైద్య చికిత్స కోసం ఎదురుచూస్తున్న ఒక నిరుపేదకు తొమ్మిది లక్షల ప్రభుత్వ ఎల్వోసీ మంజూరు చేయించి కొండంత భరోసా ఇచ్చారు. తుంబూరు దయాకర్ రెడ్డి చేతుల మీదుగా శుక్రవారం రాత్రి లబ్ధిదారులకు LOC పత్రాని అందజేశారు.

February 21, 2026 / 10:05 AM IST

స్వచ్ఛందంగా రక్తదానం చేసిన 129 మంది

RR: చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 19న షాద్‌నగర్ పట్టణంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని భజరంగ్ దళ్ సభ్యులు తెలిపారు. శనివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం 129 మంది స్వచ్ఛందంగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారన్నారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు.

February 21, 2026 / 10:04 AM IST

ఏపీలో ఎన్నికలు ఎప్పుడంటే..?

KDP: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు ముమ్మరం చేసింది. ఏప్రిల్‌లో సర్పంచుల పదవీకాలం ముగియనుండగా, మార్చిలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీకాలం కూడా ముగియనుంది. మార్చిలో పదో తరగతి పరీక్షలు పూర్తయిన తర్వాత స్థానిక ఎన్నికలను నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.

February 21, 2026 / 10:04 AM IST

మత్స్యకారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

AP: రాష్ట్రంలోని మత్స్యాకరులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎక్స్‌గ్రేషియా నిధులను విడుదల చేసింది. ఈ క్రమంలో మొత్తం 90 కుటుంబాలకు రూ.4.75 కోట్లను మంజూరు చేసింది. దీనిపై హర్షం వ్యక్తంచేసిన మత్స్యకార కుటుంబాలు కూటమి ప్రభుత్వ అగ్రనేతలకు ధన్యవాదాలు తెలిపాయి.

February 21, 2026 / 10:02 AM IST

విద్యార్థులకు ఏయూ రిజిస్ట్రార్ సూచనలు

VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థులు వివాదాలకు దూరంగా ఉంటూ, తమ సమయాన్ని కెరియర్ నిర్మాణంపైనే పెట్టాలని రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. వర్సిటీలోని గ్రంథాలయాలు, వసతులను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.

February 21, 2026 / 10:00 AM IST

గుడుంబా తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు

ASF: లింగాపూర్ మండలంలో గుడుంబా తయారీ కేంద్రాలపై SI గంగన్న నేతృత్వంలో శనివారం ఉదయం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని, అతని వద్ద నుంచి 2 లీటర్ల గుడుంబా, 20 లీటర్ల బెల్లం పానకాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా గుడుంబా తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.

February 21, 2026 / 10:00 AM IST

నేడు విద్యుత్ అంతరాయం

KNR: శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు, కాచాపూర్ సబ్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4: 30 వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగనుంది. మరమ్మతుల దృష్ట్యా కొత్తగట్టు, లింగాపూర్, గొల్లపల్లి, కల్వల, రాజాపూర్, కాచాపూర్ గ్రామాల్లో విద్యుత్ కోత ఉంటుందని ఏఈ రఘు తెలిపారు. వినియోగదారులు, రైతులు సహకరించాలని ఆయన కోరారు.

February 21, 2026 / 10:00 AM IST

హైటెన్షన్.. కాంగ్రెస్-బీజేపీ నేతల సవాళ్లతో ఉత్కంఠ

TG: కామారెడ్డిలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అరోరా భూములపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలతో ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి, నేత షబ్బీర్ అలీ మధ్య సవాళ్లు చెలరేగాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు శిశుమందిర్ వద్ద చర్చకు రావాలని ఎమ్మెల్యే సవాల్ చేయగా, కాంగ్రెస్ ‘సై’ అంది. ఇరు వర్గాల పోటాపోటీ సవాళ్లతో కామారెడ్డిలో హైటెన్షన్ నెలకొనగా, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

February 21, 2026 / 09:57 AM IST