VKB: మర్పల్లి మండలంలోని చెరువులు పూడిక నిండి మరమ్మతులకు నోచుకోవడం లేదు. గతంలో చెరువులు నిండి ఆయకట్టు రైతులకు సాగునీరు సమృద్ధిగా అందేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఖల్కోడ, ఘనపూర్, రావులపల్లి గ్రామాల్లోని చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టాలని కోరుతున్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని కోరారు.
కేంద్రమంత్రి రామ్మోహన్ తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈ ఉదయం VIP విరామ సమయంలో మాజీ MP గల్లా జయదేవ్‌తో కలిసి వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఇటీవల AP CM చంద్రబాబు ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కేంద్రాన్ని పరిశీలించామని, తాము కూడా విమానయానశాఖలో దీన్ని ప్రారంభించేలా చూస్తామని పేర్కొన్నారు. తమకూ ఉపయోగపడేలా AIని TTD తీర్చిదిద్దిందన్నారు.
మరో దిగ్గజ సంస్థ సీఈఓగా భారత్ సంతతి వ్యక్తి ఎన్నికయ్యారు. మైక్రోసాఫ్ట్ గేమింగ్ సీఈఓగా ఆశా శర్మను నియమిస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న ఫిల్ స్పెన్సర్ పదవీ విరమణ చేయడంతో ఆశాకు ఆ పదవి దక్కింది. ఆయన స్థానంలో గేమిండ్ డివిజన్‌కు సీఈఓ, వైస్ ప్రెసిండెంట్‌గా ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు.
కడప: నగరంలోని చెమ్ముమియాపేట జిల్లా పరిషత్ గర్ల్స్ హైస్కూల్‌లో ‘శక్తి’ టీమ్ ఎస్సై శాంతమ్మ ఆధ్వర్యంలో మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో ‘శక్తి’ యాప్ వినియోగం, ఎస్.ఓ.ఎస్ బటన్ ప్రాముఖ్యత, డయల్ 112 సేవలపై విద్యార్థినులకు వివరించారు. మహిళలు, చిన్నారుల రక్షణకు అందుబాటులో ఉన్న హెల్ప్‌లైన్ నంబర్లను గుర్తు చేశారు.
KMM: కారేపల్లి బోటితండా పంచాయతీ ఇంఛార్జ్ సర్పంచ్‌గా ఉప సర్పంచ్ బాదావత్ మంగీలాల్ బాధ్యతలు చేపట్టారు. ఇటీవల సర్పంచ్ భూక్యా తులిశ్యా మృతి చెందడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది. శుక్రవారం ఎంపీవో మల్లెల రవీంద్రప్రసాద్ మంగీలాల్‌ను కలిసి ఇంఛార్జ్ సర్పంచ్ నియామక ఉత్తర్వులను అందజేశారు. జాయింట్ సిగ్నేచర్ అధికారాన్ని వార్డ్ మెంబర్ మంగికి కల్పించారు.
కృష్ణా: గుడ్లవల్లేరు గ్రామంలో శానిటరీ సిబ్బంది ద్వారా చెత్త తొలగింపు పనులను శనివారం చేపట్టారు. గ్రామం చుట్టూ వ్యర్థాల నిల్వ తగ్గించి, పరిశుభ్రతను పెంపొందించే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నామని శానిటరీ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ తెలిపారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా చెత్త బండి వారికి అందజేయాలని ఆయన గ్రామస్థులకు సూచించారు.
ELR: వట్లూరులోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహం -1లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల ఆహార నాణ్యతను పరిశీలించారు. భోజనం పరిశుభ్రంగా ఉందా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు.
ADB: ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మ గ్రామంలో నెలకొన్న శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ అర్చకులు సోమశేఖర్, మహేష్ శనివారం తెలియజేశారు. 7రోజులపాటు కొనసాగుతున్న జాతరకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు వచ్చి మల్లన్నను దర్శించుకుంటారని అన్నారు. జాతరకు వచ్చే భక్తులకు త్రాగునీరు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ASF: తిర్యాణి ఆసుపత్రిలో స్కానింగ్, X రే యంత్రాలు ఉన్నా సిబ్బంది లేక అవి మూలపడ్డాయి. దీంతో గిరిజనులు, గర్భిణులు పరీక్షల కోసం 60KM దూరంలోని మంచిర్యాల లేదా ఆసిఫాబాద్ వెళ్లాల్సి వస్తోంది. ప్రభుత్వం లక్షలు వెచ్చించి యంత్రాలను సమకూర్చినా, నిర్వహణ కరువవ్వడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి టెక్నీషియన్లను నియమించాలన్నారు.
SDPT: వివిధ గ్రామాల రైతుల కోరిక మేరకు గజ్వేల్ మాజీ MLA నర్సారెడ్డి కొండపోచమ్మ కెనాల్ నుంచి హల్దీ వాగులోకి సాగునీరు విడుదల చేశారు. వర్గల్ నవోదయ సమీపంలో జరిగిన కార్యక్రమంలో రైతుల సంక్షేమం కోరే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. రైతు రుణమాఫీ, భరోసా, మద్దతు ధర పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో AMC ఛైర్మన్ విజయ మోహన్, నాయకులు పాల్గొన్నారు.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో జీరా వాటర్ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి, బరువు తగ్గుతారు. ఇది శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపి, మెటబాలిజాన్ని పెంచుతుంది. గ్యాస్, ఎసిడిటీ సమస్యలను తగ్గించడమే కాకుండా మధుమేహాన్ని నియంత్రిస్తుంది. రోగనిరోధక శక్తి పెంచడానికి తోడ్పడుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చి, జుట్టు ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.
MNCL: కవ్వాల్ అభయారణ్యం పరిరక్షణ కోసం బిగించిన ఆంక్షలతో జన్నారం అభివృద్ధికి దూరంగా ఉంది. కవ్వాల్ అభయారణ్యానికి జన్నారం ప్రధాన కేంద్రంగా ఉండగా.. కవ్వాల్ అభయారణ్యంతో పాటు వన్యప్రాణులు, పక్షుల రక్షణకు ప్రభుత్వం ఆంక్షలు అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో జన్నారం మండలంలో పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు వన్యప్రాణి చట్టం నిబంధనలు అడ్డువస్తున్నాయి.
RR: కాకునూర్‌లోని శ్రీ మహాలింగేశ్వర స్వామి సన్నిధిలో బండలాగుడు పోటీలు వైభవంగా నిర్వహించారు. ఈ పోటీలను షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. పోటీలను వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. రైతులు తమ ఎద్దులను రంగురంగుల వస్త్రాలు, గంటలతో అందంగా అలంకరించి పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. దీంతో గ్రామంలో సందడి నెలకొంది.
అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ నేతల దాడిని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శనివారం ఖండించారు. ఢిల్లీలో జరిగిన పరిణామాలకు ఇక్కడ దాడులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. దేశంలో ప్రశ్నించే హక్కును బీజేపీ కాలరాస్తోందని ధ్వజమెత్తారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని ఆవేదన వ్యక్తం చేశారు.
TG: నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) అగ్నిప్రమాదం ఘటనలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదంలో సుమారు 1,100 ఫైల్స్ పూర్తిగా దగ్ధమైనట్లు నాగ్‌పూర్ ప్రత్యేక బృందం గుర్తించింది. ఈ కేసుల డేటాను రికవరీ చేసేందుకు నిపుణులు ప్రయత్నించినప్పటికీ, అది సాధ్యం కాదని తేల్చి చెప్పారు. కీలక ఆధారాలు ఉన్న ఫైల్స్ కాలిపోవడం ఇప్పుడు దర్యాప్తు సంస్థలకు పెద్ద సవాలుగా మారింది.