• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వోల్టేజ్ సమస్య రాకుండా చర్యలు

VKB: కుల్కచర్లలో MPDO కార్యాలయం పక్కన ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ అధిక లోడ్ పడడంతో‌లో వోల్టేజ్ సమస్యతో వినియోగదారులు బాధపడుతున్నారు. వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని అధిక సామర్థ్యం గల ఏర్పాటు చేసి కరెంటు సమస్యలను పరిష్కరిస్తామని AE నాగరాజు తెలిపారు. మండల కేంద్రంతో పాటు గ్రామాలలో కరెంటు సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

February 21, 2026 / 03:33 PM IST

‘అడుగంటుతున్న భూగర్భ జలాలు.. ఎండుతున్న పొలాలు’

MHBD: ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన రైతు గంజి ఉప్పల్ రెడ్డి తన మూడెకరాల వ్యవసాయ భూమిలో మొక్కజొన్న పంట సాగు చేస్తున్నాడు. వేసవికాలం రాకముందే భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో బావుల్లో నీరు లేక రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయి. దీంతో చేసేదేమిలేక గంటకు రూ.5వేలు వెచ్చించి, 10 గంటలకు రూ.50 వేలు ఖర్చు చేసి పొక్లైనర్ సహాయంతో పూడిక తీసినట్లు తెలిపారు.

February 21, 2026 / 03:32 PM IST

గొర్రెల, మేకల పెంపకదారుల సంఘ డైరీ ఆవిష్కరణ

KNR: మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేతుల మీదుగా కరీంనగర్ జిల్లా గొర్రెల మేకల పెంపక దార్ల సంఘం డైరీ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మహేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి కాలువ సురేష్ యాదవ్, శంకరపట్నం మండల అధ్యక్షులు కేశవేణి రవీందర్ యాదవ్, గౌరవ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

February 21, 2026 / 03:32 PM IST

నిరంతరాయంగా విద్యుత్ సరఫరా

W.G: వీరవాసరం మండలం కొణితివాడ బుద్ధ రాయుడు చెరువు వద్ద రూ.3.48 కోట్లతో నిర్మించిన 33 KV ఫీడర్‌ను శనివారం MLA పులపర్తి రామాంజనేయులు, MP పాక సత్యనారాయణ ప్రారంభించారు. భీమవరం నుంచి కొణితివాడ వరకు 16.6 కి.మీ. మేర కొత్త విద్యుత్ లైన్ నిర్మించినట్లు వారు తెలిపారు. నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

February 21, 2026 / 03:32 PM IST

భవన నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

HNK: హన్మకొండలో మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పరిశీలించారు. మున్నూరుకాపు భవనం గ్రౌండ్ లెవల్ పనులు పూర్తైన క్రమంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణం చేపట్టాలని, అన్ని వర్గాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం సమాన ప్రాధాన్యతను కల్పిస్తుందని ఎమ్మెల్యే అన్నారు.

February 21, 2026 / 03:31 PM IST

నెలకు 7 వేల సంపాదన.. రూ.2 కోట్ల GST నోటీసు!

ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌కు చెందిన టీచర్ ఓం ప్రకాష్ వర్మకు రూ.2 కోట్ల పన్ను చెల్లించాలని GST అధికారులు నోటీసు ఇచ్చారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఆయన పాన్ కార్డును ఉపయోగించి కోట్ల విలువైన లావాదేవీలు జరిపినట్లు అధికారులు గుర్తించారు. అయితే తన సంపాదన నెలకు కేవలం రూ. 7,000, ఈ భారీ పన్ను నోటీసుతో తాను తీవ్ర ఆందోళనలో ఉన్నానని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.

February 21, 2026 / 03:30 PM IST

ICS మల్టీకల్చరల్ ఈవెంట్‌కు ఆహ్వానం

MBNR: బ్రిస్బేన్‌లో నిర్వహించనున్న ‘ICS మల్టీకల్చరల్ ఈవెంట్ 2026’కు మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్‌కు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆహ్వానం అందింది. నివాసంలో ICS క్వీన్స్‌లాండ్ అధ్యక్షులు సూర్యనారాయణ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఆహ్వాన పత్రికను అందజేశారు. తెలుగు సంస్కృతిని విదేశాల్లో చాటిచెప్పేలా కార్యక్రమం రూపొందించినట్టు పేర్కొన్నారు.

February 21, 2026 / 03:30 PM IST

IND vs AUS: భారత్ స్కోర్ ఎంతంటే..?

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 176/6 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన(82), జెమీమా రోడ్రిగ్స్(59) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో సదర్లాండ్ 2 వికెట్లు పడగొట్టింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు జట్లు చెరో విజయంతో 1-1తో సమంగా ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్ గెలిచిన జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది.

February 21, 2026 / 03:29 PM IST

సేవాదళ్ కార్యకర్తలకు అవకాశం కల్పించాలని వినతి

జగిత్యాల మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులుగా కాంగ్రెస్ సేవాదళ్ కార్యకర్తలకు అవకాశం కల్పించాలని కోరుతూ సేవాదళ్ నాయకులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గాజెంగి నందయ్యను కలిశారు.ఈ సందర్భంగా సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి ముకేశ్ ఖన్నా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ విజయాల్లో సేవాదళ్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. సేవా కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని వినతిపత్రం అందజశారు.

February 21, 2026 / 03:27 PM IST

వైసీపీ మతసామరస్యాన్ని దెబ్బతీసింది: ఎమ్మెల్యే

E.G: గత వైసీపీ ప్రభుత్వంలో మతసామరస్యాన్ని దెబ్బతీసే అంశం మొదలైందని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు విమర్శించారు. శనివారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. భారత పార్లమెంటరీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా శాసనమండలిలో వైసీపీ నేతలు భగవంతుని ఫోటోలు ప్రదర్శించారని మండిపడ్డారు. చెప్పులు, బూట్లు ధరించి స్వామి వారి ఫోటోలు ప్రదర్శించడం   అపచారమన్నారు.

February 21, 2026 / 03:26 PM IST

మనోహర్ రెడ్డికి డాక్టరేట్.. ఘన సన్మానం

TPT: చిట్టమూరు మండలం కొత్తగుంటలోని టీఎంఆర్ విద్యాసంస్థల అధినేత డా. తంబిరెడ్డి మనోహర్ రెడ్డికి గ్రామీణ విద్యాభివృద్ధి, సామాజిక సేవలకు గాను అమెరికన్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. చెన్నైలో అవార్డు స్వీకరించిన అనంతరం శనివారం టీఎంఆర్ పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించారు. కడైరెక్టర్ విజయలక్ష్మి, ప్రిన్సిపల్ రహంతుల్లా పాల్గోన్నారు.

February 21, 2026 / 03:25 PM IST

శక్తి టీం ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన

కృష్ణా: మచిలీపట్నం ఆటో డ్రైవర్లకు శక్తి టీం ట్రాఫిక్ నిబంధనలు, మాదకద్రవ్యాల వినియోగం, సైబర్ క్రైమ్ తదితర అంశాలపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శక్తి టీం సభ్యులు మాట్లాడుతూ.. ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని, మద్యం సేవించి వాహనం నడపకూడదని, తగు సూచనలు చేశారు.

February 21, 2026 / 03:24 PM IST

కివీస్ vs పాక్ మ్యాచ్‌కు వర్షం గండం..?

సూపర్-8లో భాగంగా ఈరోజు న్యూజిలాండ్ – పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ‘ఆక్యూవెదర్’ నివేదిక ప్రకారం.. కొలంబోలో ఈరోజు రాత్రి 80 నుండి 100 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దైతే, ఇరు జట్లు చెరో పాయింట్‌ను పంచుకోవాల్సి ఉంటుంది. అదే జరిగితే రెండు జట్ల సెమీస్ అవకాశాలు దెబ్బతింటాయి.

February 21, 2026 / 03:23 PM IST

రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదు: ఎమ్మెల్యే

ATP: అనంతపురం మార్కెట్ యార్డులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీని ఆదేశించారు. యార్డులో పాలకవర్గంతో నిర్వహించిన సమావేశంలో మార్కెట్ అభివృద్ధిపై చర్చించారు. చీనీ రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, కష్టపడి పంట తెచ్చే రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని సూచించారు.

February 21, 2026 / 03:21 PM IST

‘హే బల్వంత్’ ఫస్ట్ డే కలెక్షన్స్

టాలీవుడ్ నటుడు సుహాస్ హీరోగా దర్శకుడు గోపి అచ్చర తెరకెక్కించిన ‘హే బల్వంత్’ మూవీ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు ఈ మూవీ రూ.2.14 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా, ఎలాగైనా తండ్రి బిజినెస్‌ను తాను టేకప్ చేయాలనే కొడుకు కథతో ఈ మూవీ తెరకెక్కింది.

February 21, 2026 / 03:21 PM IST