• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మల్లేశ్వర స్వామి నిత్య అన్నదానానికి రూ. లక్ష విరాళం

GNTR: పెదకాకాని శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థాన నిత్య అన్నదాన పథకానికి బాపట్ల జిల్లా సూరేపల్లి గ్రామానికి చెందిన భాస్కర్ రావు సోమవారం రూ. లక్ష విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలా కుమార్ మాట్లాడుతూ.. స్వామివారి అన్నదాన పథకానికి, ఆలయ అభివృద్ధికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పించి సహకరించాలని కోరారు.

February 23, 2026 / 08:40 PM IST

మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన కుసుమ

SRPT: కోదాడ మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా ఎర్నేని కుసుమ సోమవారం ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కోదాడ పట్టణాన్ని జిల్లాలోని ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని ఆమె అన్నారు. మౌలిక వసతుల మెరుగుదలకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యేను కోరారు.

February 23, 2026 / 08:40 PM IST

సిమెంట్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

AKP: కోటవురట్ల మండలం బీకెపల్లిలో 10 సీసీ రోడ్లు హోంమంత్రి వంగలపూడి అనిత చొరవతో మంజూరైనట్లు మండల టీడీపీ అధ్యక్షుడు లింగన్నాయుడు తెలిపారు. ఈ మేరకు సోమవారం సిమెంట్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు. పది రోడ్ల నిర్మాణానికి రూ.52 లక్షలు నిధులు విడుదలైనట్లు తెలిపారు. రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలన్నారు.

February 23, 2026 / 08:38 PM IST

అనారోగ్య బాధితునికి ఆర్థిక సహాయం అందజేత

కోనసీమ: రామచంద్రపురం మండలం వేగాయమ్మపేటకు చెందిన చొల్లంగి సుబ్రహ్మణ్యం గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. అతనికి విశాఖపట్నంకు చెందిన వ్యాపారవేత్త పోతంశెట్టి ఆంజనేయులు రెడ్డి మంత్రి వాసంశెట్టి సుభాష్ చేతుల మీదుగా సోమవారం రూ.50 వేలు ఆర్థిక సాయం అందించారు. మంత్రి మాట్లాడుతూ.. తానే కాకుండా తన మిత్రులు కూడా సహాయం చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు.

February 23, 2026 / 08:37 PM IST

మాజీ సీఎంను ఆహ్వానించిన మాజీ సీఎం

WG: మాజీ ముఖ్యమంత్రి జగన్‌ను మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమారుడు సందీప్ వివాహ రిసెప్షన్ మార్చి 9న రాజమహేంద్రవరంలో జరగనున్న నేపథ్యంలో, జగన్‌ను కుటుంబ సమేతంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. శేషుబాబుతో పాటు ఆయన సతీమణి శశికళ, రవిశంకర్ నారాయణ (IRS), సిద్ధార్థ తదితరులు జగన్‌ను కలిసి ఆత్మీయంగా ఆహ్వానించారు.

February 23, 2026 / 08:36 PM IST

మాజీ సీఎంను ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్సీ

WG: మాజీ ముఖ్యమంత్రి జగన్‌ను మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమారుడు సందీప్ వివాహ రిసెప్షన్ మార్చి 9న రాజమహేంద్రవరంలో జరగనున్న నేపథ్యంలో, జగన్‌ను కుటుంబ సమేతంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. శేషుబాబుతో పాటు ఆయన సతీమణి శశికళ, రవిశంకర్ నారాయణ (IRS), సిద్ధార్థ తదితరులు జగన్‌ను కలిసి ఆత్మీయంగా ఆహ్వానించారు.

February 23, 2026 / 08:36 PM IST

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి: ఎమ్మెల్యే

NTR: మైలవరం నియోజకవర్గం వ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు వెల్లడించారు. ఇబ్రహీంపట్నం మండలం దాములూరులో రూ.20 లక్షలతో తాగునీటి పైపులైన్ నిర్మాణానికి, చిలుకూరులో రూ.25 లక్షలతో డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. స్వచ్ఛంధ్ర-స్వర్ణాంధ్ర లక్ష్యంతో గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే ప్రధాన ధ్యేయంతో కృషి చేస్తునమన్నారు.

February 23, 2026 / 08:36 PM IST

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తరలించొద్దు : లక్ష్మారెడ్డి

MBNR: జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని పాత ఆసుపత్రికి తరలించవద్దని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సోమవారం డిమాండ్ చేశారు. ప్రస్తుత భవనం పార్కింగ్, ఇతర వసతులతో సౌకర్యంగా ఉందని, సొంత భవనం నిర్మించే వరకు దీన్ని మార్చవద్దని ఆయన కోరారు. ప్రజా సౌకర్యార్థం ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పునరాలోచించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.

February 23, 2026 / 08:34 PM IST

MLA అనిల్ జాదవ్ సమక్షంలో BRSలో చేరికలు

ADB:  నేరడిగొండలోని రోలుమామడ మాజీ సర్పంచ్ హర్కా యాదవరావు, పలువురు నాయకులు MLA అనిల్ జాదవ్ సమక్షంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు నాయకులు పేర్కొన్నారు.

February 23, 2026 / 08:34 PM IST

NPDCL భవన్‌ను సందర్శించిన SC, ST కమిషన్ ఛైర్మన్

HNK: నక్కలగుట్టలోని NPDCL భవన్‌ను సోమవారం సాయంత్రం తెలంగాణ SC, ST కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల అమలు అత్యంత పారదర్శకంగా జరగాలని, గైడ్‌లైన్స్ ప్రకారం బ్యాక్ లాగ్ పోస్టులను త్వరగా భర్తీ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో CMD వరుణ్ రెడ్డి ఉన్నారు.

February 23, 2026 / 08:34 PM IST

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ‘అనంత’*

అనంతపురం: రంజాన్ మాసంను పురస్కరించుకుని అనంతపురం నగరంలోని 2వ రోడ్ వద్ద ఉన్న బాబుద్ధిన్ మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, మేయర్ వసీం హాజరయ్యారు. మసీదు నందు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో వారు పాల్గొన్నారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, మసీదు కమిటీ మెంబర్లు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

February 23, 2026 / 08:34 PM IST

మంత్రి వివేక్‌ను కలిసిన యూత్ కాంగ్రెస్ నాయకుడు

MNCL: కార్మిక, గనుల శాఖ మంత్రి, చెన్నూరు MLA గడ్డం వివేక్ వెంకటస్వామిని, మందమర్రి పట్టణ యూత్ యూత్ కాంగ్రెస్ నాయకులు రాయబారపు కిరణ్ సోమవారం హైదరాబాద్ సెక్రటేరియట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు కిరణ్ పేర్కొన్నారు.

February 23, 2026 / 08:33 PM IST

దాడిపై మహిళా న్యాయవాది ఫిర్యాదు

NZB: రుద్రూర్​‌లో తనపై దాడి జరిగిందని పేర్కొంటూ మహిళా న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బోధన్​ బార్​ అసోసియేషన్​ సభ్యులతో కలిసి సోమవారం రుద్రూర్​ పోలీస్​స్టేషన్​కు వచ్చారు. అయితే ఫిర్యాదుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ రుద్రూర్​ ఎస్సైపై బోధన్​ ఏసీపీ శ్రీనివాసరావు‌కు ఫిర్యాదు చేశారు.

February 23, 2026 / 08:33 PM IST

ముగ్గురిపై బైండోవర్ కేసులు

ELR: టి.నరసాపురం మండలం బంధంచర్ల గ్రామానికి చెందిన ముగ్గురుని మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ వద్ద బైండోవర్ చేసినట్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ అధికారులు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా పాత నాటు సారా కేసుల్లో ముద్దాయిలు అయిన గుమ్మల్ల లక్ష్మణరావు, కొండా పుల్లయ్య, రాచప్రోలు అరుణ్ అనే వ్యక్తులపై బైండోవర్ విధించడం జరిగిందన్నారు. సత్ప్రవర్తనతో మెలగాలన్నారు.

February 23, 2026 / 08:32 PM IST

విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు

MDK: మాసాయిపేట మండలం చెట్ల తిమ్మాయపల్లి గ్రామంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు సర్పంచ్ హంసి మనోహర్ తెలిపారు. గ్రామంలో విద్యుత్ శాఖ లైన్ మెన్ తో కలిసి గ్రామంలో పర్యటించారు. విద్యుత్ సమస్యలు గుర్తించడంతోపాటు విద్యుత్ స్తంభాల ఏర్పాటు అవసరాన్ని నమోదు చేశారు. ఉపసర్పంచ్ సద్దాం హుస్సేన్, వార్డు సభ్యులు బోనాల బాబు పాల్గొన్నారు.

February 23, 2026 / 08:32 PM IST