PPM: జిల్లాలో మార్చి 2వ తేదీ నుండి 13 వరకు జరగనున్న 10వ తరగతి, ఇంటర్మీడియట్ సార్వత్రిక (ఓపెన్ స్కూల్) పరీక్షలకు పక్కా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ డా:ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏపీ ఓపెన్ స్కూల్ పరీక్షలకు సంబంధించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓపెన్ స్కూల్ పరీక్షలు ప్రశాంతంగా జరగాలన్నారు.
PDPL: మిర్జాపూర్లో ఇవాళ నిర్వహించిన ‘సంఘటన సృజన అభియాన్’ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, పరిగి ఎమ్మెల్యే రామ్ మోహన్ రెడ్డితో కలిసి ఆయన గ్రామస్థులతో సమావేశమయ్యారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు.
MLG: గోవిందరావుపేట మండల కేంద్రంలో గత 15 రోజుల్లో ఐదు చోట్ల దొంగతనాలు జరగడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. SC కాలనీలో బంగారు ఆభరణాలు, చికెన్ సెంటరులో నగదు అపహరణకు గురవ్వగా, సోమవారం రాత్రి ప్రధాన రహదారిపైన ఉన్న కిరాణా దుకాణంలో రూ. 50 వేల నగదు చోరీకి గురైంది. వరుస ఘటనలతో రాత్రి వేళల్లో ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు.
ICC ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేశారు. జూన్ 12 నుంచి జూలై 5 వరకు ఈ మెగాటోర్నీ జరగనుంది. ఈ టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్ జూన్ 14న పాకిస్తాన్‌తో తలపడనుంది. 17న నెదర్లాండ్స్‌తో, 21న సౌతాఫ్రికాతో, 25న బంగ్లాదేశ్‌తో, 28న ఆస్ట్రేలియాతో ఆడనుంది. జూలై 5న లార్డ్స్ వేదికగా ఫైనల్ జరగనుంది.
NGKL: కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం ఇందిరమ్మ మోడల్ హౌస్ ను మంత్రి జూపల్లి కృష్ణారావు నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం నియోజకవర్గంలో ప్రతి అర్హుడికి సొంత ఇంటి కల నిజం చేస్తామని, పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని ఆయన హామీ ఇచ్చారు.
KMM: సత్తుపల్లి భారీ సైబర్ మోసం కేసులో ప్రధాన నిందితుడు ఉడతనేని వికాస్ చౌదరి సహా 14 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సుమారు రూ. 547 కోట్ల అక్రమ లావాదేవీలకు సంబంధించి కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ ఈ వివరాలను వెల్లడించారు. అంతర్జాతీయ ముఠాలతో సంబంధాలున్న ఈ నిందితులు అమాయకుల ఖాతాల ద్వారా నగదును విదేశాలకు మళ్లించారని తెలిపారు.
AP: శాంతిభద్రతలు కాపాడతామనే నమ్మకంతోనే కూటమిని ప్రజలు గెలిపించారని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. గత ఐదేళ్ల పాలనలో శాంతిభద్రతలు లేకనే పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లారని అన్నారు. శాంతిభద్రతలు బాగుండటం వల్లే ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు 25 శాతం వరకు తగ్గాయని హోంమంత్రి వెల్లడించారు.
KRNL: ఆదోని బావాజీ పేట రెండో వార్డ్‌లో రూ. 800,000 విలువైన కొత్త డ్రైనేజ్ పనులు ఇవాళ ప్రారంభించబడ్డాయి. డాక్టర్ వాల్మీకి ఎమ్మెల్యే పార్థసారథి ఆదేశాల మేరకు ఈ పనుల ప్రారంభానికి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఛైర్ పర్సన్ లోకేశ్వరి, మున్సిపల్ కమిషనర్ నయం, ఏఈ, డీఈ, కాంట్రాక్టర్ రఘు, వార్డ్ కౌన్సిలర్ ఏవి సురేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
SRCL: నకిలీ సిగరేట్ల అమ్మకాలపై వేములవాడలో మంగళవారం టాస్క్ ఫోర్స్ సీఐ నటేష్ ఆధ్వర్యంలో ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. వేములవాడ పట్టణంలో పలు కిరాణా, సూపర్ మార్కెట్, పాన్ షాప్‌లలో ఆకస్మిక దాడులు నిర్వహించినట్లు టాస్క్‌ఫోర్స్ సీఐ తెలిపారు. సీఐ మాట్లాడుతూ.. జిల్లాలో నకిలీ సిగరేట్ల విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు, దాడులు నిర్వహిస్తున్నామన్నారు.
అనకాపల్లి జిల్లా ఏఆర్ బలగాలకు కైలాసగిరిలో నిర్వహించిన వార్షిక డీ మొబలైజేషన్ మంగళవారం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా మాట్లాడుతూ.. 15 రోజులు పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోలీసులు నూతన దృక్పథంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.
VSP: ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో గాదిరాజు ప్యాలెస్‌లో ‘సర్క్యులర్ ఎకానమీ & గ్రీన్ కంపెనీస్’ అంశంపై కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రారంభించారు. పర్యావరణ హితమైన పారిశ్రామిక విధానాల ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించడమే ప్...
AP: గత పాలకులు ఆలయాలపై దాడులు జరిగిన పట్టించేకోలేదని సీఎం చంద్రబాబు ఆరోపించారు. గత ప్రభుత్వం హయాంలో అందరూ బాధితులే. లడ్డూ కల్తీపై అందరూ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, మా ప్రభుత్వంలో నాలుగు అంశాలపై దృష్టి పెట్టాం. అన్నదానం, ప్రాణదానం, శ్రీవారి సేవకులు, వేంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణం పనులు చేపట్టనున్నాం’ అని పేర్కొన్నారు. లడ్డూ కల్తీ ముమ్మాటికీ కుట్రే అని విమర్శించారు.
PDPL: పెద్దపల్లి మార్కెట్ యార్డులో మంగళవారం పత్తి వ్యాపారం సజావుగా సాగింది. కనిష్ఠ ధర రూ. 5,707, గరిష్ఠ ధర రూ. 7,464గా నమోదయ్యాయి. మోడల్ ధర రూ. 7,053గా ఉంది. మొత్తం 524 సంచులు, 560.68 క్వింటాళ్ల పత్తి మార్కెట్కు వచ్చింది. 221 మంది రైతులు తమ పత్తిని మార్కెట్కు తీసుకువచ్చారు. మార్కెట్ యార్డులో ఎలాంటి సమస్యలు లేకుండా కొనుగోలు ప్రశాంతంగా జరిగాయి.
NZB: ఆదిలాబాద్ వెళ్తున్న మాజీ మంత్రి KTRకు ఆర్మూర్లో బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా KTR మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ, పెన్షన్ల పెంపు గురించి అడిగితే ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అరాచకాలను బయటపెడతామని హెచ్చరించారు.
WGL: నెక్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఎస్సై మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనదారులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సంపేట MLA దొంతి మాధవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వాహనదారులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. వాహనదారులు ప్రతి ఒక్కరు ఎలిమెంట్ ధరించి వాహనం నడపాలని కోరారు.