• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆరోగ్యం

కరివేపాకుతో జుట్టు రాలడానికి చెక్..!

కరివేపాకును కేవలం పోపులో వాడి పక్కన పడేయకుండా, పొడి రూపంలోనో లేదా పచ్చిగానో తీసుకోవడం వల్ల జుట్టు రాలడం గణనీయంగా తగ్గుతుంది. ఇందులో ఉండే బీటా-కెరోటిన్, ప్రోటీన్లు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. అంతేకాకుండా, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, కాలేయ ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది.

February 25, 2026 / 10:20 PM IST

నానబెట్టిన బాదంతో ప్రయోజనాలు ఇవే..!

బాదం పప్పులను నేరుగా తినడం కంటే, రాత్రంతా నానబెట్టి పొట్టు తీసి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. బాదం పొట్టులో ఉండే ‘టానిన్’ అనే పదార్థం, పోషకాలను మన శరీరం సరిగ్గా గ్రహించకుండా అడ్డుకుంటుంది. పొట్టు తీసి తినడం వల్ల విటమిన్-E, ప్రోటీన్లు ఒంటికి బాగా పడతాయి. జుట్టు రాలడాన్ని తగ్గించి, చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి. అలాగే, జ్ఞాపకశక్తిని పెంచి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

February 25, 2026 / 09:08 PM IST

పచ్చి పాలు తాగడం ప్రమాదకరమా!

పచ్చి పాలు తాగొద్దని, చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ పాలు అయినా సరే పచ్చిగా తాగటం గాని, పాశ్చరైజ్ చేయకుండా ముట్టుకోవద్దని తెలిపారు. పచ్చి పాలల్లో సూక్ష్మ క్రిములు ఉంటాయని చెప్పారు. ఇళ్లలో బర్రెల నుంచి తీసిన పాలల్లోనూ సూక్ష్మ క్రిములు ఉంటాయని, అందువల్ల వేడి చేసుకుని తాగాలని సూచించారు.

February 25, 2026 / 06:51 PM IST

మెడ నొప్పితో ఇబ్బంది పడుతున్నారా?

గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చునేవారు ప్రతి గంటకోసారి చిన్నపాటి వ్యాయామాలు చేయాలి. మెడను నెమ్మదిగా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ దిశల్లో తిప్పడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. భుజాలను గుండ్రంగా తిప్పడం వల్ల మెడ కండరాలపై భారం తగ్గుతుంది. అలాగే భుజాలను పైకి, కిందకి కదల్చాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల సర్వైకల్ స్పాండిలైటిస్ రాకుండా జాగ్రత్త పడవచ్చు.

February 25, 2026 / 04:37 PM IST

మెరిసే చర్మం కోసం బియ్యంపిండి!

బియ్యప్పిండి చర్మ సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తుంది. తేమను పోనివ్వకుండానే మృతకణాలను, జిడ్డును తొలగిస్తుంది. స్పూన్ బియ్యప్పిండి, తేనె కలిపి ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత కడిగితే మంచి స్క్రబ్‌లా పనిచేస్తుంది. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్లు బియ్యంపిండికి తగినంత పెరుగుతో కలిపి వాడాలి. బియ్యప్పిండి, ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ కలిపి ప్యాక్‌లా వేస్తే జిడ్డు తగ్గుతుంది.

February 25, 2026 / 03:50 PM IST

లంచ్ తర్వాత నిద్రొస్తోందా..?

మధ్యాహ్నం భోజనం తర్వాత వచ్చే నీరసం, మగతను వదిలించుకోవడానికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. తిన్న వెంటనే నిద్రపోకుండా పది నిమిషాల పాటు నడవడం ఉత్తమం. శరీరంలో నీటి శాతం తగ్గకుండా తగినంత నీరు తాగాలి. ఒకేసారి అతిగా తినకుండా, తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తీసుకోవాలి. అలాగే రాత్రిపూట కంటినిండా నిద్ర ఉంటే మరుసటి రోజు ఉత్సాహంగా ఉండొచ్చు.

February 25, 2026 / 01:13 PM IST

గ్రీన్ టీతో బెల్లీ ఫ్యాట్‌ తగ్గుతుందా?

గ్రీన్ టీ బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే కాటెచిన్స్, కెఫీన్ మెటబాలిజంను వేగవంతం చేసి, కొవ్వును కరిగించడంలో తోడ్పడతాయి. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, కేవలం గ్రీన్ టీ తాగడం వల్ల మాత్రమే బరువు తగ్గరు. దీంతో పాటు సరైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

February 25, 2026 / 12:34 PM IST

డీహైడ్రేషన్‌కు సంకేతం ఇదే..!

శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు డీహైడ్రేషన్ సంభవిస్తుంది. ఇలాంటి సమయంలో తీవ్రమైన దాహం, నోరు ఆరిపోవడం, తలనొప్పి, అలసటగా అనిపిస్తుంది. మూత్రం ముదురు పసుపు రంగులో రావడం డీహైడ్రేషన్‌కు ప్రధాన సంకేతం. అలాగే చర్మం పొడిబారడం, కళ్లు లోతుకు వెళ్లడం, మలబద్ధకం వంటివి కనిపిస్తాయి. తగినంత నీరు లేదా ORS తాగితే కాస్త ఉపశమనం కలుగుతుంది.

February 25, 2026 / 11:48 AM IST

మట్టి కుండ నీళ్లతో ఇన్ని లాభాలా..?

ఎండాకాలంలో ఉదయాన్నే మట్టికుండలో నీటిని తాగడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఇవి తాగడం వల్ల శరీరానికి మినరల్స్‌, ఎలక్ట్రోలైట్స్‌ అందడంతో పాటు శరీరం ఎనర్జిటిక్‌గా ఉంటుంది. మట్టి కుండలో నిల్వ చేసిన నీళ్లు తాగటం వల్ల గ్యాస్, అసిడిటీ, శ్వాసకోశ సమస్యలు రావు. అలాగే జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది. డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం పొందవచ్చు.

February 25, 2026 / 10:20 AM IST

పచ్చి మొలకలతో హెల్తీ బ్రేక్‌ఫాస్ట్

ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌గా మొలకెత్తిన గింజలను తింటే ఆరోగ్యంగా ఉంటారు. బరువు తగ్గాలనుకునే వారికి, షుగర్ కంట్రోల్‌ ఉండాలనుకునే వారికి మొలకలు మంచివి. వీటిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శాఖాహారులకు మొలకలు ప్రొటీన్స్ సోర్స్‌గా చెప్పవచ్చు. వీటిలో ఉండే అమైనో యాసిడ్స్ కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది. వీటిలో విటమిన్ A, C, K , బి-కాంప్లెక్స్ ఉంటాయి.

February 25, 2026 / 07:36 AM IST

క్రౌంచాసనం వల్ల కలిగే ఉపయోగాలు

క్రౌంచాసనం అనేది డయాబెటిస్ నియంత్రణకు, శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడే యోగాసనం. ఇది నేలపై కూర్చుని ఒక కాలును మడిచి, రెండో కాలును పైకి చాచి చేతులతో పట్టుకోవడం ద్వారా చేస్తారు. ఇది శరీర సమతుల్యతను, కాళ్ల బలాన్ని పెంచుతుంది. ఈ ఆసనం వేసే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

February 25, 2026 / 06:30 AM IST

చిన్న వయసులోనే ముసలితనం.. జాగ్రత్తపడండి!

ఒత్తిడి, కాలుష్యం, నిద్రలేమి వల్ల చర్మం త్వరగా ముడతలు పడుతోంది. వీటిని అరికట్టాలంటే పోషకాహారం, మంచి నిద్ర అవసరం. చర్మ సంరక్షణలో భాగంగా రోజూ సన్‌స్క్రీన్, విటమిన్-C, నియాసినమైడ్ సీరమ్ వాడాలి. ఇలాంటి క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పాటిస్తే మీ చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా, ఆరోగ్యంగా కాంతివంతంగా మెరుస్తుంది.

February 24, 2026 / 10:30 PM IST

ఫ్రూట్ జామ్ వాడుతున్నారా?

బ్రెడ్ మీద ఫ్రూట్ జామ్ రాసుకుని తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మార్కెట్‌లో దొరికే చాలా జామ్‌లలో పండ్ల శాతం కంటే పంచదార, కృత్రిమ రంగులే ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. వీటికి బదులుగా ప్రొటీన్ ఉండే పీనట్ బటర్ లేదా ఇంట్లో తాజాగా చేసుకున్న చట్నీలను వాడటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

February 24, 2026 / 05:45 PM IST

అతిగా హెడ్ ఫోన్లు వాడుతున్నారా..?

ఇయర్ బడ్లు, హెడ్ ఫోన్ల అతి వాడకం వల్ల ఇన్ఫెక్షన్లు, టిన్నిటస్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. వీటిని నివారించడానికి నిపుణులు 60:60 నియమాన్ని సూచిస్తున్నారు. అంటే 60 శాతం వాల్యూమ్ వద్ద, కేవలం 60 నిమిషాలు మాత్రమే వాడాలి. ఆ తర్వాత చెవులకు విశ్రాంతి ఇవ్వడం వల్ల వినికిడి శక్తిని కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

February 24, 2026 / 05:02 PM IST

చర్మ సౌందర్యం కోసం ఈ చిట్కాలు!

చర్మం అందంగా ఉండాలంటే శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడాలి. ఇందుకోసం రన్నింగ్, యోగా వంటి వ్యాయామాలు తప్పనిసరి. చక్కెర, ఉప్పు తగ్గించి.. ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు డైట్‌లో చేర్చుకోవాలి. నీరు, మజ్జిగ, పండ్ల రసాలు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. అలాగే, ముఖానికి మర్దన చేయడం వల్ల చర్మ రంధ్రాల్లోని దుమ్ము, మురికి తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.

February 24, 2026 / 03:26 PM IST