RO పద్ధతిలో నీటిని వడకట్టినప్పుడు కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా పోతాయి. చాలా తక్కువ TDS ఉన్న నీటిని దీర్ఘకాలం తాగితే గుండె సమస్యలు, ఎముకల బలహీనత వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఈ ఖనిజాల లోపాన్ని సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా భర్తీ చేయొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
రోజుకు కనీసం 2-3 లీటర్ల నీళ్లు తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది. ప్రతిరోజు కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్ తాగాలి. సబ్జా గింజలను నీళ్లలో నానబెట్టి తాగితే ఫలితం ఉంటుంది. పుచ్చకాయ, దోసకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవాలి. మజ్జిగతో వేడి తగ్గుతుంది. గోరువెచ్చని పాలలో తేనె కలిపి రోజూ తాగాలి. డైలీ ఒక స్పూన్ మెంతులను ఆహారంలో చేర్చుకోవాలి.
పూరీ బెలూన్‌లా ఉబ్బడం వెనుక ఒక చక్కని సైన్స్ ఉంది. పిండిలోని గ్లూటెన్ అనే ప్రోటీన్ ఒక సాగే పొరలా ఏర్పడి, వేడికి పుట్టే ఆవిరిని బయటకు పోనివ్వకుండా బంధిస్తుంది. నూనెలోని అధిక వేడి వల్ల పిండిలోని తేమ త్వరగా ఆవిరిగా మారుతుంది. ఈ ఆవిరి కలిగించే ఒత్తిడి వల్ల పూరీ ఉబ్బుతుంది. బయటి పొర గట్టిపడటం వల్ల ఆ ఆవిరి లోపలే ఉండి పూరీకి ఆ ఆకారాన్ని ఇస్తుంది.
లోకంలో కొందరు ఎప్పుడూ ఎదుటివారిలో తప్పులు వెతకడానికే ప్రయత్నిస్తుంటారని విదురుడు చెప్పారు. ఒక దుర్మార్గుడు ఇతరులలో ఉన్న ఆవగింజ అంత చిన్న తప్పును కూడా భూతద్దంలో చూసి విమర్శిస్తాడు. కానీ, తనలో ఉన్న మారేడు కాయ అంత పెద్ద తప్పును కూడా ఏమాత్రం గమనించడు, తెలిసినా అంగీకరించడు. ఎప్పుడూ పక్కవారి లోపాలు ఎత్తిచూపే వారు తమను తాము ఎప్పటికీ సరిదిద్దుకోలేరని విదుర నీతి సారాంశం.
గోరక్షాసనం (కౌహెర్డ్ పోజ్) అనేది యోగాలో ఒక ముఖ్యమైన ఆసనం. ఇది శరీర సమతుల్యతను మెరుగుపరుస్తుంది. తోక ఎముక ఫ్లెక్సిబిలిటీని పెంచి, కదలికలను సులభతరం చేస్తుంది. కాళ్ల కండరాలను స్ట్రెచింగ్ చేసి, టోన్ చేయడం ద్వారా వాటిని బలోపేతం చేస్తుంది. శరీరం, మనస్సు మధ్య సమతుల్యతను పెంపొందిస్తుంది. నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది. శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిది.
వేసవిలో వడదెబ్బ, డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవడానికి సోంపు నీరు అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఇది తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి, చల్లదనం లభిస్తుంది. అలాగే, ఎసిడిటీ, కడుపులో మంట వంటి సమస్యలను దూరం చేస్తుంది. పుచ్చకాయ, కొబ్బరి నీళ్లతో పాటు సోంపును డైట్‌లో చేర్చుకోవడం వల్ల వేసవిలో ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
భోజనం తర్వాత మజ్జిగ తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను వేగవంతం చేసి.. గ్యాస్, ఎసిడిటీ సమస్యలను తగ్గిస్తాయి. మజ్జిగ మసాలా ఆహారం వల్ల కలిగే మంటను తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది. తక్కువ క్యాలరీలతో కడుపు నిండిన భావన కలిగిస్తుంది. తద్వారా బరువు నియంత్రణలో ఉంటుంది. రోజూ మజ్జిగ తాగడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
కలబంద ముఖంపై మొటిమలు, మచ్చలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కలబంద గుజ్జు, పసుపు, రోజ్‌వాటర్, శెనగపిండి కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే కలబందలో తేనె, పసుపు కలిపి రాస్తే చర్మం శుభ్రపడి వాపు తగ్గుతుంది. జిడ్డు చర్మం వారు నిమ్మరసం కలిపి వాడితే ముఖం కాంతివంతంగా మారుతుంది.
ఉదయం లేవగానే నోరు చేదుగా ఉండటానికి ప్రధాన కారణం డీహైడ్రేషన్ (నీరు తక్కువగా తాగడం). అలాగే నోటి శుభ్రంగా లేకపోవడం, జలుబు, ఇన్ఫెక్షన్లు లేదా కొన్ని మందుల ప్రభావం వల్ల కూడా ఇలా జరుగుతుంది. యాసిడ్ రిఫ్లక్స్, ధూమపానం వంటి అలవాట్లు కూడా దీనికి కారణమే. తగినంత నీరు తాగుతూ, ఆరోగ్యకరమైన అలవాట్లు పాటిస్తే ఈ సమస్యను సులభంగా దూరం చేసుకోవచ్చు.
కొన్ని చిట్కాలతో వెన్నునొప్పిని తగ్గించుకోవచ్చు. కూర్చున్నప్పుడు, నిల్చున్నప్పుడు వెన్నుముక నిటారుగా ఉంచాలి. రోజూ నడక, యోగా లేదా స్ట్రెచింగ్ చేయడం వల్ల కండరాలు దృఢపడతాయి. అధిక బరువు వెన్నుపై ఒత్తిడిని పెంచుతుంది. అందుకే బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. నొప్పి ఉన్నచోట ఐస్ ప్యాక్ లేదా హాట్ వాటర్ బ్యాగ్ వాడాలి. వెన్నుకు సపోర్ట్ ఇచ్చేలా గట్టి పరుపుపై పడుకోవాలి.
సగ్గుబియ్యం శరీరానికి తక్షణ శక్తినిచ్చే అద్భుతమైన ఆహారం. ఇందులో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీర వేడిని తగ్గించి, పొట్టను చల్లబరుస్తుంది. గ్యాస్, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను నివారించడంలో మేలు చేస్తుంది. ఇందులో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా మారుస్తుంది. గుండె సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.
ఉదయాన్నే వ్యాయామం లేదా జిమ్ చేసేవారికి అరటి పండు దివ్యౌషధంలా పనిచేస్తుంది. అరటిపండులో ఉండే సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్లు శరీరానికి వేగంగా శక్తిని అందిస్తాయి. ఇందులోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ బి6 మెదడు పనితీరును మెరుగుపరుస్తూ.. రోజంతా మన మూడ్‌ని ఉత్సాహంగా, ఒత్తిడి లేకుండా ఉంచడానికి దోహదపడుతుంది.
మీ ప్రపంచాన్ని విస్తరించుకోవాలంటే రొటీన్‌కు భిన్నంగా ఆలోచించండి. కొత్త ప్రదేశాలు, వినూత్న మార్గాల అన్వేషణే మీకు సరికొత్త అనుభవాలను అందిస్తాయి. నిరంతరం ప్రశ్నలు అడుగుతూ, కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉంటేనే అద్బుతమైన అవకాశాలు వస్తాయి. మీ పరిధిని దాటి అడుగులు వేసినప్పుడే జీవితంలో నిజమైన ఎదుగుదల, విజయాలు సాధ్యమవుతాయి.
చక్కీ చలానాసనం (మిల్ చర్నింగ్ పోజ్) జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పొత్తికడుపు కండరాలను ఉత్తేజపరుస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఈ ఆసనం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగి ఉదర భాగం టోన్ అవుతుంది. వెన్నెముక, తుంటి, భుజాలను సాగదీయడం ద్వారా ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది. వెన్నుపాముకు మంచి వ్యాయామం కావడం వల్ల నడుము నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
అరటి పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ కొందరు వీటిని తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలర్జీ, శ్వాసకోస సమస్యలు, ఆస్తమా బాధితులు తినకూడదు. మలబద్ధకం ఉన్న వారు తింటే అది మరింత తీవ్రం కావచ్చు. కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఎక్కువగా తినకూడదు. బీపీ, షుగర్ ఉన్నవారు తినకుంటేనే మంచిది. అరటిలో చక్కెర శాతం ఎక్కువ కాబట్టి వీరికి అంతగా మేలు చేయదు.