• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

‘దక్షిణాది సినిమాలకు ‘ధురంధర్‌ 2’ సవాల్‌’

పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్న దక్షిణాది చిత్రాలకు ‘ధురంధర్‌ 2’ రూపంలో గట్టి పోటీ ఎదురుకాబోతుందని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అభిప్రాయపడ్డాడు. దక్షిణాది సినిమాలు సృష్టించిన బెంచ్ మార్క్‌ను ఈ సినిమా తుడిచేసే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ప్రేక్షకులు ఒక్కసారి ఈ తరహా సినిమా రుచి చూస్తే.. రొటీన్ మసాలా సినిమాలు ప్రమాదంలో పడినట్లేనని RGV హెచ్చరించాడు.

February 24, 2026 / 08:55 PM IST

ఐదోసారి జతకట్టనున్న క్రేజీ కాంబో..!

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, దర్శకుడు శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘వీరం’, ‘వేదాళం’, ‘వివేగం’, ‘విశ్వాసం’ వంటి చిత్రాలు ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు ఈ సక్సెస్‌ఫుల్ కాంబో మరో ప్రాజెక్ట్‌తో రాబోతోంది. అజిత్‌తో మరో సినిమా తీయబోతున్నట్లు శివ తాజాగా ప్రకటించాడు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తానని పేర్కొన్నాడు.

February 24, 2026 / 07:49 PM IST

BREAKING: ప్రముఖ నటుడు మృతి

ప్రముఖ టీవీ నటుడు మయాంక్ పవార్ (37) కన్నుమూశాడు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న అతడు ఈరోజు తుదిశ్వాస విడిచాడు. సినీ ప్రముఖులు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాగా, మయాంక్ ఏడుసార్లు మిస్టర్ ఇండియా టైటిల్ విన్నర్‌గా నిలిచాడు.

February 24, 2026 / 06:47 PM IST

‘ది కేరళ స్టోరీ-2’పై కోర్టు కీలక తీర్పు

‘ది కేరళ స్టోరీ-2’ టీజర్ దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఈ చిత్ర కథనం ఉందంటూ టీజర్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే దీనిపై కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. టీజర్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని చిత్రబృందాన్ని ఆదేశించింది. దీంతో టీజర్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

February 24, 2026 / 06:27 PM IST

విరోష్ పెళ్లి సందడి.. ఎయిర్‌పోర్ట్‌లో తరుణ్, ఈషా

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వేడుకల సందడి మొదలైపోయింది. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఫిబ్రవరి 26న వారి పెళ్లి జరగనుంది.  ఈ పెళ్లి వేడుకల కోసం ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులు ఉదయపూర్ చేరుకుంటున్నారు. దర్శకుడు తరుణ్ భాస్కర్, నటి ఈషా రెబ్బా జంటగా ఉదయపూర్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు  నెట్టింట వైరల్ అవుతోంది.

February 24, 2026 / 05:23 PM IST

రెండు సార్లు పెళ్లి చేసుకోనున్న ‘విజయ్-రష్మిక’

స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఈనెల 26న ఉదయ్‌పుర్‌లో ఘనంగా వివాహం చేసుకోనున్నారు. వీరి పెళ్లి తెలుగు, కన్నడ (కొడవ) సంప్రదాయాల ప్రకారం రెండు పద్ధతుల్లో జరగనుంది. ఉదయం తెలుగు పద్ధతిలో, సాయంత్రం కన్నడ సంప్రదాయంలో వివాహ వేడుకలు నిర్వహిస్తారు. దీంతో ఒకేరోజు వీరిద్దరూ రెండుసార్లు వివాహం చేసుకోబోతున్నారు. కాగా, మార్చి 3న HYDలో రిసెప్షన్ నిర్వహించనున్నారు.

February 24, 2026 / 05:15 PM IST

అత్యధిక ఫిల్మ్‌ఫేర్‌లు అందుకున్న హీరోలు

తెలుగు చిత్రసీమలో ఫిల్మ్‌ఫేర్ అవార్డుల సందడి ఎప్పుడూ ఎక్కువే. అత్యధికంగా 7 అవార్డులతో మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అగ్రస్థానంలో నిలిచారు. వీరి తర్వాత మహేష్ బాబు (5), శోభన్ బాబు, వెంకటేష్ (చెరో 4), ఏఎన్‌ఆర్, కృష్ణంరాజు, ఎన్టీఆర్, రామ్ చరణ్ మూడు అవార్డుల చొప్పున అందుకున్నారు.

February 24, 2026 / 05:08 PM IST

ప్రదీప్ చేతిలో 8 సినిమాలు.. రూ.25 కోట్ల పారితోషికం!

తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ క్రేజ్ మామూలుగా లేదు. ప్రస్తుతం ఆయన చేతిలో ఏకంగా 8 సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కో మూవీకి ప్రదీప్ రూ.25 కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట. ఆయనకున్న యూత్ ఫాలోయింగ్‌తో నిర్మాతలు అడిగినంత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, వచ్చే రెండేళ్ల వరకు ప్రదీప్ డేట్లు ఖాళీ లేవట. ఆయన షెడ్యూల్ అంతలా లాక్ అయిపోవడం హాట్ టాపిక్‌గా మారింది. 

February 24, 2026 / 04:46 PM IST

చరణ్‌ భక్తిని అనుమానించకండి: అల్లు శిరీష్

దుబాయ్ వేదికగా అల్లు శిరీష్ ఇచ్చిన పార్టీకి రామ్ చరణ్ అయ్యప్ప మాలలో హాజరవ్వడంపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. దీనిపై శిరీష్ స్పందిస్తూ.. ‘చరణ్ పార్టీ మొదలవ్వక ముందే వచ్చి, మమ్మల్ని ఆశీర్వదించి వెంటనే వెళ్లిపోయారు. అక్కడ మద్యం లేదు, అపచారం జరగలేదు. ఆయన భక్తిని ఎవరూ వేలెత్తి చూపలేరు’ అని ఘాటుగా బదులిచ్చాడు. విమర్శలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికాడు.

February 24, 2026 / 04:10 PM IST

‘కపుల్ ఫ్రెండ్లీ’ 10 రోజుల్లో కలెక్షన్స్ ఎంతంటే?

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతోంది. 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.12.67 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ తెరకెక్కించాడు.

February 24, 2026 / 03:57 PM IST

‘స్పిరిట్’లో విలన్‌గా కొరియన్ స్టార్!

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగాల ‘స్పిరిట్’ మూవీలో విలన్‌గా కొరియన్ స్టార్ డాన్ లీ నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ విషయంపై అభిమానులు వంగాను ప్రశ్నించగా.. ‘మీరు అనుకున్నట్టే జరుగుతుంది’ అని హింట్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో మార్చి 1న డాన్ లీ బర్త్ డే సందర్భంగా ఈ అంశంపై అధికారిక ప్రకటన లేదా ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

February 24, 2026 / 03:40 PM IST

కర్ణాటక హైకోర్టులో రణ్‌వీర్‌కు ఊరట

‘కాంతార’ సీన్ ఇమిటేషన్ వివాదంలో రణ్‌వీర్ సింగ్‌కు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. మతపరమైన మనోభావాలు దెబ్బతీశారన్న కేసులో అతనిపై ప్రస్తుతానికి కఠిన చర్యలు తీసుకోవద్దని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దర్యాప్తునకు రణ్‌వీర్ పూర్తిగా సహకరించాలని షరతు విధించింది. అజ్ఞానంతో చేసినా ఇలాంటి పనులు సరికాదని హితవు పలికింది. తదుపరి విచారణను మార్చి 2కు వాయిదా వేసింది.

February 24, 2026 / 03:21 PM IST

సేవ్‌ పునర్విక.. ఆ చిన్నారి కోసం మంచు మనోజ్‌ పోస్ట్

చిన్నారి పునర్వికను కాపాడుకునేందుకు తెలుగు రాష్ట్రాల యువత ఏకమై విరాళాలు సేకరిస్తుండటంపై నటుడు మంచు మనోజ్ స్పందించాడు. పాప పరిస్థితి తెలిసి తన హృదయం ముక్కలైందని, ఆమెకు పునర్జన్మ నివ్వాలని ఆకాంక్షించాడు. సాయం కోసం పీఎంఓ, ఇరు రాష్ట్రాల సీఎంలను ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం పాప ఆరోగ్యం దృష్ట్యా ఎవరూ కలవడానికి ప్రయత్నించవద్దని, ఆమె కోలుకుంటే అందరం గెలిచినట్లేనని మనోజ్ పేర్కొన్నాడు.

February 24, 2026 / 03:16 PM IST

మణిపూర్ మూవీకి అవార్డు.. మోదీ ట్వీట్‌పై నెటిజన్ల ఆగ్రహం

మణిపురి చిత్రం ‘బూంగ్’ ప్రతిష్టాత్మక BAFTA 2026 అవార్డు గెలవడంపై ప్రధాని మోదీ చేసిన ట్వీట్ వివాదానికి దారితీసింది. మణిపూర్‌కు ఇది గర్వకారణమని ఆయన పేర్కొనగా.. నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. రాష్ట్రం అట్టుడుకుతున్నప్పుడు స్పందించని ప్రధాని, ఇప్పుడు క్రెడిట్ తీసుకోవడం బాధ్యతారాహిత్యమని ఫైరవుతున్నారు. సమస్యల నుంచి దృష్టి మళ్లించడమేనని మండిపడుతున్నారు.

February 24, 2026 / 02:01 PM IST

‘ది కేరళ స్టోరీ 2’పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

‘ది కేరళ స్టోరీ 2’పై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమా రాష్ట్ర ప్రతిష్టను, మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉందన్న పిటిషన్‌పై విచారణ చేపట్టింది. కేరళను తప్పుగా చిత్రీకరించడం వల్ల ఉద్రిక్తతలు తలెత్తే ఛాన్స్ ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. సెన్సార్ సర్టిఫికేట్‌పై నిర్ణయం తీసుకునే ముందు, ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయాలని కోర్టు నిర్మాతలను ఆదేశించింది.

February 24, 2026 / 01:46 PM IST