విక్టరీ వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం’ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో తమిళ కమెడియన్ యోగిబాబు భాగం కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆయనపై త్రివిక్రమ్ చాలా కామెడీ సన్నివేశాలను ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
తమిళ నటుడు విజయ్ సేతుపతి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో ఓ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించనుండగా.. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించనున్నట్లు టాక్. 2026 వేసవిలో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం విజయ్ ‘పాకెట్ నావెల్’తో, సాయి పల్లవి ‘రామాయణ’తో బిజీగా ఉన్నారు.
దర్శకుడు సంపత్ నందితో హీరో శర్వానంద్ ‘భోగి’ సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్‌కు డేట్, టైం ఖరారైంది. ఫిబ్రవరి 25న ఉదయం 10:14 గంటలకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. కాగా, ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో రాబోతున్న మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ చిత్రంలోని ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ సాంగ్ రిలీజైన 24 గంటల్లోనే 11.44 మిలియన్ వ్యూస్ సాధించి, ‘పుష్ప-2’లోని ‘సూసేకి’ పాట రికార్డును (10.97M) అధిగమించింది. శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం 2026 మార్చి 26న గ్రాండ్‌గా విడుదల కానుంది.
‘కార్తికేయ-2’ షూటింగ్‌లో జరిగిన ఒక విషాదకర ఘటనను నటి అనుపమ పరమేశ్వరన్ గుర్తు చేసుకుంది. సెట్‌లో తాను ఎంతో ఇష్టంగా ఆడుకున్న మేకపిల్లనే, యూనిట్ సభ్యులు మటన్ బిర్యానీగా వడ్డించారని తెలిపింది. ఆ విషయం తెలియగానే అక్కడికక్కడే వాంతులు చేసుకున్నానని, అప్పటి నుంచి మటన్ తినడం మానేశానని ఆవేదన వ్యక్తం చేసింది.
నందమూరి బాలకృష్ణతో దర్శకుడు పూరి జగన్నాథ్ మరో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాలయ్య కోసం, ఆయన బాడీ లాంగ్వేజ్‌కు తగినట్లు పవర్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ కథను సిద్ధం పూరి చేశాడట. అయితే బాలకృష్ణకు కథ వినిపించాల్సి ఉందని టాక్ వినిపిస్తోంది. కాగా, గతంలో వారి కాంబోలో ‘పైసా వసూల్’ మూవీ వచ్చి ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే.
డయాబెటిస్ ఉన్నవారికి దాల్చిన చెక్క అద్భుత వరమని నిపుణులు చెబుతున్నారు. ఉదయం టీ/కాఫీలో చక్కెర బదులు దీన్ని వాడటం లేదా దాల్చిన చెక్క నీరు తాగడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇది బరువు తగ్గించడమే కాకుండా.. గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మెరుగైన జీర్ణక్రియకు, ఇతర ఉదర సంబంధిత సమస్యల నివారణకు ఇది తోడ్పడుతుంది.
నందమూరి బాలకృష్ణ ‘ఆదిత్య 369’కు సీక్వెల్‌గా ‘ఆదిత్య 999 మ్యాక్స్’ రాబోతుంది. ఈ మూవీతో బాలయ్య తనయుడు మోక్షజ్ఞ నటుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ మూవీ స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ పూర్తయినట్లు సమాచారం. మార్చిలో ఈ సినిమాను స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమా భారీ సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్, టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో రూపొందనున్నట్లు టాక్.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ వేడుకలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ఐటీసీ మెమెంటోస్ హోటల్‌లో ఇవాళ సంగీత్, మెహందీ, రేపు హల్దీ జరగనున్నాయి. ఫిబ్రవరి 26న కేవలం 100 మంది అతిథుల మధ్య వీరి పెళ్లి జరగనుంది. తాజాగా రష్మిక షేర్ చేసిన ‘విరోష్’ గ్రీన్ థీమ్ మెనూ, విజయ్ స్విమ్మింగ్ పూల్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పోస్ట్ చేశాడు. ‘నీ ఇష్టం శ్రీకాంత్’ అని నాని అన్నప్పుడల్లా, తనపై ఉన్న నమ్మకం చూసి భయమేస్తుందని అన్నాడు. ‘దసరా’ కోసం నానిని ఎంతో హింసించినా, నియమాలు ఉల్లంఘించినా ఆయన తనను ప్రోత్సహించారని తెలిపాడు. తనను నమ్మిన ‘ధరణి’కి, ఇప్పుడు నమ్ముతున్న ‘జడల్’ (ది ప్యారడైజ్)కి రుణపడి ఉంటానంటూ నానికి...
ఇవాళ నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన నాని ‘అష్టా చమ్మా’తో హీరోగా మారాడు. తన సహజ నటనతో ‘నేచురల్ స్టార్’గా ఎదిగాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నానికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇక నాని ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ సినిమాతో బిజీగా ఉన్నాడు.
శరీర బరువు కారణంగా తాను ట్రోలింగ్ ఎదుర్కొన్నట్లు ఓ ఇంటర్వ్యూలో నటి మృణాల్ ఠాకూర్ చెప్పింది. ‘నాకు ఇంకా ఆ రోజులు గుర్తున్నాయి. ఏడుస్తూ నిద్రపోయి.. ఉబ్బిన కళ్లలో మేల్కొన్న రోజులు ఉన్నాయి. శరీరాకృతి కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అనుకునేదాన్ని. దాన్ని అధిగమించడానికి చాలా ధైర్యం కావాలి. అప్పుడే అర్థమైంది.. మనం ఎలా ఉన్నా నచ్చేవాళ్లకు నచ్చుతాం’ అని పేర్కొంది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన సినిమా ‘విశ్వంభర’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తెలుగు నూతన సంవత్సరం ఉగాదికి ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక గ్లింప్స్ ద్వారా విడుదల తేదీని వెల్లడించాలని సన్నాహాలు చేస్తున్నారట. అయితే 2026 జూన్‌లో ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు టాక్.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ మూవీ ‘కల్కి 2898ఏడీ’. భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా రెండో భాగం షూటింగ్ మొదలైంది. హైదరాబాద్ శంకర్‌పల్లి సమీపంలో అమితాబ్ బచ్చన్‌పై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈనెలాఖరు నుంచి ప్రభాస్ షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు సమాచారం. కమల్‌హాసన్ మార్చి తర్వాత సెట్‌లోకి వస్తారు.
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ‘ఫౌజీ’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం ఇప్పటికే 70 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. రాబోయే షెడ్యూల్‌లో 20 నిమిషాల పాటు సాగే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది సినిమాకే ప్రధాన హైలైట్‌గా నిలవబోతుందట. ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.