నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్లోని వెస్ట్ బుకింగ్ కౌంటర్ వద్ద గుర్తు తెలియని (45) వ్యక్తి శనివారం రాత్రి మృతి చెందారు. అనారోగ్యంతో మృతి చెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో ఆ వ్యక్తిని గుర్తించలేకపోయారు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం GGHకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
NLR: వలేటివారిపాలెం మండలం పొన్నలూరు మండలం మాలపాడు సరిహద్దు ప్రాంతంలో నిర్వహిస్తున్న కోడిపందేల స్థావరంపై శనివారం పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పందేల్లో పాల్గొన్న 23 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 3 కోడిపుంజులు, 23 సెల్ ఫోన్లు, రూ.42,860 నగదును స్వాధీనం చేసుకున్నారు.
TG: కామారెడ్డి జిల్లా కేంద్రంలో చిన్నారుల మిస్సింగ్ కేసు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నిన్న ఉదయం అదృశ్యమైన షీపత్(8), ఆయాత్(7), మరియం(5) రాత్రికి స్థానిక పెద్దచెరువులో విగతజీవులుగా కనిపించారు. కన్న తండ్రి ఇస్మాయిలే తన పిల్లలను హత్యచేశాడనే అనుమానాల నేపథ్యంలో పోలీసులు విచారించగా.. అతను నేరం అంగీకరించాడు. దీంతో ఇస్మాయిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
సత్యసాయి: మడకశిరలోని ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని శనివారం డిప్యూటీ డీఈవో జాన్ రెడ్డెప్ప తనిఖీ చేశారు. పరీక్షలో కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు విద్యార్థులను గుర్తించి వారిని డిబార్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పరీక్ష కేంద్రం అధికారిపై సస్పెన్షన్ వేటు వేశారు. పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ATP: తాడిపత్రి శివాలయం సమీపంలో బైపాస్ రోడ్డుపై బొలెరో వాహనంలో 35 బస్తాల్లో తరలిస్తున్న 15.75 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని శనివారం సీఐ ఆరోహణరావు సీజ్ చేశారు. యాడికి మండలం కేశవరాయునిపేటకు చెందిన వాహన యజమాని గంగాధర్, డ్రైవర్ కంబన్నను అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని సీఎస్ఈటీ మల్లేష్‌కు అప్పగించారు.
తూర్పు గోదావరి జిల్లాలో నియమాలను ఉల్లంఘించి అధిక లోడ్‌తో ఇసుక రవాణా చేస్తున్న రెండు లారీలపై చర్యలు తీసుకున్నట్లు జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో అధిక లోడ్‌తో ఇసుక రవాణా చేస్తున్న వాహనాలను గుర్తించామన్నారు. కేసులు నమోదు చేసి రూ. 1,74,000 అపరాధ రుసుం విధించి వసూలు చేస్తామన్నారు.
నెల్లూరు నుంచి గూడూరు మధ్య రామేశ్వరం వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలులో పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు. జనరల్ బోగీలోని ఒక బ్యాగ్ అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు తెరిచి పరిశీలించారు. అందులో 9 కేజీల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అప్పటికి నిందితుడు పరారయ్యాడని రైల్వే డీఎస్సీ మురళీధర్ తెలిపారు.
AP: కామారెడ్డిలో చిన్నారుల మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. కనిపించకుండా పోయిన ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. పెద్ద చెరువులో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యం కాగా.. మరో చిన్నారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
TG: కామారెడ్డిలో ఐదుగురు చిన్నారులు అదృశ్యమయ్యారు. నిన్న గోసంగి కాలనీకి చెందిన సింహాద్రి(10), విజయ్(09).. ఇవాళ RBనగర్ కాలనీకి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు కనిపించకుండాపోయారు. ఉదయం ఇంటి నుంచి తండ్రితో కలిసి ఆటోలో ముగ్గురు చిన్నారులు వెళ్లారు. పిల్లలను షాపు వద్ద దింపేసి కిరాయికి వెళ్లానని పిల్లల తండ్రి చెబుతున్నాడు. PSలో చిన్నారుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
AP: పోలవరం జిల్లా అడ్డతీగల మండలం కృష్ణవరంలో పెద్దపులి మరోసారి పంజా విసిరింది. గంగవరం మండలం ట్యాంకుబీడు నుంచి రాత్రి కృష్ణవరం చేరుకున్న పులి.. ఆవు, దూడలపై దాడి చేసి చంపేసింది. రెండు రోజుల తర్వాత మళ్లీ ఓ ఆవుపై దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అధికారులు ఇప్పటికే ట్యాంకుబీడు నుంచి బోనులు తరలించి, పులిని బంధించేందుకు చర్యలు చేపట్టారు.
భారత్, శ్రీలంక, నేపాల్ దేశాల మధ్య విస్తరించిన భారీ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను NCB అధికారులు ఛేదించారు. తమిళనాడు తూత్తుకుడిలో 78 కిలోల హ్యాష్ ఆయిల్, తెలంగాణ రాయికల్ వద్ద 2 కిలోల చరస్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.10 కోట్లు ఉంటుందని అంచనా. ఈ కేసులో శ్రీలంక జాతీయుడితో పాటు ఐదుగురు నిందితులను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.
AP: డ్రగ్స్, గంజాయి నిర్మూలన కోసం పోలీసులు, ఈగల్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ‘వజ్ర ప్రహార్’ పేరిట ఈ తెల్లవారుజాము నుంచే తనిఖీలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విజయవాడలో అధికారులపై కొందరు దుండగులు కాల్పులు జరపడం కలకలం రేపింది. బస్టాండ్ సమీపంలోని బాలాజీ హోటల్‌లో తనిఖీలు చేస్తున్న సమయంలో ఈ కాల్పులు జరిగాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన గూడెల్లి నారాయణ (52) మేస్త్రీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో పని చేస్తున్న ప్రదేశంలో పాము కాటుకు గురి కావడంతో కుటుంబసభ్యులు వరంగల్ ఎంజీఎం అస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
హనుమకొండ నగరంలోని రాంపూర్ డంప్ యార్డ్‌లో శుక్రవారం సాయంత్రం మంటలు అంటుకున్నాయి. అక్కడే విధులు నిర్వహిస్తున్న బల్దియా డీఆర్ఎఫ్, శానిటేషన్ ఉన్నతాధికారులు తక్షణం స్పందించి మంటలను వేగంగా అదుపులోకి తీసుకున్నారు. వాటర్ ట్యాంకర్లు, సంప్‌ల ద్వారా నీటిని స్ప్రే చేసి, బయో ఎర్తింగ్ మెటీరియల్‌ను పొరలుగా మార్చి మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు.
KMM: సత్తుపల్లి మండలం సదాశివునిపేట శివాలయం సమీపంలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. బైక్ పై వెళ్తూ రోడ్డుపై ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వేగంగా ఢీకొట్టారు. దీంతో అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు సిద్ధారం గ్రామానికి చెందిన గద్దల మనోజ్(18), గంధం కార్తీక్ (20)గా గుర్తించారు మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.