AP: నెల్లూరులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆటోనగర్‌లోని ప్లాస్టిక్ గోదాములో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలతో పాటు వేదాయపాలెం మొత్తం పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేస్తున్నారు. గోదాముకు తాళం వేసి ఉండటంతో లోపలకు వెళ్లేందుకు వీలుకాని పరిస్థితి నెలకొంది.
TG: లండన్‌లో తెలంగాణ యువకుడు శ్రీకర్ మృతి చెందాడు. లండన్‌లోని ఇంట్లో అగ్నిప్రమాదంలో శ్రీకర్ గాయపడ్డాడు. 3 రోజులుగా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ.. మృతి చెందాడు. దాదాపు 80శాతం పైగా కాలిన గాయాలతో ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు పరిస్థితి విషమించడంతో మరణించాడు.
అమెరికాలో కాల్పులు కలకలం రేపాయి. టెక్సాస్ రాష్ట్రంలోని ఓ బార్‌లో సాయుధుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందగా.. మరో 14 మంది గాయపడ్డారు. సాయుధుడిని అదుపులోకి తీసుకునే క్రమంలో ఎదురు కాల్పులు జరగడంతో నిందితుడు కూడా మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు.
TG: ఓ మహిళ తన భర్తను హత్యచేసిన దారుణ ఘటన హైదరాబాద్‌లోని ముషిరాబాద్‌లో జరిగింది. మద్యం తాగి హింసిస్తున్నాడని కట్టుకున్న భార్యే.. భర్తను హతమార్చింది. తాగి వచ్చిన భర్త గొడవకు దిగడం విచక్షణ కొల్పోయి దాడి చేసి దీంతో అతడు మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నాని దర్యాప్తు చేస్తున్నారు.
TG: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరులో దారుణం చోటుచేసుకుంది. మనీషా అనే వివాహితను కట్టుకున్న భర్తే కడతేర్చాడు. మూడు నెలల క్రితం మనీషా-తవీర్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులు జీవనోపాధి కోసం ఒడిశా నుంచి వచ్చారు. వీరు ఓ ఇటుక బట్టిలో పని చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
AP: నెల్లూరు జిల్లా జీజీహెచ్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పిల్లల వార్డులో మంటలు చెలరేగాయి. గర్భిణులు, బాలింతలు, ఆసుపత్రి సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. దట్టమైన పొగతో రోగులు, పిల్లలు ఉక్కిరి బిక్కిరయ్యారు. దీంతో అధికారులు జీజీహెచ్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గువనపల్లి సమీపంలో ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. అనంతపురం నుంచి రాయదుర్గానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. కర్ణాటకలో జరిగిన ఓ వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
KMR: పల్వంచ మండలం వేల్పుగొండలో విషాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. శనివారం ఐదేళ్ల బాలుడు ట్రాక్టర్‌పై ఆడుకుంటున్నాడు. తాళం చెవి ట్రాక్టర్‌కు ఉండటంతో దాన్ని స్టార్ట్ చేశాడు. వెనుక గేర్‌లో ఉండటంతో ఒక్కసారిగి వెనక్కి కదిలి ట్రాక్టర్ టైర్లు బాలరాజు ఛాతీపై నుంచి వెళ్లగా తీవ్రగాయాలయ్యాయి. అనంతరం కామారెడ్డి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
అమెరికాలోని సిన్సినాటిలో ఒక మ్యూజిక్ ఈవెంట్‌లో కాల్పులు జరిగాయి. రివర్ఫ్రంట్ లైవ్ వేదిక వద్ద దుండగులు జరిపిన ఈ దాడిలో 15 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
TG: మహబూబ్‌నగర్‌లో ఈ-సిగరెట్లు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలకు సమీపంలోనే ఈ-సిగరెట్లు విక్రయిస్తున్న ముగ్గురిని ఈగల్ టీమ్ అరెస్ట్ చేసింది. నిందితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
TG: కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. జల్పల్లిలో ఎస్‌కే రాయల్ ఎంటర్‌ప్రైజెస్, షాహీ గోల్డ్ కంపెనీలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో అబ్దుల్ సత్తార్ సహా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. నాగ్‌పూర్‌లోని బాణాసంచా గోడౌన్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
AP: అన్నమయ్య జిల్లా బి.కొత్తపేట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ పరిధిలోని అడవుల్లో మంటలు వ్యాపించాయి. సెరికల్చర్ ఫాం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు నిన్న నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగాయి. రాత్రి వరకు 600 ఎకరాలకు పైగా అడవి దగ్ధమైందని స్థానికులు తెలిపారు. ఈ మంటల్లో కొన్ని జంతువులు కాలిపోతున్నాయని వెల్లడించారు. ఫాం వద్ద మంటలు ఆర్పివేశామని అటవిశాఖ అధికారి చెప్పారు.
TG: HYD సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. 8 సైబర్ మోసాల కేసుల్లో 11 మంది నిందితులను అరెస్ట్ చేశారు. 117 కేసుల్లో బాధితులకు 564 రిఫండ్ ఆర్డర్లు ఇచ్చినట్లు వెల్లడించారు. రూ.1.62 కోట్లకు పైగా రిఫండ్ ప్రక్రియ కొనసాగింపు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పుణెలో కీలక నిందితుడు అర్జున్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
AP: కాకినాడ జిల్లా పేలుడు ఘటనలో ఇప్పటివరకు 11 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మృతులు అడబాల శ్రీను, కడింపల్లి కృపమ్మ, కడింపల్లి ధనరాజు, సాధనాల సత్యవేణి, వట్లూరి రవి, మందపల్లి చిన్ని, నిమ్మద కరుణ, గంపల మంగ, గొడతా మహేష్, గొడతా రాము, గొడతా నానిగా గుర్తించారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పరిమితికి మించి బాణాసంచా తయారుచేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.