అనంతపురం జిల్లాలోని సోలార్ విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబరు ‘1912’ అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి శుక్రవారం తెలిపారు. వినియోగదారులు ఈ నంబరుకు కాల్ చేసి ఐవీఆర్ఎస్‌లో 5 అంకెను నొక్కి ఫిర్యాదు నమోదు చేయవచ్చు. దీని ద్వారా సోలార్ విక్రేతలు నిర్ణీత సమయంలోగా సమస్యను పరిష్కరిస్తారని వివరించారు.
తూ.గో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మార్చి 14న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ నిమిత్తం ఎక్సైజ్ అధికారులతో శుక్రవారం సమావేశమైయ్యారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో అధిక మొత్తంలో కేసులు పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. రాజీ పడదగిన కేసులను గుర్తించి జాతీయ న్యాయ సేవాధికార సంస్థకు సమాచారం ఇవ్వాలన్నారు.
NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షమ్మ అమ్మవారికి శుక్రవారం వెండి వస్తువును బహుకరించారు. పొదలకూరు వాస్తవ్యులు కర్ణం కామాక్షి ఆర్థ్య, పేరున కర్ణం కామాక్షి కార్తిక్ శ్రీ స్వామి అమ్మవార్ల పై భక్తి తో నిత్య ఆర్జిత సేవల్లో ఉపయోగించిటకు సుమారు 94 గ్రాములు విలువైన వెండి వస్తువును అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు దర్శనం కల్పించారు.
ప్రకాశం: జరుగుమల్లిలో శనివారం మంత్రి స్వామి స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారని క్యాంప్ కార్యాలయ ప్రతినిధి శుక్రవారం తెలిపారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేస్తారన్నారు. అనంతం క్యాంపు కార్యాలయానికి వచ్చిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంతో పాటు అర్జీల సేకరణ ఉంటుందన్నారు.
PLD: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 25న మాచర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిరుద్యోగ యువత కోసం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి తమ్మాజి రావు, ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస రావు శుక్రవారం తెలిపారు.
KDP: పోరుమామిళ్ల మండలం పులివీడు గ్రామంలో చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. బైకుపై వెళ్తున్న మహిళ మెడలో ఉన్న సుమారు 22 గ్రాముల బంగారు నగలను గుర్తు తెలియని వ్యక్తులు లాక్కెళ్లారు. దీంతో సమాచారం అందుకున్న పోరుమామిళ్ల పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
NDL: ప్రముఖ పుణ్యక్షేత్రం ఎగువ అహోబిలం స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో శుక్రవారం సాయంత్రం నుంచి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రధాన అర్చకులు కీడాంబి వేణుగోపాల్ స్వామి ఆధ్వర్యంలో అంకురార్పణతో వేడుకలకు శ్రీకారం చుట్టారు. అనంతరం సెల్వార్ కూత్ ఉత్సవం నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
GNTR: నల్లపాడు GDCC బ్యాంక్‌లో నిధుల దుర్వినియోగం కేసులో వెలిసెల ఏడుకొండలను పోలీసులు గురువారం GT రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. 28 నవంబర్ 2025న నమోదైన కేసులో బ్యాంక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అరెస్టైన నిందితుడిని కోర్టులో హాజరుపరిచి 14 రోజుల రిమాండ్ ఆదేశించారు. మిగతా నిందితులను కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.
కృష్ణా: హనుమాన్ జంక్షన్‌లో దాతల సహకారంతో రూ.కోటితో నిర్మించిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయ భవనాన్ని గన్నవరం డీఎస్పీ చలసాని శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, స్థానికులతో కలిసి దాతలను ఘనంగా సన్మానించారు. ఈ భవనం వల్ల హనుమాన్ జంక్షన్ పరిధిలో పోలీసు సేవలు మరింత వేగవంతంగా అందనున్నాయి.
E.G: ఇటీవల హాస్పటల్స్‌లో వైద్యం చేయించుకుని ఆర్ధిక సహాయం కోసం సీఎం సహాయనిధికి ధరఖాస్తు చేసుకున్న 61 మందికి రూ.37,19,880 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరు కాగా చెక్కులను శుక్రవారం మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, శాసన సభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.
PPM: ప్రభుత్వ వైద్యం పేదలకు వరమని, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జాయింట్ కలెక్టర్ సీ. యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల మర్యాదగా మెలగాలని సూచించారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం కొమరాడ(మం) కే.రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
AKP: సబ్బవరం గ్రామపంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులకు తడి పొడి చెత్తను వేరు చేయడంపై శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇనుము ప్లాస్టిక్ అట్టపెట్టెలు కాగితాలు తదితర వాటిని పొడి చెత్తగా పరిగణిస్తారని ఆర్.డబ్ల్యూ.ఎస్ కన్సల్టెంట్ లోవరాజు, కార్యదర్శి ఆనందరావు అన్నారు. సేకరించిన చెత్తను సంపద కేంద్రాలకు తరలించాలని సూచించారు.
కర్నూలు జిల్లా గడివేముల మండలం మంచాలకట్ట గ్రామానికి చెందిన హుస్సేన్ బాషా (22) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నగరంలోని రైల్వే ట్రాక్‌పై శుక్రవారం ఓ యువకుడి మృత దేహం ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత యువకుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
VSP: భారతీయ నౌకాదళం నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో భాగంగా పెందుర్తి సమీపంలోని సంకల్ప కళా గ్రామంలో సహజరంగుల అద్దకంపై కార్యశాల నిర్వహించారు. నేవీ వెల్ఫేర్ అండ్ వెల్నెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విదేశీ ప్రతినిధులు చేనేత ఉత్పత్తులు, లక్క బొమ్మలు, సంప్రదాయ ఆహార తయారీ విధానాలను వీక్షించారు.
GNTR: మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబును శుక్రవారం గుంటూరులోని ఆయన నివాసంలో పొన్నూరు మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ డా. రూత్ రాణి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన ఆరోగ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పరిపాలనపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తోందని విమర్శించారు.