BPT: చిన్నగంజాం మండల పరిధిలోని పలు గ్రామాల్లో శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు మండల ఏఈ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు లైన్ల మరమ్మతుల పనులు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీనివల్ల పెద్దగంజాం, కొత్తపాలెం, ములగనవారిపాలెం, నీలాయపాలెం, రాజుబంగారుపాలెం గ్రామాల్లో కరెంటు ఉండదని కావున ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.
TPT: క్రీడల్లో యువతను ప్రోత్సహించే దిశగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆదివారం ఉదయం 6 గంటలకు ‘సండే ఆన్ సైక్లింగ్’ పేరుతో తిరుపతిలో కార్యక్రమం నిర్వహించనున్నారు. రోడ్డు పైన సైక్లింగ్, పలు క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తారు. క్రీడాభిమానులు పాల్గొనాలని శాప్ జిల్లా క్రీడాభివృద్ధ అధికారి షణ్ముఖర్ తెలిపారు.
కోనసీమ: పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ బుధవారం పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బంది వెల్లడించారు. ఉదయం 9 గంటలకు అయినవిల్లి మండల, విలాస గ్రామంలో 36లక్షల వ్యయంతో నిర్మించబోతున్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌కు శంకుస్థాపన చేస్తారు. 10:45 గంటలకు పి. గన్నవరం మండలం ముంగండలో పవన్ అన్న ఆరోగ్య భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభిస్తారు.
KKD: కాకినాడ కలెక్టరేట్లోని వికాస కార్యాలయంలో ఈ నెల 23న భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్(పీడీ) లచ్చారావు శుక్రవారం ప్రకటించారు. పదో తరగతి నుంచి ఆపై చదువులు చదివిన 35 ఏళ్ల లోపు అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 9 గంటలకే వికాస కార్యాలయానికి చేరుకోవాలని ఆయన సూచించారు.
KKD: కిర్లంపూడి మండలంలోని సింహాద్రిపురం, చిల్లంగి, జగపతినగరం, కిర్లంపూడి గ్రామాల్లో శనివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు జగ్గంపేట ఈఈ వీరభద్రరావు తెలిపారు. ప్రత్తిపాడు సబ్ స్టేషన్ మరమ్మతుల కారణంగా, లైన్ల నిర్వహణ పనుల నిమిత్తం ఈ కోత విధిస్తున్నామని, వినియోగదారులు సహకరించాలని కోరారు.
మంత్రి లోకేశ్ ఏర్పాటు చేసిన ‘డిన్నర్ ఆత్మీయ సమావేశానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. కేవలం రాజకీయాలే కాకుండా, చాలా సరదాగా గడిచిన ఈ సమయం మర్చిపోలేనిదని.. ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఈ సందర్భంగా ఆదిరెడ్డి తన మనసులో మాట చెప్పారు. మంత్రి లోకేశ్ ఎంతో ఆప్యాయంగా కుటుంబ సభ్యులందరినీ పలకరించారని పేర్కొన్నారు.
E.G: ఏపీ ప్రభుత్వం స్వర్ణగ్రామ/స్వర్ణవార్డ్ ఆధ్వర్యంలో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే నిర్వహిస్తోందని కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం తెలిపారు. ప్రభుత్వ విధానాల రూపకల్పన, సంక్షేమ పథకాల పారదర్శక అమలు, లబ్ధిదారులకు వేగంగా సేవలు అందించేందుకు సమగ్ర డేటా సేకరించడమే ఈ సర్వే ఉద్దేశమని పేర్కొన్నారు. సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు ప్రజలు తప్పనిసరిగా వివరాలు అందించాలన్నారు.
KKD: కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు శుక్రవారం అసెంబ్లీలో బకింగ్ హోమ్ కెనాల్ పునరుద్ధరణ అంశాన్ని లేవనెత్తారు. కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు ఉన్న ఈ జలమార్గాన్ని అభివృద్ధి చేస్తే టూరిజం, రవాణా రంగాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. బ్రిటిష్ కాలంలో కీలకమైన ఈ కాలువ ప్రస్తుతం నిలిచిపోయిందని, ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
GNTR: దుగ్గిరాల మండల కేంద్రంతో పాటు చింతలపూడి గ్రామంలో శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ గోపి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ లైన్ల నిర్వహణ పనుల నిమిత్తం ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పవర్ కట్ ఉంటుందని పేర్కొన్నారు. పనులు సకాలంలో పూర్తి చేసేందుకు ఆయా గ్రామాల ప్రజలు, రైతులు విద్యుత్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు.
SKLM: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎచ్చెర్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 23న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాధికారి సాయికుమార్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. మొత్తం 13 ప్రముఖ ప్రైవేట్ సంస్థలు పాల్గొని సుమారు 400 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. 18–30 ఏళ్లు వయస్సు గల యువతీ యువకులు అర్హులు అని తెలిపారు.
VSP: జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్‌లో 20 వినతులు స్వీకరించినట్లు చీఫ్ సిటీ ప్లానర్ ఎ. ప్రభాకరరావు తెలిపారు. ప్రధాన కార్యాలయంలో సీపీలతో కలిసి నిర్వహించిన ఫోరమ్‌లో భీమిలి–1, మధురవాడ–2, ఈస్ట్–2, సౌత్–3, నార్త్–6, పెందుర్తి–1, అగనంపూడి–1, గాజువాక–4 వినతులు వచ్చాయి. ప్రతి శుక్రవారం ఈ ఫోరమ్ నిర్వహించి ఫిర్యాదులను వేగంగా చర్యలు తీసుకుంటున...
ASR: గిరిజన ప్రాంతంలో బాక్సైట్ అనుమతులు రద్దు చేస్తూ అసెంబ్లీలో సీఎం ప్రకటన చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కే. లోకనాధం కోరారు. శుక్రవారం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పీ. అప్పలనర్స, నేతలు చిన్నయ్య పడాల్‌తో కలిసి జీకేవీధి మండలం బాక్సైట్ ప్రభావిత ప్రాంతం జర్రెలలో పర్యటించారు. గిరిజన హక్కులు, చట్టాలను ధిక్కరించడం ప్రభుత్వాలకు సరికాదని హితవు పలికారు.
ATP: మహిళలు, చిన్నారుల భద్రతే లక్ష్యంగా జిల్లా ఎస్పీ పీ.జగదీష్ ఆదేశాల మేరకు శుక్రవారం శక్తి బృందాలు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. జిల్లాలోని విద్యా సంస్థలు, బస్టాండ్లు, కాలనీలలో మహిళలకు శక్తి యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. అత్యవసర సమయంలో ఎస్ఓఎస్ అలర్ట్ ద్వారా పోలీసుల సాయం ఎలా పొందాలో వివరించారు.
కృష్ణా: కూచిపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యార్థులకు రోడ్డు భద్రత, పోక్సో చట్టంపై ప్రత్యేక అవగాహన సమావేశం జరిగింది. ట్రాఫిక్ నియమాలు పాటించాలి, హెల్మెట్ తప్పనిసరి, ఓవర్‌స్పీడ్, ట్రిపుల్ రైడింగ్, మొబైల్‌తో వాహనం నడపడం మానుకోవాలని SI C. H. సురేష్ సూచించారు. అలాగే చిన్నారులపై లైంగిక నేరాలకు కఠిన శిక్షలు ఉంటాయని చెప్పారు.
కృష్ణా: గుడ్లవల్లేరు గ్రామంలో ఇంటి పన్ను వసూళ్ల ప్రక్రియను గుడివాడ డివిజనల్ పంచాయతీ అధికారి జి. సంపత్ కుమారి శుక్రవారం పర్యవేక్షించారు. గ్రామంలో జరుగుతున్న ఇంటి పన్ను వసూళ్ల ప్రక్రియను ఆమె పరిశీలించి, వసూళ్ల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. పన్నుల వసూళ్లను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాలని సంబంధిత సిబ్బందికి సూచనలు అందించారు.