• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఆదర్శ పాఠశాలలో ఆరవ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు

VZM: దత్తిరాజేరు(మం) షికారు గంజి ఏపీ మోడల్ స్కూల్లో 2026-2027 విద్యా సంవత్సరంలో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రసన్న కుమారి శుక్రవారం తెలిపారు. ఈనెల 24 నుంచి మార్చి 31వ తేదీ వరకు www.apms.apcfss.in వైబ్ సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.

February 20, 2026 / 08:28 PM IST

‘ఉద్యోగాలను సృష్టించే దిశగా యువత ముందుకు రావాలి’

E.G: ఉద్యోగాల కోసం ఎదురు చూసే మనస్తత్వం నుంచి ఉద్యోగాలను సృష్టించే దిశగా యువత అడుగులు వేయాలని జిల్లా పారిశ్రామిక కేంద్రం జనరల్ మేనేజర్ కే.వాణిధర్ పిలుపునిచ్చారు. ఇవాళ రాజమండ్రిలో నిర్వహిస్తున్న ‘యువతలో నూతన ఆవిష్కరణలు, వ్యవస్థాపక నైపుణ్యాలు -అవకాశాలు & సవాళ్లు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే కేవలం వ్యాపారం కాదన్నారు.

February 20, 2026 / 08:25 PM IST

‘ఎస్టీలకు ఆధార్ కార్డులు ఇప్పించాలి’

W.G: తమకు ఆధార్ కార్డులు ఇప్పించాలని, శ్మశాన వాటిక సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ సీతారాంపురం సౌత్ ఎస్టీ కాలనీ వాసులు శుక్రవారం కమ్యూనిటీ భవనం వద్ద నిరసన చేపట్టారు. ఈ ధర్నాలో పాల్గొన్న సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్దిరాజు మాట్లాడుతూ.. కాలనీలోని యానాది సామాజిక వర్గానికి చెందిన పలువురికి ఇప్పటికీ ఆధార్ కార్డులు లేవని ఆవేదన చెందారు.

February 20, 2026 / 08:24 PM IST

జిల్లాలో పోలీసుల వాహనాల తనిఖీలు

CTR: చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలలో పోలీసులు శుక్రవారం సాయంత్రం వాహనాల తనిఖీ చేపట్టారు. ప్రజల భద్రతను బలోపేతం చేయడం, నేరాలకు అడ్డుకట్ట వేయడం, శాంతి భద్రతలను కాపాడటమే లక్ష్యంగా ఎస్పీ ఆదేశాల మేరకు వాహనాల తనిఖీ చేపట్టినట్టు వారు వెల్లడించారు. ప్రధాన రహదారులు, అంతర్గత మార్గాలలో ఈ తనిఖీలు కొనసాగాయి.

February 20, 2026 / 08:22 PM IST

సీఎస్ వీసీలో పాల్గొన్న కలెక్టర్

ATP: CS కె.విజయానంద్ శుక్రవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సానుకూల ప్రజా దృక్పథం, బీసీ వెల్ఫేర్ హాస్టళ్ల నిర్వహణ, ఎస్సీ కార్పొరేషన్ రుణాల రికవరీ వంటి అంశాలపై ఆయన సమీక్షించారు. విజయవాడ నుంచి కలెక్టర్ ఓ.ఆనంద్, అనంతపురం నుంచి JC విష్ణుచరణ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత ఉండాలని సూచించారు.

February 20, 2026 / 08:20 PM IST

‘వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి’

ప్రకాశం: మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడితే రూ.10వేలు జరిమానా తప్పదని హనుమంతునిపాడు SI మాధవరావు హెచ్చరించారు. వేములపాడులో శుక్రవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను ఎస్సై నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మద్యం తాగి నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.

February 20, 2026 / 08:18 PM IST

ధైర్య స్పర్శ చొరవపై విద్యార్థుల్లో అవగాహన కార్యక్రమం

CTR: కుప్పం రూరల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ మల్లేష్ యాదవ్, తన సిబ్బందితో కలిసి కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించారు. క్రమశిక్షణ, నైతిక విలువలను బలోపేతం చేయడం, లక్ష్య సాధనకు ప్రేరణ, సైబర్ అవగాహన, మాదకద్రవ్యాల దుర్వినియోగంపై మార్గ నిర్దేశం చేశారు. యువత చదువు పట్ల బాధ్యతాయుతమైన ప్రవర్తనలు కలిగి ఉండాలని నొక్కి చెప్పారు.

February 20, 2026 / 08:18 PM IST

విద్యార్థులకు సామాజిక చట్టపరమైన అంశాలపై అవగాహన

CTR: పాలసముద్రంలోని అరుణోదయం ఇంగ్లీష్ మీడియం పాఠశాలను ఎస్సై రాజశేఖర్ రెడ్డి సందర్శించి విద్యార్థులతో సంభాషించారు. పోక్సో చట్టం శిక్షలు, పొగాకు వాడకం యొక్క ప్రభావాలు, మాదకద్రవ్యాలు ధైర్య స్పర్శ కార్యక్రమం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు సైబర్ మోసాలకు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.

February 20, 2026 / 08:17 PM IST

‘చేనేత గర్జనను విజయవంతం చేయాలి’

W.G: చేనేత రంగాన్ని కాపాడుకోవడానికి, నేతన్నల న్యాయమైన డిమాండ్ల సాధనకై ఈ నెల 22న మంగళగిరిలో నిర్వహించ తలపెట్టిన చేనేత గర్జనను విజయవంతం చేయాలని చేనేత సంఘాల నేతలు పిలుపునిచ్చారు. చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మంగళగిరి నేతన్న సర్కిల్ వద్ద ఈ భారీ బహిరంగ సభ జరగనుంది. దీనిలో భాగంగా శుక్రవారం నరసాపురం 25వ వార్డు వీవర్స్ కాలనీలో నేతలు పర్యటించారు.

February 20, 2026 / 08:16 PM IST

‘డ్రెయిన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి’

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చేపట్టబోయే అభివృద్ధి పనులకు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ మున్సిపల్ అధికారులకు సూచించారు. స్థానిక కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఇప్పటి వరకు జరిగిన పనుల పురోగతిని ఆయన ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

February 20, 2026 / 08:14 PM IST

లింగనబోయిన చర్లలో న్యాయ విజ్ఞాన సదస్సు

W.G: సమాజంలో శాంతి, భద్రత, శ్రేయస్సు వర్ధిల్లాలంటే సామాజిక న్యాయం ఎంతో అవసరమని లీగల్ సర్వీసెస్ సభ్యులు వై.డి. ఫణికర్, ప్యానెల్ లాయర్ కె. శిరీష పేర్కొన్నారు. శుక్రవారం ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా లింగబోయిన చర్ల గ్రామ సచివాలయం వద్ద న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ప్రస్తుత కాలంలో పిల్లలు సోషల్ మీడియా మోసాలకు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు.

February 20, 2026 / 08:13 PM IST

‘పీఎం సూర్య ఘర్, పీఎం కుసుం అమలులో వేగం పెంచాలి’

అన్నమయ్య: పీఎం సూర్య ఘర్, పీఎం కుసుం పథకాల అమలులో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అన్నా క్యాంటీన్లు, మునిసిపల్ సేవలు, పారిశుద్ధ్యం, శాంతిభద్రతలపై సమీక్ష జరిగింది. పథకాల అమలు సజావుగా కొనసాగాలని సీఎస్ సూచించారు.

February 20, 2026 / 08:10 PM IST

CMRF పేదల వైద్య సేవలకు ఆర్థిక భరోసా: ఎమ్మెల్యే

CTR: CMRF పేదల వైద్య సేవలకు ఆర్థిక భరోసా ఇస్తోందని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. శుక్రవారం నియోజకవర్గానికి సంబంధించి 24 మంది లబ్ధిదారులకు రూ.35,35,182 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా CM చంద్రబాబు CMRF ద్వారా పేదలను ఆదుకుంటున్నారని చెప్పారు. వైద్య సేవల కోసం అప్పులు చేయకుండా ఆర్థిక సాయం అందిస్తునారని తెలిపారు.

February 20, 2026 / 08:04 PM IST

‘PACS ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి’

PPM: సహకార సొసైటీల సిబ్బంది న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్వీఎస్ కుమార్ అన్నారు. శుక్రవారం DCCB కార్యాలయం వద్ద PACS ఉద్యోగులతో నిరసన తెలిపారు. రైతుల అభివృద్ధి కోసం 30, 40 సంవత్సరాలుగా PACSలలో ఉద్యోగులుగా పని చేస్తున్న వారందరికీ న్యాయం చేయాలన్నారు. ఉద్యోగులందరికీ తక్షణమే జీవో నంబర్ 36 అమలు చేయాలని డిమాండ్ చేశారు.

February 20, 2026 / 08:03 PM IST

అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్

GNTR: తెనాలి మార్కెట్ యార్డ్ ప్రాంగణంలోని అన్న క్యాంటీన్‌ను మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు శుక్రవారం సందర్శించారు. అక్కడ ప్రజలకు అందిస్తున్న ఆహార నాణ్యతను స్వయంగా పరిశీలించి, భోజనం చేస్తున్న వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎప్పుడూ నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలని, క్యాంటీన్ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు.

February 20, 2026 / 08:02 PM IST