• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ట్రాఫిక్ జామ్‌ నివారణకు ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్

కృష్ణా: పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా పెడన పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై-2 సోమవారం బస్టాండ్ సెంటర్ వద్ద ఆటో డ్రైవర్లతో కౌన్సెలింగ్ నిర్వహించారు. రోడ్లపై ఆటోలను అడ్డంగా నిలిపివేయడం వల్ల ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయని తెలిపారు. ప్రయాణికులను ఎక్కించడం, దింపడం కోసం నిర్ణయించిన ప్రదేశాలనే ఉపయోగించాలని డ్రైవర్లకు సూచించారు.

February 23, 2026 / 11:30 AM IST

అనంతపురంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ ఓ.ఆనంద్ వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్ తదితర అధికారులతో కలిసి సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.

February 23, 2026 / 11:23 AM IST

ఎమ్మిగనూరు వద్ద ట్రాక్టర్ ఢీ.. నలుగురికి గాయాలు

KRNL: గోనెగండ్ల మండలం అలువల గ్రామానికి చెందిన రఘు, రాముడు, ఖాసీంవలి, దశరథ పెళ్లికి వెళ్తుండగా ఎమ్మిగనూరు సమీపంలో ప్రమాదం జరిగింది. బండల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ వారి స్కూటర్ను ఢీకొనడంతో నలుగురు తీవ్రంగా ఇవాళ గాయపడ్డారు. రఘు, రాముడు పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

February 23, 2026 / 11:23 AM IST

పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

PLD: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. స్థానిక నరసరావుపేటలోని శ్రీ కాసు రాఘవమ్మా బ్రహ్మానందరెడ్డి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తనిఖీ చేశారు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

February 23, 2026 / 11:18 AM IST

నాటు బాంబు పేలి కుక్క మృతి..!

CTR: గుడిపల్లి మండలం సాల చింతనపల్లి గ్రామ సమీపంలో అడవి పందుల కోసం పెట్టిన నాటు బాంబు పేలి ఓ కుక్క మృతిచెందగా మరో కుక్కపిల్ల తీవ్రంగా గాయపడింది. కొంతమంది వేటగాళ్లు అడవి పందుల కోసం పెడుతున్న నాటు బాంబులు మూగజీవుల ప్రాణాలు తీస్తున్నాయ. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చిన్నారులు ఎవరైనా వీటిని తాకి ఉంటే పరిస్థితి ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు.

February 23, 2026 / 11:18 AM IST

రేపు మేడికొండూరులో మెగా జాబ్ మేళా

GNTR: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో రేపు మేడికొండూరులో మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా అధికారి సంజీవరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 8వ తరగతి నుంచి పీజీ (MBA, M.Com) వరకు చదువుకున్న వారు, అలాగే ఐటీఐ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ మేళాకు హాజరుకావచ్చు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులన్నారు.

February 23, 2026 / 11:18 AM IST

పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

VSP: చింతలగ్రహారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం వేడుకగా నిర్వహించారు. 2000-2001 బ్యాచ్ చదువుకున్న విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్య నేర్పిన గురువులను సత్కరించారు. ఒకరికి ఒకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకుని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. సాయంత్రం వరకు ఆటపాటల్లో మునిగి తేలారు.

February 23, 2026 / 11:18 AM IST

నగరిగుట్ట మసీదు వద్ద చెత్త సమస్య

KDP: పులివెందుల నగరిగుట్ట మసీదు సమీపంలో చెత్తను వేయడంతో గాలికి అది రోడ్డుపైకి ఎగిరివస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోంది. ముఖ్యంగా ఆ మార్గం ద్వారా వెళ్లే పిల్లలు చెత్తాచెదారాల కారణంగా అసౌకర్యం ఎదుర్కొంటున్నారు. చెత్తాచెదారాలు రోడ్డుపై వ్యాపించడంతో దుర్వాసనతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. అధికారులు స్పందించాలని స్థానికులు కోరారు.

February 23, 2026 / 11:15 AM IST

ప్రమాదాల నివారణే లక్ష్యంగా ‘స్టాప్ వాష్ అండ్ గో’ కార్యక్రమం

కోనసీమ: ఎస్పీ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ‘స్టాప్ వాష్ అండ్ గో’ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు. జాతీయ రహదారులు, గ్రామీణ రహదారులపై నిద్రమత్తు వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. దీనిపై దృష్టి సారించి అమలాపురంలో సోమవారం తెల్లవారుజామున డ్రైవర్లను ఆపి, ముఖం కడుక్కునేలా చేసి ప్రయాణానికి అనుమతిస్తున్నారు.

February 23, 2026 / 11:10 AM IST

శ్రీకాకుళంలో కవి రచయితల సమ్మేళనం

SKLM: యువ రచయితలను ప్రోత్సాహించటం ఆనందదాయకమని, డా.బీ ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా గ్రంథాలయంలో యువ రచయితల వేదిక అధ్యక్షులు తంగి ఎర్రమ్మ, కార్యదర్శి పొట్నూరి మాలతిల ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు. కవి సమ్మేళనంలో పలువురు కవులు తమ కవితలను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో గేదెల, వాసవి, తదితరులు పాల్గొన్నారు.

February 23, 2026 / 11:08 AM IST

అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి పరామర్శ

NDL: చిన్నదేవలాపురం గ్రామంలో నిన్న రాత్రి జరిగిన ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదంలో షేక్ మాభూసా కుటుంబానికి చెందిన పశువుల పాక పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న బండి ఆత్మకూరు టీడీపీ మండల అధ్యక్షులు ముమ్మడి నాగ కృష్ణారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని సోమవారం పరామర్శించారు.

February 23, 2026 / 11:06 AM IST

హిందూ యువతకి పెళ్లి చేసిన ముస్లిం కుటుంబం..!

CTR: మానవత్వానికి కులమతాల అవసరం లేదని నిరూపించిన సంఘటన వీకోట మండలం చౌడేపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. అబ్దుల్ బాషా, షబీనా దంపతులు తల్లిదండ్రులు లేని హేమలత అనే ఓ హిందూ చిన్నారిని పెంచి పెద్ద చేశారు. తమ స్తోమత మేరకు చదువు సైతం చెప్పించారు. ఓ మంచి హిందూ సంబంధం చూసి హిందూ పద్ధతిలో వివాహం జరిపించారు.

February 23, 2026 / 11:02 AM IST

‘పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు’

VZM: జిల్లా వ్యాప్తంగా ఇవాళ నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలను జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా కె.ఎల్. పురంలోని శ్రీ లక్ష్మీగణపతి జూనియర్ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని ఆయన సందర్శించి, పరీక్షల నిర్వహణ తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులు పరీక్ష రాస్తున్న గదులను సందర్శించారు.

February 23, 2026 / 11:00 AM IST

పెట్రోల్ దాడిలో గాయపడిన వ్యక్తి మృతి

KKD: తునిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. శ్రీరామ థియేటర్ సెంటర్లో బుధవారం జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడిన సైకిల్ మెకానిక్ నానాజీ సోమవారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బైక్ మెకానిక్, సైకిల్ మెకానిక్ మధ్య జరిగిన ఘర్షణ ఆగ్రహానికి లోనైన బైక్ మెకానిక్, నానాజీపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ క్రమంలో ఇవాళ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

February 23, 2026 / 11:00 AM IST

ప్రశాంత వాతావరణంలో ఇంటర్ పరీక్షలు

కృష్ణా: గుడివాడలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. విద్యార్థులు నిర్ణీత సమయానికి ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకొని పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద సిబ్బంది విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి, నిబంధనలకు అనుగుణంగా కేంద్రాల్లోకి అనుమతించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు అధికారులు చర్యలు చేపట్టారు.

February 23, 2026 / 11:00 AM IST