NLR: ఉదయగిరి పోలీసులు ఓ బాలుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఉదయగిరికి చెందిన ఓ బాలుడు, బాలికకు గతేడాది పరిచయమైంది. ఈ నేపథ్యంలో బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలుడు శారీరకంగా లొంగదీసుకుని గర్భిణిని చేశాడు. పెళ్లి చేసుకోవాలని కోరడంతో నిరాకరించాడు. దీంతో బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలుడిపై కేసు నమోదు చేశారు.
కోనసీమ: రామచంద్రపురంలో ఈ నెల 25న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి వాసంశెట్టి సుభాష్ కార్యాలయం సోమవారం వెల్లడించింది. 10వ తరగతి, డిప్లొమా, డిగ్రీ అర్హత ఉండి, 18-35 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు ఈ మేళాకు హాజరు కావచ్చన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యం అన్నారు.
VZM: మంత్రి నారా లోకేష్‌తో నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే లోకం నాగమాధవి సోమవారం భేటీ అయ్యారు. ఆత్మీయ కుటుంబ సమ్మేళన కార్యక్రమంలో భాగంగా ఉండవల్లిలోని లోకేష్ నివాసంలో భేటీ అయినట్లు ఆమె తెలిపారు. పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి లోకేష్ ఇచ్చిన డిన్నర్‌లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో కుటుంబ సమ్మేళనం జరిగిందని ఆమె తెలిపారు.
E.G: రాజమండ్రిలో నమోదైన ఆక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ ఘటన నేపథ్యంలో కోరుకొండ మండలం నరసాపురం గ్రామాన్ని ఆరోగ్య శాఖ కమిషనర్ జి.వీర పాండ్యన్, తదితరులు సోమవారం పర్యటించారు. తాగునీరు, పాలు, ఆహార పదార్థాల నమూనాలను సేకరించి పరీక్షలకు పంపినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని వారు స్పష్టం చేశారు.
KRNL: నిరుద్యోగ యువతకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) మంచి అవకాశం కల్పిస్తోందని జిల్లా అధికారి రాజ్ కుమార్ తెలిపారు. ఈ నెల 27న (శుక్రవారం) ఉదయం 10 గంటలకు కర్నూలు అబ్బాస్ నగర్‌లోని రవీంద్ర మహిళా డిగ్రీ కళాశాలలో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ విద్యార్హత పత్రాల జిరాక్స్ కాపీలతో హాజరుకావాలని ఆయన సూచించారు.
NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలో నేటి నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు జరుగుతున్నాయి. విద్యార్థులు 8:30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మండలంలో జరిగే 2 పరీక్ష కేంద్రాల్లో 460 మంది విద్యార్థులు పాల్గొననున్నారు.
W.G: కాళీపట్నం గ్రామస్థులకు జాతీయ రహదారి పరిహారంలో జరుగుతున్న అన్యాయంపై ఎంపీ పాకా సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు సోమవారం కలెక్టర్ నాగరాణిని కలిసి విన్నవించారు. ఒకే ప్రాంతంలో కొందరికి తక్కువ, మరికొందరికి ఎక్కువ పరిహారం ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వినతిపత్రం అందజేశారు.
NLR: ఈ నెల 26వ తేదీన నెల్లూరులోని VPR కన్వెన్షన్ లో జరగనున్న ఒక వివాహానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో, హెలిపాడ్ ఏర్పాటుకు అనుమతి కోరుతూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసు శాఖకు లేఖ రాశారు. దీనికి స్పందించి, కనుపర్తిపాడులోని జడ్పీ హైస్కూల్లో హెలిపాడ్కు పోలీసులు అనుమతి మంజూరు చేశారు.
TPT: ఈ నెల 25న స్థానిక విద్యుత్ ఉపకేంద్రం వద్ద ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహించబడనుంది. జైర్లన్, రిటైర్డ్ న్యాయమూర్తి శ్రీనివాస ఆంజనేయమూర్తి, మరో ముగ్గురు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని, స్థానికుల డిస్కం సమస్యలను పరిష్కరిస్తారు. బాలాయపల్లి, డక్కిలి, వెంకటగిరి మండలాల వినియోగదారులు ఈ అదాలత్‌లో తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని అధికారులు సూచించారు.
VZM: వేగ నియంత్రణ కోసం స్టాపర్లు ఏర్పాటు చేసామని డెంకాడ SI సన్యాసి నాయుడు తెలిపారు. సోమవారం సాయంత్రం స్థానిక PS పరిధిలో NHపై 10 చోట్ల ఏర్పాటు చేసిన స్టాపర్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వాహనాల వేగం తగ్గించేందుకు జింగ్ జాగ్ స్టాపర్లు ఎంతగానో ఉపయోగ పడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
W.G: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణల నేపథ్యంలో మొగల్తూరు ఎస్సైతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ ఎస్పీ నయీం అస్మి ఉత్తర్వులు జారీ చేశారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా బదిలీలు చేపట్టినట్లు సమాచారం. ఎస్సై వై.నాగలక్ష్మిని డీసీఆర్బీకి, కానిస్టేబుల్ రాంబాబు భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్‌కు, కానిస్టేబుల్ రాజేశ్‌ను ఆకివీడు స్టేషన్‌కు బదిలీ చేసినట్లు పేర్కొన్నారు.
NDL: APSSDC ఆధ్వర్యంలో ఈ నెల 26న ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు DSDO శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. 14 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరై 1,250 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హులైన నిరుద్యోగులు నేరుగా హాజరు కావాలని ఆయన సూచించారు.
ATP: గుంతకల్లులోని ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో ఈనెల 27న స్వామివారి హుండీ కానుకల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో మేడేపల్లి విజయరాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7.30 గంటల నుంచి ప్రారంభమయ్యే హుండీ లెక్కింపు కార్యక్రమానికి ఆలయ సిబ్బంది విధిగా హాజరుకావాలని సూచించారు.
ఏలూరు జిల్లాలో APOSS వోకేషనల్ పబ్లిక్ పరీక్షలు ఇంటర్మీడియట్ మార్చి 2 నుంచి 13 వరకు జరుగుతాయని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. కలెక్టర్ సోమవారం మాట్లాడుతూ.. ఈ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతాయన్నారు. ఈ పరీక్షలకు 4 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 736 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు వెల్లడించారు.
NDL: విదేశీ పక్షులతో జిల్లాలోని వరి రైతులు బెంబేలెత్తుతున్నారు. రబీ సీజన్లో రైతులు వరి నాట్లు విస్తారంగా వేశారు. అయితే పర్ఫాల్ స్వాపెన్ జాతికి చెందిన విదేశీ పక్షులు నాట్లను పీకేస్తూ రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. పోర్ఫిరియో ఇండికస్, ఆగ్నేయ ఆసియా నుంచి వచ్చిన ఈ పక్షులు చిత్తడి నేలల్లో జీవిస్తాయి. వరి, జమ్ము బెరడులను తిని ఈ పక్షులు జీవిస్తాయి.