• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రేపు విద్యుత్ సరఫరా బంద్

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీలో రేపు మధ్యాహ్నం రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఈఈ రామకృష్ణ తెలిపారు. ఏరియా హాస్పిటల్ ఏరియా, వెలమ వీధి, తురకబడి, కొత్త వీధి, గవర వీధి, పాత సంత బయలు, ఏరియాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. మెయింటినెన్స్ పనుల నిమిత్తం సరఫరా ఆపేస్తున్నామని వినియోగదారులు సహకరించాలని కోరారు.

February 23, 2026 / 07:13 PM IST

కార్యకర్తల సభకు వెళ్లేందుకు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల ర్యాలీ

నెల్లూరు: కావలి పట్టణంలో RSR కల్యాణ మండపంలో సోమవారం నిర్వహిస్తున్న విస్తృతస్థాయి వైసీపీ కార్యకర్తల సమావేశానికి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జెంకి వెంకటరెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కార్యకర్తలతో రామిరెడ్డి నివాసం నుంచి సభ ప్రాంగణం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

February 23, 2026 / 07:12 PM IST

పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

అన్నమయ్య: PGRS అర్జీలను సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం మదనపల్లి కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో 348 అర్జీలను స్వీకరించారు. అర్జీలపై ఆడిట్ నిర్వహించి పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల నుంచి భూమి,దారి,విద్యుత్ సమస్యలపై విజ్ఞప్తులు అందగా, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు.

February 23, 2026 / 07:12 PM IST

26 నుంచి జనసేన సభ్యత్వ నమోదు: మంత్రి

E.G: పవన్ కళ్యాణ్ ఆశయ సాధనే లక్ష్యంగా జనసేన సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని మంత్రి కందుల దుర్గేశ్ పిలుపునిచ్చారు. సోమవారం హుకుంపేట కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 26 నుంచి సభ్యత్వ నమోదు ప్రారంభం కానుందని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

February 23, 2026 / 07:06 PM IST

‘వ్యవసాయ రంగానికి 50 శాతం నిధులు కేటాయించాలి’

NTR: 2026-2027 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కనీసం 50 శాతం నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విజయానంద్‌కు విజ్ఞప్తి చేసింది. గంపలగూడెంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య మాట్లాడుతూ.. రైతు సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదని అన్నారు.

February 23, 2026 / 07:05 PM IST

గంగూరులో పదిమంది అరెస్ట్

కృష్ణా: గంగూరులో జూదం ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు సోమవారం మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదంలో పాల్గొన్న 10 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.55,250 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను విచారిస్తున్నామని, అక్రమ జూద కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

February 23, 2026 / 07:03 PM IST

‘సంత్ గాడ్గే బాబా ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి’

సత్యసాయి: సంత్ గాడ్గే బాబా ఆయన ఆశ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు జి. ఎం. శేఖర్ పిలుపునిచ్చారు. సోమవారం ధర్మవరంలో గాడ్గే బాబా 150వ జయంతిని ఘనంగా నిర్వహించారు. మహారాష్ట్రలో ఒక వెనుకబడిన తరగతుల కుటుంబంలో జన్మించి, స్వచ్చందంగా పేదరికాన్ని స్వీకరించి గ్రామాలు తిరుగుతూ ప్రజల్లో చైతన్యం కలిగించారన్నారు.

February 23, 2026 / 07:01 PM IST

కాలనీలో తాగునీటి సమస్యపై మహిళల వినతి

CTR: తవణంపల్లిలోని జొన్నగురకలలో కాలనీవాసులు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో సరైన నీటి సరఫరా లేకపోవడంతో మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పంచాయతీ సెక్రటరీ రామరాజు ఆధ్వర్యంలో కాలనీవాసులు డిప్యూటీ ఎంపీడీవో రాజశేఖర్‌కు వినతి పత్రం అందించారు. వెంటనే తాగునీటి సరఫరా మెరుగుపరచాలని ఎంపీడీవో సంబంధిత అధికారులను ఆదేశించారు.

February 23, 2026 / 07:01 PM IST

పుట్టపర్తిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

సత్యసాయి: పుట్టపర్తి పోలీస్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురాన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాధితుల నుంచి 96 ఫిర్యాదులు స్వీకరించారు. అర్జీదారులతో నేరుగా మాట్లాడిన అడిషనల్ ఎస్పీ, సమస్యలపై తక్షణమే విచారణ జరిపి న్యాయం చేయాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు.

February 23, 2026 / 07:01 PM IST

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: ఆర్డీవో

E.G: PGRS, రెవెన్యూ క్లినిక్ అర్జీలను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో పరిష్కరించాలని RDO ఆర్. కృష్ణ నాయక్ ఆదేశించారు. ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో ప్రజల నుంచి ఆయన 14 అర్జీలను స్వీకరించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా అందిన ప్రతి ఫిర్యాదును నూరు శాతం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.

February 23, 2026 / 07:00 PM IST

ఏబీసీ సెంటర్ పనులను వేగవంతం చేయండి: కమిషనర్

GNTR: వీధి కుక్కల నియంత్రణకు గాను ఏర్పాటు చేస్తున్న యాంటీ బర్త్ కంట్రోల్ (ABC), యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్ సెంటర్ నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేయాలని గుంటూరు నగర కమిషనర్ మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. సోమవారం పొన్నూరు రోడ్డులోని ఏబీసీ సెంటర్, సుద్దపల్లి డొంకలోని ఎస్టీపీ ప్లాంట్‌ను ఆయన స్వయంగా పరిశీలించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.

February 23, 2026 / 07:00 PM IST

మీకోసం కార్యక్రమంకు 75 ఫిర్యాదులు

ప్రకాశం: ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలనే లక్ష్యంగా సోమవారం ఒంగోలులోని పోలీస్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను పోలీస్ అధికారులకు వివరించారు. ప్రతి ఫిర్యాదుదారుతో అధికారులు ముఖాముఖీగా మాట్లాడి వారి సమస్యల వివరాలను తెలుసుకున్నారు. మీకోసం కార్యక్రమంకు 75 ఫిర్యాదులు అందాయని అధికారులు తెలిపారు.

February 23, 2026 / 07:00 PM IST

ఏసీబీ వలలో ఎంఈవో

SKLM: ఇచ్చాపురం ఎంఈవో అప్పారావు ఏసీబీ వలలో చిక్కారు. రిటైర్డ్ ఉద్యోగి పెన్షన్ ఫైల్ క్లియర్ చేయడానికి రూ.30,000 డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ముందస్తు సమాచారంతో రూ.10,000 లంచం స్వీకరిస్తుండగా ఎంఈవోను రెడ్ హ్యాండెడ్‌‌గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ సత్యనారాయణ సోమవారం తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

February 23, 2026 / 07:00 PM IST

అంగరలో వైసీపీ నుండి జనసేనలో చేరికలు

కోనసీమ: కపీలేశ్వరపురం మండలం అంగర గ్రామానికి చెందిన పలువురు సోమవారం వైసీపీ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. నూతనంగా పార్టీలో చేరిన వారికి లీలాకృష్ణ జనసేన కండువాను కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. అంకితభావంతో పనిచేసి మండపేట నియోజకవర్గంలో జనసేన పార్టీని మరింత బలపరచేందుకు కృషి చేయాలని సూచించారు

February 23, 2026 / 06:57 PM IST

వెట్టి చాకిరి వ్యవస్థ నిర్మూలన పోస్టర్స్ ఆవిష్కరణ

ATP: జిల్లాలో వెట్టి చాకిరిని పూర్తిగా రూపం మాపాలని, ఎక్కడైనా ఇలాంటి కేసులు కనిపిస్తే తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వెట్టి చాకిరి వ్యవస్థ నిర్మూలన పోస్టర్స్‌ను ఆవిష్కరించారు. అనంతరం వెట్టి చాకిరి వ్యవస్థ నిర్మూలన చట్టం 1976పై సామర్థ్యత పెంపుదలపై సదస్సు నిర్వహించారు.

February 23, 2026 / 06:55 PM IST