• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కల్తీ పాల ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలి: గౌని ప్రతాపరెడ్డి

అనంతపురం: రాజమండ్రిలో కల్తీ పాలఘటన తీవ్ర భయాందోళనకు గురి చేసిందని, దోషులను కఠినంగా శిక్షించాలని రాయదుర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి గౌని ప్రతాపరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మీడియాకి ఆయన ప్రకటన విడుదల చేశాడు. విషపు పాలు తాగి రెండు రోజుల్లో నలుగురు మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

February 23, 2026 / 06:54 PM IST

‘ప్రజా రక్షణకు ఆర్మ్డ్ పోలీస్ సేవలు అవసరం’

SKLM: ప్రజలకు పోలీస్ శాఖ అందిస్తున్న సేవలలో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసుల విధులు, సేవలు అత్యంత అవసరమని అదనపు శ్రీకాకుళం జిల్లా అడిషనల్ ఎస్పీ కెవి రమణ అన్నారు. సోమవారం ఎచ్చర్ల పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసుల 14 రోజుల శిక్షణా తరగతుల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఈ శాఖ ఆవశ్యకతను ఆయన తెలిపారు.

February 23, 2026 / 06:52 PM IST

‘వ్యవసాయానికి నిధులు కేటాయించాలి’

KRNL: వార్షిక బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 10 శాతం నిధులు కేటాయించాలని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేసింది. ఎమ్మిగనూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో నాయకులు మాట్లాడుతూ.. రైతులను ఆదుకునేందుకు స్వామినాథన్ కమిటీ సిఫారసుల అమలు, C2+50% గిట్టుబాటు ధరకు చట్టబద్ధత, ఎరువులు,విత్తనాలపై 90% సబ్సిడీ,ఉచిత పంట భీమా అమలు చేయాలని కోరారు.

February 23, 2026 / 06:48 PM IST

అదుపుతప్పి కారు బోల్తా

ప్రకాశం: గిద్దలూరు మండలంలోని ముండ్లపాడు గ్రామ సమీపంలో సోమవారం కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తులను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంపై సమాచారాన్ని అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

February 23, 2026 / 06:45 PM IST

తెలుగు తోట – వెలుగు బాట పుస్తకావిష్కరణ

KRNL: నందవరం మండలం నాగలదిన్నె జెడ్పీ పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న తెలుగు తోట -వెలుగు బాట పుస్తకావిష్కరణ వినుకొండలో ఘనంగా జరిగింది. హెచ్ఎం బి. శైలజ, ఎంఈవో షేక్ జఫ్రుల్లా, ప్రముఖ వైద్యలు డా. ఎల్. యన్. రావు, జన విజ్ఞాన వేదిక కార్యవర్గం చేతుల మీదగా ఆవిష్కరించారు. కవి గద్వాల సోమన్నను సన్మానించారు.

February 23, 2026 / 06:44 PM IST

రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక

శ్రీకాకుళం జిల్లా మీదుగా ప్రయాణించే బెంగళూరు-భువనేశ్వర్ (రైలు నం. 18463/64) ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలుకు 3వ ఏసీ భోగిని అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ జనరల్ మేనేజర్ పరమేశ్వర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రైలు శ్రీకాకుళం రోడ్డు, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం తదితర రైల్వే స్టేషన్లలో ఆగనుంది.

February 23, 2026 / 06:43 PM IST

బ్లూ కోల్ట్ సిబ్బంది ఆకస్మిక తనిఖీలు

PPM: జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి ఆదేశాల మేరకు ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాలలో గంజాయి ఎక్కువగా సేవించే నిర్మానుష్య ప్రాంతాన్ని పట్టణ బ్లూ కోల్ట్ సిబ్బంది సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. గంజాయి కట్టడిపై పట్టణ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అనుమానాస్పద ప్రాంతాలను నిశితంగా పరిశీలించారు. గంజాయి క్రయ విక్రయాలు జరిగినా తమ దృష్టికి తీసుకురావాలన్నారు.

February 23, 2026 / 06:41 PM IST

లోక్ అదాలత్‌పై అవగాహన కల్పించాలి

W.G: ఈ ఏడాది మార్చి 14న నిర్వహించనున్న తొలి జాతీయ లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు న్యాయవాదులు విశేష కృషి చేయాలని నరసాపురం 10వ అదనపు జిల్లా జడ్జి ఎ.వాసంతి అన్నారు. సోమవారం నరసాపురం బార్ అసోసియేషన్ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యంగా సివిల్ తగాదాల్లో రాజీ మార్గం ద్వారా సత్వర పరిష్కారం లభిస్తుందన్నారు.

February 23, 2026 / 06:39 PM IST

పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి

PLD: పల్నాడు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి మొత్తం 151 వినతులు అందినట్లు అధికారులు తెలిపారు. పీజీఆర్ఎస్‌లో అందిన ప్రతి అర్జీని సకాలంలో పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు

February 23, 2026 / 06:35 PM IST

వాల్తేర్ స్కౌట్స్‌కు రాష్ట్రపతి అవార్డులు

VSP: భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ వాల్తేర్ డివిజన్‌కు చెందిన ఆరుగురు కేడెట్లు ప్రతిష్టాత్మక రాష్ట్రపతి అవార్డులు అందుకున్నారు. ఇద్దరు రోవర్స్, ఇద్దరు గైడ్స్, ఇద్దరు రేంజర్స్ ఈ గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. విశాఖలోని ‘అరణ్య’ క్యాంపింగ్ సెంటర్‌లో ప్రపంచ థింకింగ్ డే సందర్భంగా డివిజనల్ రైల్వే మేనేజర్ పురస్కారాలు ప్రదానం చేశారు.

February 23, 2026 / 06:34 PM IST

ప్రజల సమస్యలు పరిష్కరించడం తమ లక్ష్యం: ఏఎస్పీ

కృష్ణా: మచిలీపట్నం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారంనిర్వహించిన మీకోసం కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వివి.నాయుడు ప్రజల వద్ద నుండి 48 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల సమస్యలను పరిష్కరించడమే తమ లక్ష్యమని అన్నారు. ఎవరికైనా సమస్యలు ఉంటే అర్జీల రూపంలో తమ సమస్యను తెలియజేయవచ్చని సూచించారు.

February 23, 2026 / 06:30 PM IST

మిట్టపాలెం నారాయణస్వామి ఆలయ ఆదాయం రూ.57,490

ప్రకాశం: మిట్టపాలెం నారాయణస్వామి ఆలయానికి ఆదివారం భక్తుల ద్వారా రూ.57,490 ఆదాయం వచ్చినట్లు ఈవో గిరిరాజు నర్సింహబాబు సోమవారం తెలిపారు. టికెట్లు, లడ్డు ప్రసాదం విక్రయం, శాశ్వత అన్నదానం, మహాప్రాకార నిర్మాణ విరాళాలు, పంచామృత అభిషేకాలు, శ్రీపాద కానుకల ద్వారా ఈ ఆదాయం సమకూరినట్లు వెల్లడించారు.

February 23, 2026 / 06:30 PM IST

సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ..!

అన్నమయ్య: అర్హులైన నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సహాయం అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ నాయకురాడు ముక్కా వరలక్ష్మి అన్నారు. సోమవారం పెనగలూరు మండలం ఓబిలి గ్రామానికి చెందిన సోమేశుల ప్రవీణ్ మరణం అనంతరం ఆయన కుటుంబ సభ్యురాలు కీర్తికి రూ.1,90,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేశారు.

February 23, 2026 / 06:30 PM IST

ఉదారత చాటుకున్న ఓ వ్యక్తి..!

KRNL: మంత్రాలయం మండలం బూదూరు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బుజ్జిగ జక్కయ్య మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. అనాధలు, ఆపదలో ఉన్నవారికి, దేవాలయాల నిర్మాణాలకు ఎప్పుడూ సహకరిస్తానని నిరూపిస్తూ సోమవారం తన స్వగృహంలో గోనెగండ్ల మండలం పుట్టపాశం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఏబీఎం చర్చి నిర్మాణానికి రూ. 20,000 విరాళంగా అందించారు.

February 23, 2026 / 06:29 PM IST

రెండు కార్లు ఢీ.. ఇద్దరికి గాయాలు..!

KDP: చాపాడు మండలం అల్లాడుపల్లె రోడ్డు వద్ద సోమవారం రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి గాయాలయినట్లు స్థానికులు తెలిపారు. మైదుకూరు వైపు నుంచి కారు ప్రొద్దుటూరుకు వస్తుండగా బైకును తప్పించబోయి ప్రొద్దుటూరు నుంచి మైదుకూరు వైపునకు వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

February 23, 2026 / 06:26 PM IST