TPT: తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి రోజా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆమెకు రంగనాయకులు మండపంలో వేద పండితులు ఆశీర్వచనంతో అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
నరసాపురం ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయాన్ని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శేఖర్ బాబు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పాఠకులతో ముఖాముఖి నిర్వహించి గ్రంథాలయంలో అందుతున్న సేవలు, ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు.
KRNL: ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను వేగవంతం చేయడానికి రాజకీయ పార్టీల సహకారం అత్యంత కీలకమని కర్నూలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ పీ.విశ్వనాథ్ స్పష్టం చేశారు. మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ATP: గార్లదిన్నె మండలం కల్లూరు ఆర్ఎస్ నివాసి చంద్రశేఖర్ కుమార్తె వివాహానికి ఉమ్మడి అనంతపురం జిల్లా ఏడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి బుధవారం 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. నిరుపేద కుటుంబానికి నగదును అందజేసి వధూవరులను ఆశీర్వదించారు. వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆయన ఆకాంక్షించారు.
NLR: విడవలూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 27వ తేదీన ఉచిత వైద్య శిబిరం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సుజాత బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యూత్ రెడ్ క్రాస్ కమిటీ, బొల్లినేని హాస్పిటల్ వారి సహకారంతో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఉచితంగా మందులు అందజేస్తామన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలన్నారు.
అన్నమయ్య: రాయచోటిలోని పాతిమా మసీదులో YCP మైనారిటీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ఇఫ్తార్ విందులో మాజీ MLA శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రంజాన్ ఆధ్యాత్మికతతో పాటు క్రమశిక్షణ,సేవాభావం పెంపొందిస్తుందని కొనియాడారు. దైవచింతన వల్ల ఆత్మస్థైర్యం పెరుగుతుందని పేర్కొన్నారు.
E.G: దేవరపల్లి-గోపాలపురం మూడు రోడ్ల సెంటర్ వద్ద డ్రైనేజీ ఆక్రమణలతో మురుగునీరు రోడ్లపైకి చేరుతోంది. దుర్వాసనతో ప్రయాణికులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు నామమాత్రపు పనులు కాకుండా, ఆక్రమణలు తొలగించి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరారు. మురుగునీటి సమస్యతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
TPT: తిరుపతి పోస్టల్ కాలనీకి చెందిన ఆశాల భర్తతో విడిపోయి తన కుమార్తె దుర్గతో కలిసి ఉంటుంది. చెన్నంపల్లికి చెందిన రెడ్డి కుమార్‌తో సహజీవనం చేస్తుంది. ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుని అడ్డుగా ఉన్న కుమార్తెను చంపేశారు. మృతదేహాన్ని స్వర్ణముఖి నది దగ్గర పూడ్చిపెట్టారు. తన బిడ్డ, మనవరాలు కనబడుటలేదని ఆశాలత తల్లి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
సత్యసాయి: పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో చైనా నూతన సంవత్సర ముగింపు వేడుకల సందర్భంగా బుధవారం తెల్లవారుజామున ‘బాయ్ తీ కాంగ్’ పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జేడ్ చక్రవర్తి జన్మదినాన్ని పురస్కరించుకుని చైనా భక్తులు ఈ సంప్రదాయ వేడుకను జరుపుకున్నారు. ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై బియ్యం కేకులు, అగరుబత్తులు, దీపాలతో ప్రత్యేక పూజలు చేశారు.
కోనసీమ: మంత్రి నారా లోకేశ్ ఉండవల్లి నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ విందుకు ముమ్మిడివరం MLA దాట్ల సుబ్బరాజు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్‌లతో కూడిన ప్రత్యేక పెయింటింగ్‌ను MLA కుటుంబ సభ్యులు మంత్రికి అందజేశారు. లోకేశ్ అందరినీ పేరుపేరునా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు.
CTR: బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయన్ని సీఐ కత్తి శ్రీనివాసరావు తెలిపారు. పాలేరు గ్రామానికి చెందిన గిరిజ(51) అక్రమంగా మద్యం విక్రయిస్తుండగా 25 మందు బాటిల్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
BPT: చీరాల ఎమ్మెల్యే కొండయ్యపై తప్పుడు వార్తలు రాస్తున్నారని ఆరోపిస్తూ కూటమి శ్రేణులు మంగళవారం ఆందోళన చేపట్టారు. ఆర్ఓబీ (ROB) నిర్మాణంపై వాస్తవాలను వక్రీకరించారని మండిపడుతూ సాక్షి పత్రిక ప్రతులను చించివేశారు. 2014-19 మధ్యే అనుమతులు వచ్చినా, ఆ తర్వాతి నిర్లక్ష్యం వల్లే పనులు ఆగిపోయాయని,ప్రజల సమస్యల కోసమే ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడారని తెలిపారు.
VSP: విశాఖలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు జీవీఎంసీ ‘ప్రాజెక్టు సారథి’ని అమల్లోకి తెచ్చింది. 101 సిగ్నళ్లను సిటీ ఆపరేషన్ సెంటర్‌కు అనుసంధానిస్తూ అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌ను ప్రవేశపెడుతున్నారు. 90 కీలక జంక్షన్లలో ఏఐ ఆధారిత ఐటీఎంఎస్ ఏర్పాటు చేసి హెల్మెట్ లేకపోవడం, సిగ్నల్ జంప్ వంటి ఉల్లంఘనలను గుర్తించి ఆటోమేటిక్‌గా చలానాలు పంపించనున్నాయి.
KDP: ప్రొద్దుటూరు రాజీవ్ గాంధీ నేషనల్ ఏకో పార్క్, రిజర్వ్ ఫారెస్ట్ పరిరక్షణకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కడపలో జరిగిన అటవీ పరిరక్షణ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని జాతీయ పార్కు, రక్షిత అడవి, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల చుట్టూ ఏకో-సెన్సిటివ్ జోన్ అమలుకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు.
కృష్ణా: నందివాడ విద్యుత్తు సబ్‌స్టేషన్ పరిధిలో బుధవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు విద్యుత్తు శాఖ అధికారులు తెలిపారు. నూతన ఆర్‌డీఎస్‌ఎస్ విద్యుత్తు లైన్ నిర్మాణ పనుల నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు తుమ్మలపల్లి, తమిరిశ గ్రామాలతో పాటు నందివాడ ప్రాంతంలో సరఫరా ఉండదని వెల్లడించారు.