• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పాఠశాలలకు సరఫరా చేస్తున్న చిక్కీలపై ఆరోపణలు

ASR: పోలవరం జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు పంపిణీ చేస్తున్న చిక్కీల (పల్లీ అచ్చులు) నాణ్యతపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా సరఫరా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రంపచోడవరం, చింతూరు డివిజన్లలోని పాఠశాలలకు అందుతున్న చిక్కీలలో పురుగులు కనిపిస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు.

February 25, 2026 / 10:22 AM IST

కంబాలకొడం అభివృద్ధికి బృహత్ ప్రణాళిక

VSP: కంబాలకొండలో పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటక అభివృద్ధికి బృహత్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు VMRDA మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్ భరత్ తెలిపారు. ఈఎస్ జెడ్ పరిధిలో 30.51 చ.కి.మీ. విస్తీర్ణానికి ముసాయిదా జోనల్ మాస్టర్ ప్లా రూపొందిస్తున్నారు. రహదారుల అనుసంధానం, భవిష్యత్ రహదారి మార్గాలు స్పష్టంగా చేర్చాలని సూచించారు.

February 25, 2026 / 10:21 AM IST

కుక్క దాడిలో విద్యార్థికి తీవ్ర గాయాలు

ATP: గుత్తి కోటవీధిలోని ప్రాథమిక పాఠశాల వద్ద మహమ్మద్ అనే విద్యార్థిపై బుధవారం కుక్క దాడి చేసి గాయపరిచింది. ఈ దాడిలో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. కోటవీదిలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

February 25, 2026 / 10:20 AM IST

గాంధీ బొమ్మ ప్రాంతంలో పర్యటించిన కమిషనర్

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ స్థానిక గాంధీ బొమ్మ ప్రాంతంలో నుడా ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న “ఐ లవ్ నెల్లూరు” బోర్డు ఏర్పాటు పనులను అధికారులతో కలిసి బుధవారం పర్యవేక్షించారు. అనంతరం స్థానిక మినీ బైపాస్ నర్సరీల సమీపంలో నూతనంగా భారీ జాతీయ జెండాను ఏర్పాటు చేసేందుకు స్థల సేకరణ పనులను నుడా అధికారులతో కలిసి పరిశీలించారు.

February 25, 2026 / 10:20 AM IST

చెత్త సేకరణకు 3 పుష్ కార్ట్స్

AKP: స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా కోటవురట్ల మండలంలో మూడు పంచాయతీలకు పుష్ కార్ట్స్‌తో పాటు తడి, పొడి, ప్రమాదకరమైన చెత్త సేకరణకు డస్ట్ బిన్‌లను ప్రభుత్వం సరఫరా చేసింది. వీటిని కోటవురట్ల తంగేడు, టి. జగ్గంపేట పంచాయతీలకు కేటాయిస్తున్నట్లు ఎంపీడీవో చంద్రశేఖర్ బుధవారం తెలిపారు. వీటి ద్వారా చెత్త సేకరణ చేసి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.

February 25, 2026 / 10:19 AM IST

ట్యాంకు వద్ద మహిళ మృతి

PLD: రాజుపాలెం మండలం ఉప్పలపాడులో గ్రామంలో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. గ్రామంలోని నీటి ట్యాంకు సమీపంలో మృతదేహం కనిపించినట్లు స్థానికులు తెలిపారు. మృతురాలు వేల్పుల మల్లేశ్వరి (45)గా గుర్తించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

February 25, 2026 / 10:15 AM IST

ప్రత్తిపాడులో పారిశుద్ధ్య కార్మికుల నిరసన

GNTR: ప్రత్తిపాడులో బకాయి పడ్డ జీతాల విషయంలో పారిశుద్ధ్య కార్మికులు బుధవారం ధర్నాకు దిగారు. పూర్తి జీతాలు ఇచ్చే వరకు పనిలోకి రావద్దని గతంలో చెప్పిన మేస్త్రి, ఇప్పుడు ట్రాక్టర్‌తో చెత్త ఎత్తించడంపై కార్మికులు మండిపడ్డారు. నిరసనగా చెత్త ట్రాక్టర్‌ను కదలకుండా అడ్డుకుని రోడ్డుపై బైఠాయించారు.

February 25, 2026 / 10:14 AM IST

బాలికల పట్ల లైబ్రేరియన్ అసభ్య ప్రవర్తన.. HMకు ఫిర్యాదు

W.G: పాలకోడేరు (M) శృంగవృక్షం హైస్కూల్లో లైబ్రేరియన్ డేవిడ్ రాజు బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం కలకలం రేపింది. గ్రామ పెద్దలతో కలిసి తల్లిదండ్రులు HMకు ఫిర్యాదు చేశారు. గ్రామ పెద్ద బుజ్జి రాజు మాట్లాడుతూ.. లైబ్రేరియన్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే ఎమ్మెల్యే రఘురామకు తెలిపామన్నారు. అతను జిల్లా పరిషత్ ఎంప్లాయ్ అని అన్నారు.

February 25, 2026 / 10:06 AM IST

ప్రశాంతంగా మొదలైన ఇంటర్ పరీక్షలు..!

CTR: కుప్పంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లీష్ పరీక్ష బుధవారం ప్రశాంతంగా ప్రారంభమైంది. పరీక్ష కేంద్రాలకు 9 గంటల లోపే విద్యార్థులు చేరుకోగా పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ 1st లాంగ్వేజ్ సెట్ వన్ ప్రశ్నాపత్రం చాలా సులభంగా రావడంతో విద్యార్థులు ఖుషి అయ్యారు.

February 25, 2026 / 10:03 AM IST

మారెమ్మ తల్లి జాతర మహోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

కోనసీమ: గ్రామ దేవతల ఆరాధన మన ప్రాచీన సంస్కృతికి ప్రతిబింబమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. వాడపాలెం శ్రీ మారెమ్మ తల్లి అమ్మవారి జాతర, తీర్థ మహోత్సవాల పోస్టర్‌ను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు బుధవారం వాడపాలెం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఆవిష్కరించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

February 25, 2026 / 10:02 AM IST

విద్యార్థినితో టీచర్ అసభ్య ప్రవర్తన..!

చిత్తూరు జిల్లాలో కాంట్రాక్ట్ టీచర్ వెంకటేశ్‌పై కేసు నమోదైంది. పులిచెర్ల మండలం కల్లూరు పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలు ఆత్మహత్యకు యత్నించగా తిరుపతిలో చికిత్స పొందుతోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

February 25, 2026 / 10:02 AM IST

నిధుల మంజూరుకు ఎమ్మెల్యే సింధూర వినతి

సత్యసాయి: పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి బుధవారం CM చంద్రబాబు నాయుడును కోరారు. నియోజకవర్గంలో ఆగిపోయిన పనులను పూర్తి చేయాలని, హంద్రీనీవా కృష్ణా జలాలతో చెరువులు నింపాలని విన్నవించారు. పుట్టపర్తిని ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా, ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు.

February 25, 2026 / 10:00 AM IST

ఈ నెల 27న జిల్లా నేతలతో సీఎం కీలక భేటీ

ATP: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 27న అనంతపురం జిల్లా మంత్రి పయ్యావుల కేశవ్, స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీతో అమరావతిలో కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో సాగుతున్న అభివృద్ధి పనులు, పెండింగ్ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష జరపనున్నారు. శాంతిభద్రతల అంశంపై పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

February 25, 2026 / 10:00 AM IST

‘హెచ్చరిక.. దళారులను నమ్మి మోసపోవద్దు’

ఏలూరు జిల్లా పరిధిలోని ఆసుపత్రులలో ఉద్యోగాలు ఇప్పిస్తామనే దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయ అధికారి పాల్ సతీశ్ సూచించారు. ఆయన మాట్లాడుతూ.. నియామక ప్రక్రియ మెరిట్, రోస్టర్ ప్రాతిపదికన అత్యంత పారదర్శకంగా జరుగుతుందన్నారు. హెచ్చరికలు విస్మరించి దళారులను ఆశ్రయిస్తే నష్టపోతారని, నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

February 25, 2026 / 10:00 AM IST

మార్చి 1న జలుమూరు మండల సర్వసభ్య సమావేశం

SKLM: మార్చి ఒకటి ఆదివారం ఉదయం 10:30 కు మండల అధ్యక్షులు వాన గోపి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరుగుతుందని ఎంపీడీవో చిన్న మూడు తెలిపారు. స్థానిక శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి ముఖ్యఅతిథిగా పాల్గొంటారని అన్నారు. జడ్పిటిసి మెండ విజయశాంతి రాంబాబు అధికారులు సభ్యులు పాల్గొవాలని ఆమె సూచించారు.

February 25, 2026 / 10:00 AM IST