• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్రలో పాల్గొన్న ఎమ్మెల్యే

GNTR: తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలో శనివారం నిర్వహించిన “స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర” కార్యక్రమంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. ప్రజల్లో శుభ్రత, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించడమే లక్ష్యమని తెలిపారు. మండల పరిషత్ ఉర్దూ పాఠశాల, ఆంగన్‌వాడి కేంద్రాలను సందర్శించిన ఆయన చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు.

February 21, 2026 / 11:42 AM IST

పత్రాలు లేని వాహనాలు స్వాధీనం

KDP: రానున్న ఎన్నికలలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. శనివారం గూడెంచెరువు గ్రామంలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. కార్డెన్ సెర్చ్ నిర్వహించి పత్రాలు లేని 20 మోటార్ సైకిల్లు, 8 ఆటలను స్వాధీనం చేసుకున్నారు. మత్తు పదార్థాలపై ,చెడు నడత నడిచేవారికి కౌన్సిలింగ్ నిర్వహించారు.

February 21, 2026 / 11:39 AM IST

బాపురం రథోత్సవానికి YCP ఉపాధ్యక్షుడికి ఆహ్వానం

KRNL:పెద్దకడబూరు మం. బాపురంలో ఆదివారం జరిగే శ్రీ గంగాదేవి రథోత్సవానికి రావాలని జిల్లా YCP ఉపాధ్యక్షుడు ప్రదీప్ రెడ్డిని గ్రామనేతలు కోరారు. ఎమ్మిగనూరులోని భీమా నిలయంలో ఆయనను కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో వీరేష్, హనుమంతరెడ్డి, ఉచ్చారెడ్డి సహాపలువురు నేతలు పాల్గొన్నారు. రథోత్సవ ఏర్పాట్లపై చర్చించి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

February 21, 2026 / 11:38 AM IST

జనసేన సభ్యత్వ నమోదుకు పిలుపు

VSP: జనసేన పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 26 నుంచి చేపట్టనున్న “సభ్యత్వం నుంచి నాయకత్వం” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆదేశానుసారం జిల్లా సీనియర్ నాయకుడు రాజు గౌడ్ శనివారం పిలుపునిచ్చారు. పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులైన వారు స్థానిక సాధక్‌లను సంప్రదించి “ఉద్యమి” సభ్యత్వం నమోదు చేసుకోవాలన్నారు.

February 21, 2026 / 11:38 AM IST

జగ్గయ్యపేటకు చేరుకున్న డ్రగ్స్ పై దండయాత్ర సైకిల్ ర్యాలీ

NTR: విజయవాడ పోలీస్ కమిషనరేట్ రాజశేఖర బాబు నిర్వహిస్తున్న డ్రగ్స్ పై దండయాత్ర ప్రజా అవగాహన సైకిల్ యాత్ర తిరువూరు సర్కిల్‌ను దాటి జగ్గయ్యపేట సర్కిల్ పరిధిలోని వత్సవాయి పోలీస్ స్టేషన్ వద్దకు ఈరోజు ప్రవేశించింది. ఈ యాత్ర కంభంపాడు గ్రామం నుండి ప్రారంభమై వత్సవాయి వరకు కొనసాగింది. డ్రగ్స్ వలన కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని కమిషనర్ తెలిపారు.

February 21, 2026 / 11:38 AM IST

ఆంజనేయ స్వామి ఆలయంలో నిత్య హోమం పూజలు

ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. స్వామివారి మూలమూర్తికి పవిత్ర గంగాజలాలతో అభిషేకలు నిర్వహించి, బంగారు,వెండి ఆభరణాలతో పాటు ప్రత్యేక పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. స్వామి వారికి సింధూరం, ఆకు, తులసితో పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణంలో నిత్య హోమం చేశారు.

February 21, 2026 / 11:35 AM IST

‘జనసేన సైలెంట్ అయ్యిందా?’

NLR: అక్కడ జనసేన సైలెంట్ అయ్యిందా?.. ఎన్నికల ముందు హడావుడి చేసిన జన సైనికులు ఇప్పుడు ఏమయ్యారు. నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న టాపిక్ ఇదే.. నాయకులను సమన్వయం చేసే నాయకుడు లేకపోవడంతోనే జనసేనకు ఈ కష్టం వచ్చిందని పలువురు మాట్లాడుతున్నారు. అది కాక రెండేళ్లుగా జిల్లా అధ్యక్షుడు నియమించకపోవడం కూడా పార్టీ క్యాడర్లో నిరుత్సాహాన్ని నింపిందట. 

February 21, 2026 / 11:32 AM IST

ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవం

SKLM: నరసన్నపేట మండలం ఉర్లాం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని యువనేత, జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య శనివారం దర్శించుకున్నారు. ఆయనకి ఆలయ అర్చకులు సాధన స్వాగతం పలుకుతూ, ప్రత్యేక పూజలు చేపట్టి, స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆయనతోపాటు పలువురు వైసీపీ నాయకులు, తదితరులు ఉన్నారు.

February 21, 2026 / 11:29 AM IST

కనిగిరిలో స్వర్ణ ఆంధ్ర-స్వేచ్ఛ ఆంధ్ర కార్యక్రమం

ప్రకాశం: కనిగిరి పట్టణంలో శనివారం “స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్రగా, పట్టణాలను స్వచ్ఛ ఆంధ్రగా తీర్చిదిద్దడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. పట్టణ పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

February 21, 2026 / 11:28 AM IST

ఈ నెల 27 నుంచి ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

SKLM: ఎచ్చెర్ల మండలం కేంద్రంలో ఉన్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఈ నెల 27 నుంచి 31 రోజుల పాటు మగ్గం, బ్యూటీ పార్లర్ ,టైలరింగ్‌లో యువతకు ఉచిత శిక్షణా తరగతులు ప్రారంభం కానున్నాయని సంస్థ డైరెక్టర్ రామ్ జీ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. శిక్షణా కాలంలో ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పించబడును అని తెలిపారు.

February 21, 2026 / 11:27 AM IST

పంట కాలువలోకి దూసుకెళ్లిన బస్సు.. తప్పిన ప్రమాదం

W.G: భీమవరం మండలం యనమదుర్రులోని ఫ్యాక్టరీ వద్ద శనివారం ప్రమాదం జరిగింది. సదరు ఫ్యాక్టరీకి చెందిన బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్సు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఓ ఫ్యాక్టరీ బస్సుగా దీన్ని గుర్తించినట్లు వారు తెలిపారు.

February 21, 2026 / 11:24 AM IST

ట్యూబ్ లైట్‌తో స్నేహితుడిని పొడిచిన యువకుడు

కృష్ణా: మచిలీపట్నంలోని చిలకలపూడి పోలీస్ స్టేషన్ పరిధి ఈడేపల్లిలో గంజాయి మత్తులో ఉన్న ఇద్దరు యువకులు సాయి గణేష్ అనే వ్యక్తిపై ట్యూబ్ లైట్‌తో దాడికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం.. సాయి గణేష్ బాగా చదువుకుంటున్నాడనే అక్కసుతో ఈ దాడి జరిగింది. గతంలో స్నేహితులుగా ఉన్న సాయి గణేష్, సోమశేఖర్, కన్నా మధ్య గొడవలు తలెత్తడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

February 21, 2026 / 11:23 AM IST

సర్వ రోగ నివారణికి నమాజ్ చేయాలి: మౌలానా మహమ్మద్

సత్యసాయి: సోమందేపల్లి మండలంలోని జామియా మజీద్‌లో శనివారం రంజాన్ మాసం సందర్భంగా 3వ ఉపవాస దీక్షను ముస్లిం సోదరులు నిర్వహించారు. నమాజ్ అనంతరం మౌలానా మహమ్మద్ ఇలియాజ్ ప్రసంగిస్తూ రోజుకు ఐదు పూటలా నమాజ్ చేయాలని, అది శారీరక-మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలిపారు. మండల ప్రజల శ్రేయస్సు కోసం ప్రత్యేక దువా నిర్వహించారు.

February 21, 2026 / 11:23 AM IST

‘ప్రజల ప్లాస్టిక్‌కు దూరంగా ఉండాలి’

AKP: మానవాళికి హాని కలిగించే ప్లాస్టిక్‌కు ప్రజలు దూరంగా ఉండాలని ఎస్ రాయవరం మండలం తిమ్మాపురం సర్పంచ్ కర్రి సత్యనారాయణ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా శనివారం తిమ్మాపురం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని సూచించారు.

February 21, 2026 / 11:23 AM IST

పొన్నూరులో ‘ఈ-వేస్ట్’ పై అవగాహన ర్యాలీ

GNTR: పొన్నూరులో శనివారం ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు ఆధ్వర్యంలో ‘ఈ-వేస్ట్’ నియంత్రణపై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిబిసి రోడ్డు వద్ద ప్రతిజ్ఞ చేసిన అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. స్వచ్ఛ పొన్నూరు లక్ష్యంగా ప్రజలను చైతన్యపరచాలని సిబ్బందిని కోరారు.

February 21, 2026 / 11:21 AM IST