KRNL: గుత్తి మండల కరటికొండ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో శనివారం ఆచారి అనే వ్యక్తి మృతి చెందాడు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలానికి చెందిన ఆయన తీవ్రంగా గాయపడటంతో తొలుత స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అనంతపురానికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
PPM: రైతుల ఆర్థిక స్థితిగతుల పెంపుదల కోసం, ప్రభుత్వ లక్ష్యాలను అమలుపరుస్తూ నిరంతరం సేవ చేస్తున్న రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల న్యాయమైన కోరికలు ప్రభుత్వం తీర్చలేక పోతుందని ఎఐటీయుసీ మన్యం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్వీఎస్ కుమార్ విమర్శించారు. వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక (జెఎసి) చేస్తున్న నిరసనకు మద్దతు తెలియజేశారు.
VSP: అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా డాబా గార్డెన్స్‌లోని అంబేద్కర్ విగ్రహానికి సీపీఐ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి షేక్ రహిమాన్ మాట్లాడుతూ.. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడాన్ని విమర్శించారు. ఒక శాతం కార్పొరేట్ల వద్ద పోగుపడిన సంపదపై పన్నులు వేసి ప్రజలకు పునర్వినియోగం చేయాలని పేర్కొన్నారు.
ELR: జంగారెడ్డిగూడెం CPM భవనంలో రెడ్ బుక్స్ డే సందర్బంగా లెనిన్ రచించిన పెట్టుబడిదారి అత్యున్నత దశ సామ్రాజ్యవాదం అనే పుస్తకం మీద చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కన్వీనర్ సూర్యారావు మాట్లాడారు. 21-2-1848,లో మార్క్స్ & ఎంగిల్స్ కలసి రచించిన కమ్యూనిస్ట్ ప్రణాళిక విడుదల చేసిన రోజున ప్రపంచంలోని పెట్టుబడి దారి విధానానికి ఒక భూకంపం వచ్చిందన్నారు.
KDP: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ వినూత్న కార్యక్రమం స్వచ్ఛ రథం అని పేరు పెట్టారని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజల అన్నారు. శనివారం రాజుపాలెం నందు స్వచ్ఛ రథం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. స్వచ్ఛ రథం ఇంటింటికి తిరిగి ప్లాస్టిక్ పనికిరాని వ్యర్థలను సేకరిస్తుందని.
కృష్ణా: మచిలీపట్నం మండలం మేకవానిపాలెం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు ఇటీవల ప్రమాదవశాత్తు మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రి కొల్లు రవీంద్ర, ప్రమాద బీమా కింద రూ. 5 లక్షల చెక్కును మల్లేశ్వరరావు సతీమణి పుష్పారాణికి శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
VZM : గజపతినగరం మండలంలోని కొత్త బగ్గం గ్రామంలో శనివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన దాన చంద్రరావుకు చెందిన గడ్డివాము కాలిపోయింది. సుమారు 20 వేల రూపాయలు ఆస్తి నష్టం సంభవించింది. గజపతినగరం అగ్నిమాపక కేంద్రం అధికారి ఎంఎస్‌వీ రవి ప్రసాద్ సిబ్బందితో సంఘటన ప్రాంతానికి వెళ్లి మంటలను అదుపు చేశారు.
అన్నమయ్య: రాజాంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి పై టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు తీవ్ర ఆరోపణలు చేశారు. టీటీడీ నిధులను ఎమ్మెల్యే సొంత ఎస్టేట్ పనులకు వినియోగించారని ఆయన విమర్శించారు. అకేపాడు 56/1 సర్వే నెంబర్‌లో టీటీడీ నిధులతో నిర్మించిన కల్యాణమండపం ఇప్పటికీ ఎస్టేట్ ఆవరణంలోనే ఎందుకు ఉందని ప్రశ్నించారు.
E.G: ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న ప్రతి విద్యార్థి సమయానికి పరీక్షలకు హాజరై, చక్కగా పరీక్షలు రాసి, విజయం సాధించాలని జిల్లా ఎస్పీ డీ. నరసింహ కిషోర్ శనివారం సూచించారు. ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా పోలీసు అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద డ్రోన్ నిఘా ఉంటుందన్నారు.
NDL: ఉయ్యాలవాడ మోడల్ స్కూల్లో 2026–27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాసులురెడ్డి శనివారం తెలిపారు. ఈ నెల 24 నుంచి మార్చి 30 వరకు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసీ, బీసీలకు రూ.200, ఎస్సీ, ఎస్టీలకు రూ.125 ఫీజు. ఏప్రిల్ 27న ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల చేస్తారు.
W.G: కాళ్ళ మండలం ప్రాతల్లమెరక గ్రామంలో వేగిరాజు శివవర్మ ఆధ్వర్యంలో రూ 3 కోట్ల వ్యయంతో చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు ప్రారభించారు. జిల్లా కలెక్టర్ నాగరాణి, బాపట్ల ఎంఎల్ఏ , APIIC ఛైర్మన్ మంతెన రామరాజు ప్రారంభోత్సవం కార్యక్రమంలో వారు పాలుపంచుకున్నారని ఆయన తెలిపారు.
సత్యసాయి: తలుపుల మండలం మంగివాండ్లపల్లిలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ శనివారం ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. సమస్యలను నేరుగా ప్రజలతో అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ, వాటికి త్వరితగతిన పరిష్కారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
KRNL: మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఆమె భర్త నీలకంఠకు చెందిన ఆస్తులను వేలం వేయనున్నట్లు LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ శనివారం ప్రకటించింది. 2018లో తీసుకున్న రుణం వడ్డీతో కలిసి రూ.782 కోట్లకు చేరగా, చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. KPHBలోని మెరిడియన్ పాఠశాల భవనం, స్థలాన్ని మార్చి 24న వేలం వేయనున్నారు. కనీస విలువను రూ.65 కోట్లుగా నిర్ణయించారు.
ATP: గుంతకల్లు మండలం నాగసముద్రం గ్రామంలోని ఇంటి వద్దకు వెళ్లి లబ్ధిదారులకు CMRF చెక్కులను శనివారం టీడీపీ నేతలు పంపిణీ చేశారు. మండల ఇన్‌ఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే జయరాం ఆదేశాల మేరకు ఇంటి వద్దకే వెళ్లి ఒకరికి రూ.72,650వేలు, మరొకరికి రూ.45 వేలు సీఎంఆర్ ఎఫ్ చెక్కులను పంపిణీ చేశామన్నారు. సీఎం సహాయనిధి పేదలకు ఒక వరం అన్నారు.
కృష్ణా: స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏపీ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి మచిలీపట్నంలోని బస్టాండ్‌ను మంత్రి కొల్లు రవీంద్ర శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో మంత్రి కాసేపు ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాలాజీ, డీఎం పెద్దిరాజులు పాల్గొన్నారు.