GNTR: వడ్లమూడి బాల కోటేశ్వర స్వామి తిరునాళ్ల సందర్భంగా సమగ్ర పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించినందుకు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌ను దేవస్థాన అధికారులు ఘనంగా సన్మానించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య శాలువా కప్పి ప్రసాదం అందజేశారు. తిరునాళ్లకు భారీగా తరలివచ్చిన భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడంలో పోలీసుల పాత్ర కీలకమన్నారు.
సత్యసాయి: ధర్మవరం రూరల్ మండలం ఎలకుంట్ల గ్రామంలో చింతచెట్టు పైనుంచి పడి దాసరి రాము అనే వ్యక్తి మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ యువ నాయకులు సంధా రాఘవ శనివారం మృతుడి నివాసానికి వెళ్లి భార్య ఓబులమ్మను పరామర్శించారు. బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేశారు.
NTR: గన్నవరం నుంచి బయలుదేరే షార్జా ఫ్లైట్‌ని శనివారం ఎయిర్‌పోర్ట్ అధికారులు నిలిపివేశారు. దీంతో సుమారు 163 మంది ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. విమానం ఎప్పుడు బయలుదేరుతుందనే విషయంపై స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. షార్జాలో అనుకూల పరిస్థితులు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని సిబ్బంది వెల్లడించారు.
ATP: గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చేయడం చట్టవిరుద్ధమని అనంతపురం ఆర్డీవో కేశవ నాయుడు హెచ్చరించారు. శనివారం ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిబంధనలు అతిక్రమించే స్కానింగ్ కేంద్రాల అనుమతులు రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఆడపిల్లల సంఖ్య తగ్గకుండా చూడాలని అన్నారు.
కోనసీమ: అమలాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ వేడుకలకు శనివారం రాట ముహూర్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరగాలని నియోజకవర్గ ప్రజలందరిపై ఆ స్వామి వారి కృపాకటాక్షాలు మెండుగా ఉండాలని ప్రార్ధించినట్లు తెలిపారు.
CTR: చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావును ఇవాళ ఆయన కార్యాలయంలో జనసేన నాయకులు ఎం. మహేష్ స్వేరో, తవణంపల్లి మండల ప్రధాన కార్యదర్శి ఉదయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. తవణంపల్లి మండలం, పూతలపట్టు నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ప్రసాదాలను ఎంపీకి అందజేశారు.
AKP: పరవాడ మండలం జాజులవానిపాలెం, పీ.బోనంగి, కలపాక మీదుగా దళాయిపాలెం వరకు రూ 4.40 కోట్లతో 12.6 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి శనివారం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు శంకుస్థాపన చేశారు. రోడ్డు నిర్మాణంతో గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
అన్నమయ్య: జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి జిల్లాలో యువతను లక్ష్యంగా చేసుకుని విస్తరిస్తున్న ‘కూల్ లిప్’ వంటి నికోటిన్ మాదకద్రవ్యాలపై కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, పాన్ షాపులు, కిరాణా దుకాణాలపై నిరంతర తనిఖీలు, దాడులు నిర్వహించాలని సూచించారు.
NDL: అవుకు మండలం రామాపురం గ్రామంలో ఇవాళ రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ పర్యటించారు. టిడిపి నాయకుడు విశ్వనాథరెడ్డి కుటుంబ సభ్యులు నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవం కార్యక్రమంలో బీసీ ఇందిరమ్మ పాల్గొన్నారు. అనంతరం బీసీ ఇందిరమ్మ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
W.G: వీరవాసరం మండలం కొణితివాడ బుద్ధ రాయుడు చెరువు వద్ద రూ.3.48 కోట్లతో నిర్మించిన 33 KV ఫీడర్‌ను శనివారం MLA పులపర్తి రామాంజనేయులు, MP పాక సత్యనారాయణ ప్రారంభించారు. భీమవరం నుంచి కొణితివాడ వరకు 16.6 కి.మీ. మేర కొత్త విద్యుత్ లైన్ నిర్మించినట్లు వారు తెలిపారు. నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
E.G: గత వైసీపీ ప్రభుత్వంలో మతసామరస్యాన్ని దెబ్బతీసే అంశం మొదలైందని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు విమర్శించారు. శనివారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. భారత పార్లమెంటరీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా శాసనమండలిలో వైసీపీ నేతలు భగవంతుని ఫోటోలు ప్రదర్శించారని మండిపడ్డారు. చెప్పులు, బూట్లు ధరించి స్వామి వారి ఫోటోలు ప్రదర్శించడం అపచారమన్నారు.
TPT: చిట్టమూరు మండలం కొత్తగుంటలోని టీఎంఆర్ విద్యాసంస్థల అధినేత డా. తంబిరెడ్డి మనోహర్ రెడ్డికి గ్రామీణ విద్యాభివృద్ధి, సామాజిక సేవలకు గాను అమెరికన్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. చెన్నైలో అవార్డు స్వీకరించిన అనంతరం శనివారం టీఎంఆర్ పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించారు. కడైరెక్టర్ విజయలక్ష్మి, ప్రిన్సిపల్ రహంతుల్లా పాల్గోన్నారు.
కృష్ణా: మచిలీపట్నం ఆటో డ్రైవర్లకు శక్తి టీం ట్రాఫిక్ నిబంధనలు, మాదకద్రవ్యాల వినియోగం, సైబర్ క్రైమ్ తదితర అంశాలపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శక్తి టీం సభ్యులు మాట్లాడుతూ.. ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని, మద్యం సేవించి వాహనం నడపకూడదని, తగు సూచనలు చేశారు.
ATP: అనంతపురం మార్కెట్ యార్డులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీని ఆదేశించారు. యార్డులో పాలకవర్గంతో నిర్వహించిన సమావేశంలో మార్కెట్ అభివృద్ధిపై చర్చించారు. చీనీ రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, కష్టపడి పంట తెచ్చే రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని సూచించారు.
సత్యసాయి: పుట్టపర్తి కలెక్టరేట్‌లో పీఎం సూర్య ఘర్ పథకంపై జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ శనివారం విద్యుత్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 11,987 ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు ఉచిత సోలార్ రూఫ్ టాప్‌లు మంజూరైనట్లు తెలిపారు. నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వాడే కుటుంబాలకు ఈ అవకాశం కల్పిస్తామని తెల...