కోనసీమ: అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు సంక్షేమానికి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. ఆదివారం రామచంద్రపురంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించినప్పటికీ, అంగన్వాడీలకు తాము ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు అందజేస్తున్నట్లు తెలిపారు.
NDL: ఉగాది మహోత్సవాల సందర్భంగా సోమవారం నుంచి శ్రీశైలానికి పాదయాత్రకు అనుమతి ఉందని ఈవో ఎం. శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. వెంకటాపురం నుంచి యాత్ర ప్రారంభమవుతుందని, భక్తుల సౌకర్యార్థం శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఉత్సవాలు మార్చి 16 నుంచి 20 వరకు జరగనున్నాయని, నాలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని అయన పేర్కొన్నారు.
ప్రకాశం: వై. పాలెం నియోజకవర్గ వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ మాలపోలు శ్యామ్ ఆధ్వర్యంలో ఆదివారం 5 మండలాల కన్వీనర్ల సమావేశం జరిగింది. పార్టీ బలోపేతమే లక్ష్యంగా సోషల్ మీడియా సభ్యులు పనిచేయాలని ఆయన సూచించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ శ్రమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
SKLM: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఒక్క రోజు ఆదాయాన్ని ఆలయ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. టికెట్లు రూపేణ, విరాళాలు, ప్రసాదాలు రూపంలో రూ. 7.18 లక్షలు స్వామి వారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో NVD ప్రసాద్ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారని తెలిపారు.
E.G: దేవరపల్లిలో ఇటీవల మరణించిన పలువురి కుటుంబాలను గోపాలపురం MLA మద్దిపాటి వెంకట రాజు ఆదివారం పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తంగెళ్ల మునేశ్వరరావు, సొసైటీ ఛైర్మన్ ఉప్పులూరి నరేంద్ర రామారావు, గ్రామ కమిటీ అధ్యక్షుడు నందిగం శ్రీధర్, సీనియర్ నాయకులు సుంకర దుర్గారావు, తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్: వీరులపాడు మండలంలో ట్రాక్టర్ బోల్తా పడి ఓ రైతు మృతి చెందిన ఘటన సోమవారం వేకువ జమున జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు, గోకరాజుపల్లి నుంచి గ్రామంలో కూలీలను దించి వస్తుండగా, ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడగా ట్రాక్టర్ టైర్ కింద పడి మహేష్ అనే రైతు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
PLD: జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికతో పాటు రెవెన్యూ క్లినిక్ జరుగుతుందని కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదుల కోసం కలెక్టరేట్కు రావడంతో పాటు, ఇంటి నుంచే మీ కోసం కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. 1100 నంబర్‌కు ఫోన్ చేసి లేదా Meekosam.ap.gov.in ద్వారా సమస్యలను నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.
KRNL: బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా పత్తికొండకు చెందిన సీసీ రంగన్నను నియమిస్తూ ఆదివారం రాష్ట్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ABVP కార్యకర్త నుంచి ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం 2 మార్లు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, ఒక మారు కిసాన్ మోర్చా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా పదవులు అధిష్టించారు. తనకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
KDP: కాశినాయన మండలం గంగన్నపల్లె హరిజవాడకు చెందిన కందుల దిలీప్ (24)పై గత ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన దిలీప్‌ను మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. దిలీప్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
గుంటూరు ఎన్టీఆర్ స్టేడియం ఎన్నికల్లో విజయం సాధించిన వజ్జా రామకృష్ణ ప్యానెల్ సభ్యులను ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆదివారం రాత్రి తన కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేలా నూతన కమిటీ సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. స్టేడియం అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఆమె వారికి భరోసా ఇచ్చారు.
GNTR: ఫిరంగిపురం మండల పరిధిలోని అమీనాబాద్, వేములూరిపాడు గ్రామాల్లో సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. విద్యుత్ మరమ్మతు పనుల కారణంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏఈ దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ మేరకు వినియోగదారులు గమనించి, విద్యుత్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు.
కృష్ణా: బాలికలు క్యాన్సర్ వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోకుండా ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక వాక్సినేషన్ డ్రైవ్ పై కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రి మాజీ ఛైర్మన్ యలమంచిలి కిషోర్ బాబు ఆదివారం మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టిన వాక్సినేషన్ డ్రైవ్ అభినందనీయమన్నారు. క్యాన్సర్ వ్యాధిని ప్రారంభ దశలోనే నివారించడానికి హెచ్‌పీవీ టీకా ఎంతో ప్రభావ వంతంగా ఉంటుందని తెలిపారు.
KRNL: కాల్వ గ్రామ సమీపంలోని పుట్టగొడుగుల పరిశ్రమలో పనిచేస్తున్న ఒడిశాకు చెందిన సుస్మిత (26) కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకుంది. భర్తతో వాగ్వాదం తర్వాత మనస్తాపంతో షెడ్‌లో ఉరివేసుకుంది. తోటి కార్మికులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత కేసు నమోదు చేస్తామని ఆదివారం పోలీసులు తెలిపారు.
VSP: విశాఖ జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
PLD: మండల కేంద్రమైన ఈపూరులో బోటి మీద కొలువైన ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల మహోత్సవంలో కార్యక్రమంలో ఆదివారం ప్రభుత్వ చీఫ్ విప్, MLA జీవి ఆంజనేయులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ఏర్పాటు చేసిన ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.