BPT: జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, మౌలిక సదుపాయాల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ డా.వినోద్ కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో ఆయన సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న పనులను గడువులోగా పూర్తి చేసి, వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా అధికారులకు ఆయన స్పష్టం చేశారు.
కృష్ణా: గ్రామీణ ప్రజలు ముందస్తు కాన్సర్ పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరమని టిడిపి నేత వర్ల చైతన్య అన్నారు. బుధవారం పమిడిముక్కల మండలం హనుమంతపురం గ్రామ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహిస్తున్న ఉచిత క్యాన్సర్ శిబిరాన్ని ఆయన సందర్శించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని పేర్కొన్నారు.
ATP: వజ్రకరూరు గ్రామంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను జడ్పీ సీఈవో శివశంకర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించి, మండల సమస్యలపై ఎంపీడీవోతో చర్చించారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పంచాయతీలో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని గ్రామ సర్పంచ్ మోనాలిసాకు సూచించారు.
నెల్లూరు: బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షమ్మ స్వామి అమ్మవార్ల దేవస్థానాన్ని మార్చి మూడవ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా మూసివేయునున్నారు. ఆరోజు ఉదయం ఆర్జిత సేవలు అనంతరం 10 గంటల తర్వాత ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఈవో శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. సంప్రోక్షణ అనంతరం నాలుగవ తేదీ యధావిధిగా దర్శనం కల్పిస్తామన్నారు.
ATP: గుత్తి ఏపీ గురుకుల బాలికల పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ స్వాతి బుధవారం తెలిపారు. మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులకు సంబంధించి ఖాళీలు ఉన్నాయని వివరించారు. ఎమ్మెస్సీ మ్యాథ్స్ లేదా ఫిజిక్స్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ELR: నూజివీడు(మం) సుంకొల్లు, సిద్ధార్థనగర్‌లలో మామిడి తోటలను ఉద్యాన అధికారులు బుధవారం పరిశీలించారు. శాస్త్రవేత్త కే. రాధా రాణి మాట్లాడుతూ.. మామిడి పూత పిందె కట్టి నిలిచేందుకు 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన అధికారి ఆర్. హేమ, రైతులు పాల్గొన్నారు.
అన్నమయ్య: ఓబులువారిపల్లి(మం) ముక్కవారిపల్లి పంచాయతీ సంజీవపురం గ్రామానికి చెందిన చింత సుజనా కుమారి పెద్దకర్మకు రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంఛార్జ్ & KUDA ఛైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, వారి సతీమణి ముక్కా వరలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కడప నగరంలోని ఎర్రముక్కపల్లి–విశ్వనాధపురం మధ్య రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తిచేయాలని డిమాండ్ చేస్తూ సాధన కమిటీ ఈనెల 27న నిరసన ప్రదర్శన చేపట్టనుంది. ఉదయం 10 గంటలకు విశ్వనాధపురం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు కన్వీనర్ నాగేళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. నిధుల విడుదలలో జాప్యంపై కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది.
తిరుపతిలోని ఆటోనగర్‌కు చెందిన అశాలత, ఆమె మనవరాలు దుర్గా అదృశ్యమైనట్లు ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 19న ఉదయం ఇంటి నుంచి వెళ్లిన వీరిద్దరూ తిరిగి రాలేదని తల్లి నాగరత్నం ఫిర్యాదులో పేర్కొన్నారు. బంధుమిత్రుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
NDL: జిల్లాలో అమలులో ఉన్న సోలార్ విద్యుత్ పథకాల పురోగతిని వేగవంతం చేయాలని కలెక్టర్ జీ. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. రూఫ్‌టాప్ సోలార్ (RTS) ప్లాంట్ల అమలుపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ రాయితీలు, బ్యాంకు రుణ సౌకర్యాల వివరాలను స్పష్టంగా తెలపాలన్నారు.
ప్రకాశం: దోర్నాల మండలం గంటవానిపల్లి వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ ను సందర్శించిన అనంతరం హెలిప్యాడ్‌లో మార్కాపురానికి బయలుదేరారు. ఈ సందర్భంగా పట్టణంలోని తర్లుపాడు రోడ్లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని, ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. మార్కాపురం జిల్లా ఏర్పడిన తరువాత తొలిసారి రావడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
CTR: పలమనేరు ఎస్సై స్వర్ణ తేజ ఉర్దూ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో “ధైర్య స్పర్శ”, మహిళలపై నేరాలు, మహిళా భద్రతా చర్యలు, డయల్ 112 అత్యవసర సేవల వినియోగం, సైబర్ నేరాల నివారణపై అవగాహన కల్పించారు.
BPT: వేటపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి పట్టభద్రుల సంఘం అధ్యక్షులు ప్రత్తి వెంకట సుబ్బారావు ఆర్థిక సాయం అందించారు. ఆసుపత్రి వైద్యురాలు స్వాతికిరణం విజ్ఞప్తి మేరకు, రోగుల కోసం కుర్చీలు (బల్లలు), మందుల బీరువా కొనుగోలు నిమిత్తం రూ. 23,100 చెక్కును బుధవారం సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా దాత సేవలను వైద్య సిబ్బంది అభినందించారు.
NTR: విజయవాడలో ఏపీఎండీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన “బీచ్ శాండ్ మినరల్స్ టు టైటానియం, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, పై జరిగిన వర్క్‌షాప్‌లో మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏపీలోని బీచ్ సాండ్ ఖనిజాలు కేవలం ఆర్థిక వనరులు మాత్రమే కాకుండా గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ వెహికల్స్ రంగాలు అత్యంత కీలకమని తెలిపారు.
కృష్ణా: దివిసీమ అభివృద్ధి ప్రదాత ఎంవీ కృష్ణారావు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు అన్నారు. బుధవారం అవనిగడ్డ వంతెన సెంటర్లో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి సందర్భంగా కృష్ణారావు విగ్రహానికి నాగాయలంక మండలం టీ.కొత్తపాలెం కూటమి నాయకులు నివాళులు అర్పించారు.