VSP: సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వర్ణ తులసీదళార్చన శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది. స్వర్ణ తులసీదళార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. స్వర్ణ తులసీదళార్చన అత్యంత వైభవంగా దేవస్థాన వేదపండితుల వేదమంత్రాల, నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు.
సత్యసాయి: నేతన్నల అభ్యున్నతికి, చేనేత రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి సవిత తెలిపారు. శుక్రవారం బడ్జెట్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. చేనేత సహకార సంఘాలకు ఆప్కో బకాయిలను చెల్లిస్తున్నామని తెలిపారు. కొద్ది కాలంలోనే రూ.7 కోట్ల మేర బకాయిలు చెల్లించామని పేర్కొన్నారు. రాబోయే ఉగాది పండుగకు మరో విడత బకాయిలు చెల్లిస్తామని వెల్లడించారు.
E.G: గోపాలపురం నియోజకవర్గంలో 85 మంది లబ్ధిదారులకు రూ. 55 లక్షల ఆర్థిక సహాయం అందజేసినట్లు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తెలిపారు. 27వ విడతగా మంజూరైన ఈ చెక్కులు అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తాయని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సాయం అందేలా కృషి కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ATP: అనంత నాగ్ సంగీత్ కల్చరల్ అసోసియేషన్, ఎల్కేపి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం బాలు శత గళార్జన నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. లలిత కళాపరిషత్‌లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకుడు మాధవ పెద్ది సురేష్ హాజరవుతారన్నారు.
GNTR: చేనేత కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో ఐక్య కార్యచరణ కమిటీగా ఏర్పడి ఉద్యమిస్తామని చేనేత కార్మిక సంఘం నాయకుడు పిల్లలమర్రి నాగేశ్వరరావు హెచ్చరించారు. శుక్రవారం మంగళగిరి ప్రెస్ క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..చేనేత పరిరక్షణ చట్టం అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
SKLM: ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై శాసన మండలిలో వైసీపీ సభ్యులు భౌతిక దాడికి పాల్పడటం హేయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాలం అన్నారు. శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. తిరుపతి లడ్డూ కల్తీ ఘటనపై చర్చ జరుగుతున్న సమయంలో దాడి జరగడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మారిందన్నారు.
తిరుపతి రూరల్ పరిధిలో నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని కొత్త సీఐ స్పష్టం చేశారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి మత్తును పూర్తిగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శుక్రవారం తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్‌లో మద్దయ్యచారి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
AKP: అనకాపల్లి బీజేపీ కార్యాలయంలో స్త్రీ పంచకం కార్యక్రమ పోస్టర్లు శుక్రవారం ఆవిష్కరించారు. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 6 నుంచి 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం జరగనున్నట్లు జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఇందులో మహిళా జనరల్ సెక్రటరీ రోహిణి తదితరులు పాల్గొన్నారు.
KDP: సింహాద్రిపురం మండలంలోని గ్రామాల్లో ఈ నెల 28వ తేదీ నుంచి నెల రోజులపాటు స్వచ్ఛ రథంపై అవగాహన కల్పిస్తున్నట్లు ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం సింహాద్రిపురంలో స్వచ్ఛరథం కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తడి, పొడి చెత్తను సేకరించి ఇస్తే సరుకులు ఇవ్వడం జరుగుతుందన్నారు.
ATP: పెద్దవడుగూరు మండలం కొండూరు సమీపంలో భూ రీ-సర్వే విషయంలో ఇరు వర్గాల మధ్య మాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో పరస్పరం ఇరు వర్గాలు రాళ్లు రవ్వుకున్నారు. ఈ ఘటనలో రామన్న అనే వ్యక్తికి గాయాలయ్యాయి. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
SKLM: పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి నారా లోకేష్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. కొత్తూరులో డిగ్రీ కాలేజ్ మంజూరు చేయాలని, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే క్రమబద్దీకరణ చేయాలని, వంశధార ప్రాజెక్టు నిర్వాసితులపై నమోదైన కేసులను మానవతా దృష్టితో ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు.
AKP: రోటరీ క్లబ్, ఎన్టీఆర్ వైద్యాలయం ఆధ్వర్యంలో గవరపాలెం జీవీఎంసీ చిన్న హైస్కూల్‌లో శుక్రవారం విద్యార్థులకు సీపీఆర్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డా. పృద్వీ మాట్లాడుతూ.. హార్ట్ ఎటాక్ సమయంలో తక్షణ సీపీఆర్ ప్రాణరక్షకమని తెలిపారు. సీపీఆర్ చేయడం వల్ల గుండె మళ్లీ కొట్టుకొని మెదడుకు రక్తప్రసరణ జరుగుతుందని వివరించారు.
ప్రకాశం మార్కాపురం APTF ఆధ్వర్యంలో ఉద్యోగులు పట్టణంలోని R&B కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ పిఆర్సి , ఐఆర్, యాప్ ల పని భారం తగ్గించి, రాష్ట్రస్థాయి విద్యారంగం ఆర్థిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే ఇతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
PLD: ఎడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. సొలస, మర్రిపాలెంకు చెందిన ఇస్మాయిల్, రమేష్ బైక్‌పై వెళ్తున్నారు. వారు రోడ్డు దాటుతుండగా గుంటూరు నుంచి వస్తున్న కారు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
తిరుపతిలో 30ఏళ్ల క్రితం నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (UDG) సిస్టమ్ దెబ్బతిందని MLA శ్రీనివాసులు అసెంబ్లీలో ప్రస్తావించారు. తిరుపతిలో పాత 60KM డ్రైనేజీ బాగు చేసి కొత్తగా 125KMల మేర UDG నిర్మాణానికి రూ.152కోట్లు కావాలని, అలాగే 42వేల ఇళ్లకు కొత్తగా కనెక్షన్ ఇవ్వడానికి రూ.36కోట్లు అవసరం అని MLA కోరారు. ఇప్పటికే ప్రతిపాదనలు చేశామని తెలిపారు.