• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మార్చి 25న ఏయూ స్నాతకోత్సవం

VSP: ఏయూ 91, 92వ సంయుక్త స్నాతకోత్సవాన్ని మార్చి 25న నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు నోటిఫికేషన్ విడుదల చేశారు. బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో ఉదయం 11 గంటలకు ఈ వేడుక ప్రారంభం కానుంది. గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ ఈ వేదికపై పట్టాలు అందుకోనున్నారు.

February 23, 2026 / 07:43 PM IST

చందోలు ఈత శిక్షకుడికి జాతీయ స్థాయి గుర్తింపు

BPT: జాతీయ పోలీస్ స్విమ్మింగ్ పోటీల సాంకేతిక నిపుణుడిగా చందోలుకు చెందిన షేక్ ఖాజా మొహిద్దీన్ ఎంపికయ్యారు. ప్రస్తుతం గుంటూరు నగర పాలక సంస్థలో ఈత శిక్షకుడిగా పనిచేస్తున్న ఆయనను, ఫిబ్రవరి 23 నుండి 28 వరకు జరిగే 73వ ఆల్ ఇండియా పోలీస్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌కు స్విమ్మింగ్ ఫెడరేషన్ ఎంపిక చేసింది. ఈ గౌరవం దక్కడంపై ఆయన సోమవారం హర్షం వ్యక్తం చేశారు.

February 23, 2026 / 07:41 PM IST

డాక్యుమెంట్ అప్‌లోడింగ్ వేగం పెంచాలి: కలెక్టర్

NDL: ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల అమలులో అధికారులు వేగంగా పనిచేయాలని సోమవారం జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదేశించారు. EPTS డాక్యుమెంట్ అప్‌లోడింగ్ లక్ష్యాన్ని 15 లక్షలకు పెంచినందున మండల స్థాయిలో పర్యవేక్షణ చేసి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఏకీకృత కుటుంబ సర్వేను ఈ నెల 28లోగా పూర్తి చేసి వివరాలను అప్‌లోడ్ చేయాలని తెలిపారు.

February 23, 2026 / 07:41 PM IST

విద్యుత్ వైర్లు తగిలి రెండు ఆవులు మృతి

KRNL: తుగ్గలి మండల పరిధిలోనే రోల్లపాడు తండాలో విద్యుత్ వైర్లు తగిలి ఇవాళ రెండు ఆవులు మృతి చెందాయి. రోల్లపాడు తండాలోని ఒక వ్యవసాయ తోటలో ఉండే విద్యుత్ వైర్లకు రోల్లపాడు తండాకు చెందిన పాండు నాయక్‌కు సంబంధించిన రెండు ఆవులు తగలడంతో అక్కడికక్కడే రెండు ఆవులు మృతి చెందాయి. మృతి చెందిన ఆవులకు రూ. 80 వేల వరకు ఉండవచ్చని గ్రామస్తులు తెలిపారు.

February 23, 2026 / 07:40 PM IST

‘పలమనేరు ఎమ్మెల్యే పేరిట ఫేక్ కాల్స్ నమ్మొద్దు’

CTR: పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కార్యాలయం పేరుతో ఫేక్ కాల్స్ నమ్మొద్దని ఓ ప్రకటనలో తెలిపింది. కొంతమంది ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి అన్నదానం, వసతి ఏర్పాట్లు చూస్తామని, అదేవిధంగా ఉచిత శిక్షణ ఇస్తామని కాల్ చేసి డబ్బులు అడుగుతున్నారని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.

February 23, 2026 / 07:39 PM IST

జనసేన కీలక నేతకు అస్వస్థత

ATP: అనంతపురం రూరల్ జనసేన ముఖ్య నాయకుడు గట్టు సుధాకర్ బ్రెయిన్ స్ట్రోక్ సమస్యతో సోమవారం పావని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాప్తాడు నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ సాకే పవన్ జనసేన శ్రేణులతో కలిసి ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. సుధాకర్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

February 23, 2026 / 07:39 PM IST

విద్యార్థులకు గుడ్ న్యూస్..!

అన్నమయ్య: బి.కొత్తకోట మోడల్ స్కూల్లో 2026-27 విద్యా సవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు ప్రిన్సిపల్ BS లిషానందని తెలిపారు. 5వ తరగతి పాసైన విద్యార్థులు అర్హులన్నారు. ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.200, SC, ST విద్యార్థులు రూ.125 చెల్లించి ఈనెల 24 నుంచి ఆన్‌లైన్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 12న పరీక్ష ఉంటుందన్నారు.

February 23, 2026 / 07:36 PM IST

పెసలు, మినుములకు ప్రభుత్వ మద్దతు ధర ఇదే

VZM: రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ఈనెల 27 నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నట్లు JC సేధు మాధవన్ సోమవారం తెలిపారు. తొలి దశలో జామి, సంతకవిటి, బొబ్బిలి మండలాల్లో కేంద్రాలు ప్రారంభిస్తామని, పెసలు క్వింటాకు రూ.8,768, మినుములు రూ.7,400 మద్దతు ధరగా ఉంటుందని, కొనుగోళ్లను ఏపీ మార్క్‌ఫెడ్ నోడల్ ఏజెన్సీగా, ఎన్‌సీసీఎఫ్ ద్వారా నిర్వహిస్తారన్నారు.

February 23, 2026 / 07:36 PM IST

గడ్డిమందు తాగి వ్యక్తి ఆత్మహత్య.. కేసు నమోదు

NLR: కావలి మండలం సిరిపురం గ్రామానికి చెందిన కన్నె ఆనంద్ రావు (42) గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని కావలి రూరల్ పోలీసులు సోమవారం తెలిపారు. మృతుడు ఈ నెల 21న సిరిపురంలో గడ్డిమందు తాగడంతో కావలి ఏరియా ఆసుపత్రికి తరలించి, మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. దీనిపై రూరల్ ఎస్సై బాజిబాబు కేసు నమోదు చేశారు.

February 23, 2026 / 07:34 PM IST

జేసీ విష్ణు చరణ్‌ను కలిసిన ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ

ATP: జిల్లా జాయింట్ కలెక్టర్‌ విష్ణు చరణ్‌ను ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతపురం కలెక్టరేట్‌లోని జేసీ ఛాంబర్‌లో జరిగిన ఈ భేటీలో జిల్లా అభివృద్ధి, రెవెన్యూ అంశాలపై చర్చించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగేలా అధికారులతో సమన్వయం చేసుకుంటామని ఎంపీ తెలిపారు.

February 23, 2026 / 07:33 PM IST

పేకాట స్థావరంపై దాడులు.. అదుపులోకి 8 మంది

NLR: మర్రిపాడు మండలం తిక్కవరం గ్రామ శివారు ప్రాంతంలో పేకాట ఆడుతున్నారని సమాచారం రావడంతో ఎస్ఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి సోమవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 8 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 21,910 నగదు, 8 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిని 8 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

February 23, 2026 / 07:33 PM IST

‘పెండింగ్ క్లెయిమ్స్ వెంటనే విడుదల చేయాలి’

KDP: దేశవ్యాప్త పిలుపులో భాగంగా కడపలో భవన నిర్మాణ కార్మిక నాయకులు MRO నారాయణరెడ్డి, తాసిల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. పెండింగ్‌లో ఉన్న 46 వేల క్లెయిమ్స్‌ను వెంటనే పరిష్కరించి సొమ్ము విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వెల్ఫేర్ సెస్సును కార్మికుల సంక్షేమానికే వినియోగించి, వెల్ఫేర్ బోర్డును పటిష్టం చేయాలని నాయకులు కోరారు.

February 23, 2026 / 07:33 PM IST

ప్రజల వద్ద నుండి అర్జీలను స్వీకరించిన కమిషనర్

కృష్ణా: గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సంస్థ పరిష్కారం వేదికలో మున్సిపల్ కమిషనర్ మనోహర్ ప్రజల వద్ద నుండి 5 అర్జీలను స్వీకరించారు. శానిటేషన్ కు సంబంధించి 1 అర్జీ, ఆక్రమణలకు సంబంధించి 2 అర్జీలు, న్యూ డ్రైనేజ్ నిర్మాణం కోసం 2 అర్జీలు కమిషనర్‌కు అందాయి. సంబంధిత శాఖ అధికారులు సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కమిషనర్ ఆదేశించారు.

February 23, 2026 / 07:32 PM IST

అర్జీలు నిర్ణీత సమయంలోనే పరిష్కరించాలి: కలెక్టర్

GNTR: గుంటూరు కలెక్టరేట్ శంకరన్ హాల్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని ఆదేశించారు. ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీని నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని, ఆలస్యం జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు,

February 23, 2026 / 07:32 PM IST

పిఠాపురంలో ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్

కాకినాడ: పిఠాపురం సీఐ శ్రీనివాస్ ఆటో డ్రైవర్లకు అవగాహన, కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆటో నడిపే సమయంలో చేసే సాధారణ తప్పిదాలు, ప్రమాదాలకు గల అవకాశాలను వివరించారు. వేగం అదుపులో లేకుండా నడపడం ప్రాణాలకు హానికారకమని, పరిస్థితులను గమనిస్తూ వాహనం నడపాలని సూచించారు. నియమాలను లెక్కచేయకుండా నడిపితే జరిమానాలు, కేసులు, వాహన పత్రాలరద్దు వంటి చర్యలు తప్పవని సిఐ హెచ్చరించారు.

February 23, 2026 / 07:32 PM IST