• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘ప్రతి ఒక్కరు బాధ్యతగా పన్నులు చెల్లించాలి’

ELR: దెందులూరులో గురువారం కలెక్టర్ వెట్రి సెల్వి పర్యటించారు. గ్రామస్తులకు పన్నుల చెల్లింపు ప్రాముఖ్యతపై అవగాహన వివరించడంతో స్వచ్ఛందంగా వారు ముందుకు వచ్చి గ్రామ సచివాలయం సిబ్బంది ద్వారా ఆన్‌లైన్‌లో హౌస్ టాక్స్‌ను చెల్లించారు. ప్రజలు సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని, ప్రతి ఒక్కరూ సామజిక బాధ్యతగా పన్నులు చెల్లించాలని వారికి సూచించారు.

February 26, 2026 / 02:02 PM IST

వివాహిత అదృశ్యంపై కేసు నమోదు

AKP: ఎలమంచిలి మండలం కొక్కిరాపల్లికి చెందిన గొర్లె వరహాలమ్మ(55) ఈనెల 23న స్వగ్రామం నుంచి ఆసుపత్రికి ఆటో బయలుదేరి ఎలమంచిలిలో దిగి అదృశ్యం అయింది. చుట్టుపక్కల బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. ఆమె బంధువు ప్రసాద్ స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్సై సావిత్రి గురువారం తెలిపారు.

February 26, 2026 / 01:57 PM IST

కిర్లంపూడి ఇన్‌ఛార్జ్ తహశీల్దార్‌గా సాయి బాధ్యతలు

KKD: కిర్లంపూడి డిప్యూటీ తహశీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న కె.సాయి కిరణ్ గురువారం మండల మెజిస్ట్రేట్‌గా ఫుల్ అడిషనల్ ఛార్జ్ స్వీకరించారు. ఆయనకు సిబ్బంది పుష్పగుచ్ఛాలతో శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించడం తన ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

February 26, 2026 / 01:54 PM IST

స్టోన్ హౌస్ పేట ప్రాంతంలో కమిషనర్ పర్యటన

నెల్లూరు: నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా గురువారం స్థానిక 6వ డివిజన్ స్టోన్ హౌస్ పేట ప్రాంతంలో పర్యటించారు. ఒక భవనానికి సంబంధించిన అసెస్మెంట్ డిమాండ్, టౌన్ ప్లానింగ్ నిర్మాణ అనుమతులను పరిశీలించారు. ఎండ్ టు ఎండ్ సి.సి రోడ్డు నిర్మాణ పనులను అత్యంత నాణ్యతతో, నిర్దేశించిన సమయంలో పూర్తి అయ్యేలా పర్యవేక్షించాలన్నారు.

February 26, 2026 / 01:51 PM IST

వరుస నష్టాలతో రైతులు కుంగుబాటు

KDP: వ్యవసాయ దొంగతనాలు కమలాపురం(మం) రైతులను కలవరపెడుతున్నాయి. బోర్ల మోటార్లు, స్టార్టర్లు, కాపర్ వైర్లు వరుసగా చోరీకి గురవుతున్నాయి. ఫిర్యాదులు చేసినప్పటికీ సరైన చర్యలు లేవని రైతులు ఆరోపిస్తున్నారు. వరుస నష్టాలతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని అధికారులను కోరుతున్నారు.

February 26, 2026 / 01:43 PM IST

‘ఏడుకొండలకు మెరుగైన వైద్యం అందించాలి’

PLD: గురజాల మండలం దైద అడ్డరోడ్డు వద్ద బైక్‌పై వెళ్తున్న తేలుకుట్ల గ్రామ టీడీపీ సీనియర్ నాయకుడు బత్తుల ఏడుకొండలపై వైసీపీకి చెందిన నేతలు రాడ్లతో దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గుంటూరులో చికిత్స పొందుతున్న ఏడుకొండలను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. దాడిలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

February 26, 2026 / 01:41 PM IST

అనంతపురంలో జనసేన సభ్యత్వ నమోదు షురూ

ATP: అనంతపురం నగరంలో జనసేన పార్టీ ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమం పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. అహుడా (AHUDA) ఛైర్మన్, జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వయంగా సభ్యత్వ నమోదును పర్యవేక్షించారు. నగర ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి సభ్యత్వం తీసుకోవడం పార్టీపై పెరుగుతున్న ఆదరణకు నిదర్శనమని వరుణ్ పేర్కొన్నారు.

February 26, 2026 / 01:41 PM IST

రైతులు సంతృప్తిగా ఉన్నారు: MLA

CTR: గత ప్రభుత్వంలో జరిగిన రీసర్వే తప్పిదాలను ప్రస్తుత ప్రభుత్వం సరి చేస్తుండటంతో రైతుల్లో సంతృప్తి నెలకొందని నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తెలిపారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలు పంపిణీ చేయడంపై అభినందనలు తెలిపారు. సర్వేలో జాప్యం ఏర్పడకుండా త్వరగా పూర్తి చేయాలని అన్నారు.

February 26, 2026 / 01:40 PM IST

రూ. 20.70 లక్షల కూల్-లిప్ స్వాధీనం

అన్నమయ్య: ఆపరేషన్ వజ్రప్రహార్‌లో భాగంగా చౌడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రూ. 20.70 లక్షల విలువైన నిషేధిత కూల్-లిప్ పొగాకు ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మదనపల్లిలో 150 మంది పోలీసులతో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించి, 24 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. డ్రగ్స్, నిషేధిత పొగాకుపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి హెచ్చరించారు.

February 26, 2026 / 01:38 PM IST

రేపు మండల స్థాయి విజలెన్స్ కమిటీ సమావేశం

CTR: పుంగనూరు తహశీల్దార్ కార్యాలయంలో రేపు మండల స్థాయి విజలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు MRO రాము గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రజా ప్రతినిధులు, మండలస్థాయి అధికారులు, కమిటీ సభ్యులు తప్పక హాజరు కావాలని కోరారు.

February 26, 2026 / 01:37 PM IST

ఇంటర్‌నేషనల్ పోటీలకు వెంకటగిరి యువకుడు

TPT: టర్కీలో జరిగే ఇంటర్‌నేషనల్ గోల్ బాల్ పోటీలకు వెంకటగిరికి చెందిన అంధ యువకుడు ముప్పాళ్ల శేషగిరి ఎంపికయ్యాడు. పాట్నాలో జరిగిన పోటీల్లో ఏపీ తరఫున అతను పాల్గొన్నాడు. అక్కడ ప్రతిభచూపడంతో జాతీయ జట్టుకు ఎంపిక చేశారు. దీంతో అతడిని తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు తన కార్యాలయంలో అభినందించారు.

February 26, 2026 / 01:35 PM IST

సినిమా రంగంపై AI ముప్పు: దర్శకుడు దిలీప్ రాజా

GNTR: గుంటూరులో గురువారం జరిగిన ‘మా-ఏపి’ యూనియన్ సమావేశంలో దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల నటీనటులు, సాంకేతిక నిపుణుల ఉపాధి దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. AI వినియోగంపై సెన్సార్ బోర్డు తక్షణమే స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు.

February 26, 2026 / 01:35 PM IST

‘నీటి వ్యవస్థను సమర్థవంతంగా నిర్వర్తించాలి’

కర్నూలు: తాగునీటి వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడానికి ఇంజినీరింగ్ విభాగ అధికారులు, సచివాలయ, తాగునీటి సరఫరా విభాగ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ పీ. విశ్వనాథ్ సూచించారు. గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఇంజినీరింగ్ విభాగ అధికారులతో పాటు జూమ్ ద్వారా అమినిటీస్ కార్యదర్శులతో తాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు.

February 26, 2026 / 01:34 PM IST

హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి: ప్రిన్సిపల్ వసుధ

NLR: బుచ్చి మండలం రామచంద్రపురంలోని గురుకుల పాఠశాలలో 5వ తరగతి, ఇంటర్మీడియట్ తరగతులతో పాటు 6 నుండి 10 తరగతుల వరకు అడ్మిషన్స్ కోసం దరఖాస్తు చేసుకొన్నవారు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని ప్రిన్సిపల్ వసుధ తెలిపారు. మార్చి 1తేదీ నుండి ఇంటర్మీడియట్ ప్రవేశానికి, 6, 10వ తరగతి ప్రవేశానికి సంబంధించి మార్చి 8వ తేదీన పరీక్షలు జరుగుతాయన్నారు.

February 26, 2026 / 01:33 PM IST

పేద, మధ్యతరగతి వర్గాలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్

కోనసీమ: పేద, మధ్యతరగతి వర్గాల్లో అటు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ, ఇటు హెల్త్ ఇన్సూరెన్స్ వర్తించని వర్గాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అందిస్తున్న సీ.ఎం రిలీఫ్ ఫండ్ అండగా ఉంటుందని  యువనాయకులు బండారు సంజీవ్ వ్యాఖ్యానించారు. ఆలమూరులో గురువారం 33 మందికి  మంజూరు అయిన రూ.15.15లక్షలు లు విలువైన చెక్కులు అందజేశారు.  ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

February 26, 2026 / 01:30 PM IST