• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి’

PPM: జిల్లాలో మార్చి 2వ తేదీ నుండి 13 వరకు జరగనున్న 10వ తరగతి, ఇంటర్మీడియట్ సార్వత్రిక (ఓపెన్ స్కూల్) పరీక్షలకు పక్కా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ డా:ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏపీ ఓపెన్ స్కూల్ పరీక్షలకు సంబంధించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓపెన్ స్కూల్ పరీక్షలు ప్రశాంతంగా జరగాలన్నారు.

February 24, 2026 / 02:49 PM IST

డ్రైనేజ్ పనులు ప్రారంభించిన ఛైర్ పర్సన్

KRNL: ఆదోని బావాజీ పేట రెండో వార్డ్‌లో రూ. 800,000 విలువైన కొత్త డ్రైనేజ్ పనులు ఇవాళ ప్రారంభించబడ్డాయి. డాక్టర్ వాల్మీకి ఎమ్మెల్యే పార్థసారథి ఆదేశాల మేరకు ఈ పనుల ప్రారంభానికి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఛైర్ పర్సన్ లోకేశ్వరి, మున్సిపల్ కమిషనర్ నయం, ఏఈ, డీఈ, కాంట్రాక్టర్ రఘు, వార్డ్ కౌన్సిలర్ ఏవి సురేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

February 24, 2026 / 02:43 PM IST

పోలీసులకు ‘డీ మొబలైజేషన్’

అనకాపల్లి జిల్లా ఏఆర్ బలగాలకు కైలాసగిరిలో నిర్వహించిన వార్షిక డీ మొబలైజేషన్ మంగళవారం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా మాట్లాడుతూ.. 15 రోజులు పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోలీసులు నూతన దృక్పథంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.

February 24, 2026 / 02:42 PM IST

‘సర్క్యులర్ ఎకానమీ & గ్రీన్ కంపెనీస్’ కాన్ఫరెన్సు ప్రారంభం

VSP: ఏపీ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు కాన్ఫ‌డ‌రేష‌న్ ఆఫ్ ఇండియ‌న్ ఇండ‌స్ట్రీస్ ఆధ్వర్యంలో గాదిరాజు ప్యాలెస్‌లో ‘సర్క్యులర్ ఎకానమీ & గ్రీన్ కంపెనీస్’ అంశంపై కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రారంభించారు. పర్యావరణ హితమైన పారిశ్రామిక విధానాల‌ ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించడమే ప్...

February 24, 2026 / 02:42 PM IST

అతిథి అధ్యాపకులకు గుడ్ న్యూస్..!

KDP: యోగివేమన యూనివర్సిటీ పీజీ కళాశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్సెస్ విభాగ గెస్ట్ ఫ్యాకల్టీ నియామకం కోసం ఈనెల 25వ తేదీ ఉదయం 10 గంటలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ టి.శ్రీనివాస్ తెలియజేసారు.ఆసక్తి గల అభ్యర్థులు బయోడేటా,సంబంధిత ఒరిజినల్ సర్టిఫి కెట్లు, సర్టిఫికెట్ల జిరాక్స్ నేరుగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు.

February 24, 2026 / 02:35 PM IST

ఘనంగా రామక్కమ్మ ఆరాధన ఉత్సవాలు

CTR: విజయపురం(మం) కొసలనగరం మీట్టూరు శ్రీ రామక్కమ్మ ఆశ్రమం నందు మంగళవారం 46వ ఆరాధాన ఉత్సవాలు ఆశ్రమ నిర్వాహలు వాసుదేవ స్వామి నిర్వహించారు. ఆంధ్ర, తమిళనాడుకు చెందిన భక్తులు వేల సంఖ్యలో హాజరై అమ్మవారికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఉదయం నుంచి దర్శన ఏర్పాట్లు, అన్నదానం ఏర్పాటు చేశారు. కోలాటం, చెక్కభజన, హారికధ, ప్రదర్శించారు.

February 24, 2026 / 02:35 PM IST

సైక్లింగ్ పోటీలను ప్రారంభించిన కలెక్టర్

PLD: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను వెలికితీసేందుకు ప్రతి నెల క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా వెల్లడించారు. మంగళవారం నరసరావుపేటలో కోడెల క్రీడా ప్రాంగణంలో జరిగిన జూనియర్ అండర్-18 సైక్లింగ్ (వ్యక్తిగత, మాస్టర్ విభాగాలు) పోటీలను ఆమె జెండా ఊపి ప్రారంభించారు.

February 24, 2026 / 02:35 PM IST

రోడ్డు ప్రమాదం..ఓ వ్యక్తికి గాయాలు..!

ELR: తంగెళ్ళమూడిలోని గౌరీ దేవి గుడి క్రాస్ వద్ద జరిగిన యాక్సిడెంట్‌లో మంగళవారం ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. క్రాస్ రోడ్డులో నడిచి వెళ్తున్న ఓ వ్యక్తిని ప్రైవేట్ బస్సు ఢీకొనగా అక్కడికక్కడే పడిపోయాడు. స్వల్పగాయలవ్వడంతో క్షతగాత్రుడుని అక్కడ ఉన్న వారు చికిత్సకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

February 24, 2026 / 02:33 PM IST

పన్ను వసూళ్లలో ఆదర్శంగా నిలిచిన డిప్యూటీ ఎంపీడీవో

ELR: ఉంగుటూరు గ్రామంలో మంగళవారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆస్తి పన్ను వసూళ్లను డిప్యూటీ ఎంపీడీవో రమేష్ బాబు పరిశీలించారు. పంచాయతీ సచివాలయ సిబ్బందితోపాటు ఆయన కూడా ఇంటింటికి ఆస్తి పన్ను కులాయి పన్ను చెల్లించాలని కోరారు. ఉంగుటూరు గ్రామం పన్ను వసూళ్లలో ఆదర్శంగా నిలుస్తుందని డిప్యూటీ ఎంపీడీవో అన్నారు. కార్యదర్శి రవి పాల్గొన్నారు.

February 24, 2026 / 02:33 PM IST

అవినీతి అధికారుల గుండెల్లో ACB రైడ్లు..!

కడప: జిల్లా వ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. దీంతో అవినీతి అధికారుల గుండెల్లో ACB రైళ్లు పరిగెత్తుతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఐదుగురు అవినీతి అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. ఇప్పటివరకు ఏసీబీకి పట్టుబడిన వారిలో అందరూ ఉన్నతస్థాయి ఉద్యోగులే. కేవలం నెలరోజుల్లోనే ఐదుగురు పట్టుబడటంతో జిల్లాలో ఏ మేరకు అవినీ

February 24, 2026 / 02:31 PM IST

‘బాధితులకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి’

E.G: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో పలువురు మృతి చెందడం, 19 మంది అస్వస్థతకు గురవ్వడం పట్ల మాజీ హోంమంత్రి తానేటి వనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. బాధితుల వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలని, మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కల్తీకి బాధ్యులైన వారిని వదిలిపెట్టకూడదన్నారు.

February 24, 2026 / 02:30 PM IST

పరీక్షా కేంద్రాలలో కలెక్టర్ తమీమ్ అన్సారియా తనిఖీ

GNTR: ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షల సందర్భంగా గుంటూరు ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలోని కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా మంగళవారం తనిఖీ చేశారు. విద్యార్థులు పరీక్ష రాస్తున్న తీరును ఆమె పరిశీలించారు. కేంద్రంలో తాగునీరు, వైద్య శిబిరాల వంటి కనీస వసతులను ఆరా తీశారు. పరీక్షల సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండాలని సూచించారు.

February 24, 2026 / 02:28 PM IST

జీవో నెంబర్ 77ను రద్దు చేయాలి: PDSU

ATP: గుంతకల్లు తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం PDSU విద్యార్థి సంఘం నాయకులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కార్యదర్శి వినోద్ మాట్లాడుతూ.. పీజీ విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవో 77ను వెంటనే రద్దు చేయాలని, ప్రభుత్వ యూనివర్సిటీలో 4200 పోస్టును భర్తీ చేయాలని, విద్యారంగానికి 30% నిధులను కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.

February 24, 2026 / 02:27 PM IST

రాచకిండంలో అగ్నిప్రమాదం

VZM: బొండపల్లి మండలంలోని రాచకిండంలో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన పాలవలస నూకాలు పూరిల్లు కాలిపోయింది. గ్యాస్ లీకేజ్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదం వలన సుమారు రూ.4 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. ప్రమాద విషయం తెలిసిన వెంటనే గజపతినగరం అగ్నిమాపకేంద్రం అధికారి రవి ప్రసాద్ సిబ్బందితో మంటలను అదుపు చేశారు.

February 24, 2026 / 02:20 PM IST

‘పీఏసీఎస్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి’

AKP: పీఏసీఎస్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్. రాము డిమాండ్ చేశారు. ఎలమంచిలి డీసీసీబీ బ్రాంచ్ వద్ద పీఏసీఎస్ ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమం 9వ రోజుకు చేరుకుంది. లాభనష్టాలతో సంబంధం లేకుండా జీవో 36ను వెంటనే అమలు చేయాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని సూచించారు.

February 24, 2026 / 02:18 PM IST