TG: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అమెరికాలో పర్యటనలో బిజీగా ఉన్నారు. నెవాడా, ఆరిజోనా పర్యటనలో భాగంగా హూవర్ డ్యామ్‌ను సందర్శించారు. లాస్ వెగాస్‌లో మైనింగ్ ఎగ్జిబిషన్‌లోని ఆధునిక యంత్ర పరికరాలను పరిశీలించారు. సంబంధిత కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించారు. కాగా, మరో వారం రోజుల పాటు అమెరికాలోనే భట్టి పర్యటించనున్నారు.