Jio Air Fiber: జియో ఎయిర్ ఫైబర్ అందించే ఆఫర్లు ఇవే..
5జీ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవలను జియో ఫైబర్ పేరిట రిలియన్స్ జియో తాజాగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ సేవలను హైదరాబాద్ సహా మొత్తం 8 నగరాల్లో ప్రారంభించింది. అతి తక్కువ ధరకే 14 ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌తో పాటు ఇంటర్నెట్ను అందిస్తుంది.
Jio Air Fiber: ఇకపై రిలాన్స్ 5జీ బ్రాడ్‌బ్యాండ్ సేవలు జియో ఎయిర్‌ఫైబర్(Jio Air Fiber) పేరిట అందుబాటులో ఉంటాయి. సెప్టెంబర్ 19న ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది రిలయన్స్ కంపెనీ. హైదరాబాద్(Hyderabad), అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీ, కోల్‌కతా, ముంబయి, పుణె.. ఈ 8 మెట్రో నగరాల్లో ఈ సేవలను ప్రారంభించింది. గత నెలలో జరిగిన రిలయన్స్ 46వ వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం)లో జియో ఎయిర్‌ఫైబర్(Jio Air Fiber) సేవలను తీసుకురానున్నట్లు కంపెనీ ఛైర్మన్ ముకేశ్ అంబానీ(Mukesh Ambani) ప్రకటించిన విషయం తెలిసిందే. జియో ఎయిర్‌ఫైబర్‌తో కోట్లాది కుటుంబాలు ప్రపంచస్థాయి డిజిటల్ వినోదం, బ్రాడ్‌బ్యాండ్, స్మార్ట్ హోమ్ సేవలను పొందుతాయని రిలయన్స్ జియో వెల్లడించింది. ఇప్పటికే జియోఫైబర్‌తో కోటి మందికి పైగా వినియోగదారులకు సేవలు అందిస్తున్నామని, ప్రతినెలా లక్షలాది మంది ఖాతాదారులు చేరుతున్నారని, జియో ఎయిర్‌ఫైబర్‌తో మరిన్ని గృహాలకు చేరువకానున్నట్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాశ్ అంబానీ వెల్లడించారు. 550కు పైగా డిజిటల్ టీవీ ఛానెళ్లు, 16కు పైగా ఓటీటీ యాప్‌లు, బ్రాడ్‌బ్యాండ్ సేవలు, స్మార్ట్‌హోమ్ సేవలు పొందొచ్చన్నారు. అయితే వీటి ఆఫర్ల వివరాలను చూస్తే…
జియో ఎయిర్ ఫైబర్ రూ. 599 కే 30 ఎంబీపీఎస్ తో 550 డిజిటల్ ఛానెళ్లు ప్లస్ 14 ఓటీటీ యాప్‌లు, రూ. 899 కి 100 ఎంబీపీఎస్ తో 550 డిజిటల్ ఛానెళ్లు ప్లస్ 14 ఓటీటీ యాప్‌లు, రూ. 1199 కే 100 ఎంబీపీఎస్ తో 550 డిజిటల్ ఛానెళ్లు ప్లస్ 14 ఓటీటీ యాప్‌లు అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, జియో సినిమా ప్రీమియమ్ లు అందుబాటులో ఉన్నాయి. జియో ఎయిర్ ఫైబర్ మ్యాక్స్ విషయానికి వస్తే.. రూ. 1499 కు 300 ఎంబీపీఎస్ తో 550 డిజిటల్ ఛానెళ్లు ప్లస్ 14 ఓటీటీ యాప్‌లు అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, జియో సినిమా ప్రీమియమ్ లు అందుబాటులో ఉన్నాయి. రూ. 2499 కు 500 ఎంబీపీఎస్ తో 550 డిజిటల్ ఛానెళ్లు ప్లస్ 14 ఓటీటీ యాప్‌లు అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, జియో సినిమా ప్రీమియమ్ అందుబాటులో ఉన్నాయి. రూ. 3999 కు 1జీబీ ఎంబీపీఎస్ తో 550 డిజిటల్ ఛానెళ్లు ప్లస్ 14 ఓటీటీ యాప్‌లు అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, జియో సినిమా ప్రీమియమ్ లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్ 6, 12 నెలలకు లభిస్తున్నాయి వీటితో పాటు జీఎస్టీ అదనంగా కట్టాల్సి ఉంటుంది.