»The Rs 2000 Jio Bharat K1 4g Phone Is Available On Amazon For Rs 999
Jio bharat: రూ.2 వేల జియో 4జీ ఫోన్ అమెజాన్‌లో రూ.999కే లభ్యం
మీరు చిన్న స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే మీరు కేవలం వెయ్యి రూపాయల్లోనే ఇంటర్నెట్ సౌకర్యమున్న అదిరిపోయే ఫోన్ తీసుకోవచ్చు. అంతేకాదు కెమెరా ఫీచర్లతోపాటు ఇంటర్నెట్ సౌకర్యమున్న ఈ ఫోన్ కేవలం రూ.999కే అమెజాన్‌లో లభ్యమవుతుంది. అయితే ఆ ఫోన్ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
The Rs 2000 Jio4g bharat phone is available on Amazon for Rs 999
రిలయన్స్ జియో(jio) సంస్థ నుంచి వచ్చిన అతి చౌకైన ఇంటర్నెట్ ఫోన్ ఇప్పటికే మార్కెట్లోకి వచ్చింది. ఈ జియో భారత్ బి1 మోడల్ ఫోన్ ను కంపెనీ జూన్ 2023లో రిలీజ్ చేసింది. అయితే దీని అసలు ధర రూ.1999 ఉండగా..ప్రస్తుతం అమెజాన్‌లో దీన్ని రూ. 999కే సేల్ చేస్తున్నారు. అంతేకాదు సరికొత్త భారత్ B1 వేరియంట్ సిరీస్‌లో భాగంగా దీనిని రిలీజ్ చేసినట్లు ప్రకటించారు. భవిష్యత్తులో ఇదే లైనప్‌లో మరిన్ని మోడల్‌లు వస్తాయని పేర్కొన్నారు. అయితే ఈ ఫోన్ ఫీచర్లు ఎంటో ఇప్పుడు చుద్దాం.
Jio Bharat B1 2.4 అంగుళాల QVGA డిస్ప్లేను కలిగి ఉంది. ఈ ఫీచర్ ఫోన్ Threadx RTOSతో లభిస్తుంది. 125mm x 52mm x 17mm పరిమాణంలో ఉంటుంది. ఇది 4G నెట్ వర్క్ సపోర్టుతో 0.05GB RAMతో వస్తుంది. మైక్రో SD కార్డ్ ద్వారా 128GB వరకు సపోర్ట్ కల్గి ఉంది. 2,000mAh బ్యాటరీతో ఇది గరిష్టంగా 343 గంటల వరకు స్టాండ్‌బై బ్యాటరీ లైఫ్ ను అందించనుంది. Jio Bharat B1లో వెనుక కెమెరా యూనిట్ కూడా ఉంది. ఇది 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌తో అమర్చబడింది. Jio తాజా ఫీచర్ ఫోన్లో భారతీయ ప్రాంతీయ భాషలతో సహా 23 భాషలకు సపోర్ట్ చేస్తుంది. చలనచిత్రాలు, టీవీ సిరీస్‌లు, క్రీడలు, సంగీతం, వినోదం కోసం JioCinema, JioSaavnతో ఇన్ బిల్ట్ యాప్స్ కూడా ఉన్నాయి. ఇక JioPayతోపాటు వినియోగదారులు UPI చెల్లింపులు కూడా చేసుకోవడానికి అనుమతిస్తుంది. అయితే ఈ ఫోన్ కేవలం Jio SIM కార్డ్‌తో మాత్రమే పని చేస్తుంది.