»Restrictions On Laptops Will Come Into Effect From November 1 Dgft Minister Rajeev Chandrasekhar
Electronics: ల్యాప్‌టాప్‌ల దిగుమతికి నవంబర్ 1 నుంచి ఆంక్షలు
ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, కంప్యూటర్ల దిగుమతులపై ఆంక్షలను సడలిస్తూ తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆక్టోబర్ 31 వరకు దిగుమతులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
restrictions on laptops will come into effect from November 1. DGFT, Minister Rajeev Chandrasekhar
Electronics: ల్యాప్‌టాప్‌లు(Laptops), ట్యాబ్లెట్ పీసీలు(Tablet PC), కొన్ని రకాల కంప్యూటర్ల దిగుమతులపై కేంద్రం ఆంక్షలు(Sanctions) విధించింది. తాజా నిర్ణయంలో మార్పుల చేస్తూ ఆక్టోబర్ 31 వరకు దిగుమతులపై ఎలాంటి ఆంక్షలు లేవని పేర్కొంది. అయితే నవంబరు 1 నుంచి నియమాలు అమల్లోకి వస్తాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) శుక్రవారం రాత్రి వెల్లడించింది. హెచ్ఎస్ఎన్ 8741 విభాగం కిందకు వచ్చే ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్ పీసీలు, కంప్యూటర్ల(computers) దిగుమతుల(imports)పై గురువారం కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఆ ఎలాక్ట్రానిక్ పరికరాల్లో లోపాలు ఉన్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంతే కాకుండా దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు(To encourage domestic manufacturing) గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. కేవలం లైసెన్స్ ఉన్న వారు మాత్రమే వీటిని దిగుమతి చేసుకోవాలని, మిగితా వారికి వీలుపడదని తక్షణం ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చాయని పేర్కొనడంతో పరిశ్రమ ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో వృత్తి వ్యాపారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఈ ఆంక్షలు అక్టోబరు 31 వరకు నిలిపేస్తున్నట్లు పేర్కంది. లైసెన్స్ లేకున్నా సరే నవంబర్ 1 వరకు దిగుమతులు చేసుకోవచ్చని, ఆ తరువాత అంటే నవంబరు 1 నుంచి ల్యాప్‌టాప్‌లు దిగుమతి చేసుకునేందుకు లైసెన్స్‌తో పాటు నూతనంగా కొన్ని షరతులు వర్తిస్తాయని DGFT వెల్లడించింది.
భారతదేశం గురువారం తీసుకున్న నిర్ణయంతో ప్రపంచ అగ్రగామి టెక్ కంపెనీలైన యాపిల్(Apple), శాంసంగ్ ఎలక్ట్రానిక్స్(Samsung Electronics), హెచ్‌పీ ల్యాప్‌టాప్‌లు(HP laptops), ట్యాబ్లెట్ పీసీలను తాత్కాలికంగా నిలిపివేశాయి. దీంతో కేంద్రం ఆంక్షలను నవంబర్ 1 నుంచి అమలులోకి వస్తాయిని తెలిపింది. అయితే మన దేశంలో దిగుమతి అవుతున్న ఈ పరికరాల్లో భద్రత లోపాలు ఉన్నట్లు దాని వలన కార్పొరేట్ డేటాకు ఇబ్బందులు రావొచ్చని అధికారులు భావిస్తున్నారు. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నట్లు, అది నిషేదం కాదని, లైసెన్సు పొందాక కంపెనీలు ఐటీ హార్డ్‌వేర్ పరికరాలను దిగుమతి చేసుకోవచ్చని ఎలక్ట్రానిక్స్, ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్ చేశారు. ఈ నిర్ణయం దేశియ తయారీ రంగానికి మద్దతుగా ఉంటుందని కూడా తెలిపారు. అయితే ఆయా పరికరాలు దిగుమతి చేసుకునేందుకు ఏడాది పాటు చెల్లుబాటు అయ్యేలా 5 నిమిషాల్లోనే లైసెన్సును ఇస్తున్నట్లు ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ పేర్కొంది. అయితే లైసెన్సు దరఖాస్తుకు సమయం ఇవ్వడంతో పాటు, నవంబరు 1 నుంచి నూతన ఆదేశాలు అమలులోకి వస్తాయని, ఇప్పటికే ఉన్న కంపెనీల కన్సైన్మెంట్లు లేదా షిప్మెంట్లకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఐటీ శాఖ వెల్లడించింది.