500 Rupee Note: బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి 22, 2024న శ్రీరాముడి చిత్రాలతో కూడిన రూ.500 నోట్ల కొత్త సిరీస్ను విడుదల చేయబోతోందా? అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం, శ్రీరాముడి చిత్రాలతో కూడిన రూ.500 నోటును ఆర్బీఐ విడుదల చేయనుందా? జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి ఆలయ కుంకుమార్చన జరగనుండగా, అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం, శ్రీరాముడి చిత్రాలతో పాటు రూ.500 నోటు ఫొటో సోషల్ మీడియాలో నిరంతరం వైరల్ అవుతోంది.
మహాత్మా గాంధీకి బదులుగా శ్రీరాముడి చిత్రం
అయోధ్యలోని శ్రీరాముడు, శ్రీరామ మందిరం చిత్రాలతో కూడిన రూ.500 నోటును సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం రూ.500 నోటుపై జాతిపిత మహాత్మాగాంధీ చిత్రం ఉండగా వైరల్ అవుతున్న రూ.500 నోటుపై శ్రీరాముడు ఫోటో ఉంది. ఎర్రకోట ఫోటో ఉన్న చోట అయోధ్యలో రామమందిరం నిర్మిస్తున్న ఫోటో ఉంది. శ్రీరాముడి ఫోటోతో కూడిన 500 రూపాయల నోటు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
RBI కొత్త సిరీస్ నోట్లను జారీ చేస్తుందా?
ఒక వైపు ఈ నోటు వైరల్ అవుతోంది.. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా శ్రీరాముడి చిత్రం ఉన్న కొత్త సిరీస్ రూ 500 నోట్లను విడుదల చేయడం గురించి ఎటువంటి సమాచారం వెలుగులోకి రాలేదు. శ్రీరాముడి చిత్రాలతో వైరల్ అవుతున్న రూ.500 నోటు నకిలీది. బ్యాంకింగ్ రంగ నిపుణుడు, వాయిస్ ఆఫ్ బ్యాంకింగ్ వ్యవస్థాపకుడు అశ్వనీ రాణా మాట్లాడుతూ.. కొత్త నోటుకు సంబంధించి ఆర్బిఐ ఎటువంటి సమాచారం ఇవ్వలేదని అన్నారు. ఇది ఫేక్ న్యూస్ అని అన్నారు. దీంతో ఆర్బీఐ కొత్త రూ.500 సిరీస్ నోట్లను ఆర్బీఐ విడుదల చేయడం లేదని తేలిపోయింది.