దేశీయ స్టాక్ మార్కెట్(indian stock market) సూచీలు గురువారం మంచి లాభాలతో ముగిశాయి. 30 షేర్ల బిఎస్‌ఈ సెన్సెక్స్ 555.95 పాయింట్లు లేదా 0.91 శాతం పెరిగి 61,749.25 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ కూడా 166 పాయింట్లు పెరిగింది.
PhonePe కొత్తగా UPI లైట్ ఫీచర్‌ను ప్రారంభించింది. ఇది PINని నమోదు చేయకుండా UPI లైట్ ఖాతా నుంచి ఒక్కసారి నొక్కడం ద్వారా రూ.200 కంటే తక్కువ విలువ కలిగిన చెల్లింపులను చేయడంలో సహాయపడుతుంది. పరికరంలోని ఖాతా బ్యాలెన్స్ నుంచి ఆ మొత్తం నేరుగా డెబిట్ చేయబడుతుంది. దీంతోపాటు ఈ ఫీచర్ వేగవంతంగా పూర్తవుతుంది.
ఇండియన్ అమెరికన్(indian american), మాజీ మాస్టర్ కార్డ్ CEO అజయ్ బంగా(Ajay Banga) కీలక పదవీ దక్కించుకున్నారు. ప్రపంచ బ్యాంక్ తదుపరి అధ్యక్షుడి(world bank president)గా అతను నియమితుడయ్యాడు. ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఈ మేరకు ప్రకటించారు.
ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ నుంచి గుడ్ న్యూస్ వచ్చేసింది. రిటైర్మెంట్ ఫండ్ బాడీ EPFO అధిక పెన్షన్ కోసం దరఖాస్తులను దాఖలు చేయడానికి జూన్ 26, 2023 వరకు తేదీని పొడిగించింది.
దేశంలో గో ఫస్ట్(go first l) విమాన ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే మే 3, 4 తేదీల్లో తక్కువ ధరలో సేవలందించే క్యారియర్ గో ఫస్ట్ ఫ్లైట్స్ సేవలు నిలిపివేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. తీవ్రమైన నిధల కొరత కారణంగా రాబోయే రెండు రోజుల పాటు ఈ విమాన సేవల రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఈ కంపెనీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ముందు స్వచ్ఛంద దివాలా పరిష్కార ప్రక్రియ కోసం దరఖాస్తును కూడా [&...
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఇండియాలో కార్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. దాదాపు అన్ని కంపెనీ కార్ల అమ్మకాల్లో గ్రోత్ నమోదైంది. ఏ కంపెనీ వాహనాలకు అత్యధిక డిమాండ్ ఉందో నరతెరపైకి వచ్చింది. అలాగే ఏప్రిల్ నెలలో ఏ కంపెనీ ఎన్ని కార్లను విక్రయించింది దీనితో పాటు, ఈ సంవత్సరం వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కూడా సమాచారం వెల్లడైంది.
ఏప్రిల్ నెలలో 20వ తేది ఒక్కరోజే రూ.68,228 కోట్ల జీఎస్టీ వసూలైనట్లు(GST Collections) ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక్కరోజులో జీఎస్టీ వసూళ్లలో ఇదే అత్యధికమని పేర్కొంది.
ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో యూపీఐ పేమెంట్స్(UPI Payments) వసూలు అయ్యాయి. గత నెలలో 890 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఆ లావాదేవీల విలువ రూ.14.07 లక్షల కోట్లు కావడం గమనార్హం. మార్చి నెలతో పోలిస్తే విలువలోనూ, లావాదేవీల పరిమాణంలోనూ స్వల్పంగా వృద్ధిరేటు నమోదైనట్లు తెలుస్తోంది.
ఆదాయపు పన్ను చెల్లించే వారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. సమయానికి ఫైలింగ్స్ చేయని సందర్భంలో భారీ పెనాల్టీలు చెల్లించాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్నుకు సంబంధించి గడువును చాలా సార్లు పొడగించుకుంది.
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (amazon) ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లతో ముందుకొస్తోంది. తాజాగా గ్రేట్ సమ్మర్ సేల్ (Great summer sale) కు సిద్ధమైంది. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మే 4వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలు కానుంది.
ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు పెరిగిపోయాయి. ఏ మాత్రం అవకాశం దొరికినా ప్రజలను నిండాముంచుతున్నారు. ఆకర్షణీయమైన ఆఫర్ల పేర్లతో లింకులను పంపి వాటిని ఓపెన్ చేయగానే సదరు వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని, వాళ్ల బ్యాంకుల్లో సొమ్ములను కాజేస్తున్నారు.
మీరు కొత్తగా బైక్ కొనుగోలు చేయానలి ప్లాన్ చేస్తున్నారా? అది కూడా ఎలక్ట్రిక్ బైక్ (Electric bike) కోసం చూస్తున్నారా? అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే.రూ.20 ఖర్చుతో 135 కి.మి వెళ్లొచ్చు. మతిపోగొడుతున్న ఎలక్ట్రిక్ బైక్