దేశీయ స్టాక్ మార్కెట్లు వారంతంలో(friday) భారీ నష్టాల(heavy losses)తో కొనసాగుతున్నాయి. ఒక దశలో బీఎస్ఈ(BSE) సెన్సెక్స్ 700 పాయింట్లు కోల్పోగా, ఎన్ఎస్ఈ(NSE) నిప్టీ 202కిపైగా పాయింట్లను నష్టపోయింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ(BANK NIFTY) సూచీ ఒక సమయంలో ఏకంగా 810 పాయింట్లను కోల్పోయింది.
Car Discounts: కొత్త కార్లు కొనుక్కోవాలని అనుకునేవారికి ఇదే మంచి సమయం. ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ తన ఫేమస్ కార్లపై పెద్ద ఎత్తున డిస్కౌంట్లు ప్రకటించింది. మారుతి సుజుకి ఇండియా అరేనా షోరూమ్‌లలో అందుబాటులో ఉన్న ఆల్టో, ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో, వ్యాగనార్, సెలెరియో, స్విఫ్ట్, డిజైర్ కార్లపై మార్చి నెలలో భారీ డిస్కౌంట్లు ఇచ్చింది.
తెల్లవారుజామున మా సేవలకు అంతరాయం ఏర్పడిందనే ఫిర్యాదులు వచ్చాయి. సాంకేతిక కారణాలతో ఆ సమస్య వచ్చింది. వీలైనంత త్వరగా అందరి సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం. సేవల అంతరాయానికి చింతిస్తున్నాం’ అని ఇన్ స్టాగ్రామ్ పీఆర్ టీమ్ ప్రకటించింది.
OYO రూమ్స్ స్టార్టప్ వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ వివాహ రిసేప్షన్ వేడుక మంగళవారం న్యూఢిల్లీలో ఘనంగా జరిగింది. అయితే ఈ వేడుకలో ప్రముఖ బిలియనీర్, ఇన్వెస్టర్ సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ వ్యవస్థాపకుడు మసయోషి సన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రితేష్, అతని భార్య మసయోషి పాదాలను తాకి ఆశీర్వదించాలని కోరారు. ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి.
భారత్ మళ్లీ హిందూ వృద్ధి రేటుకు చేరువ అవుతోందన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (reserve bank of india) మాజీ గవర్నర్ రఘురాం రాజన్ (Raghuram Rajan) వ్యాఖ్యలను ఎస్బీఐ రీసెర్చ్ (SBI Research) ఖండించింది. జీడీపీ, పొదుపు, పెట్టుబడుల గణాంకాలు ఆధారంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పు అని, పక్షపాతంతో చేసినట్లుగా కనిపిస్తోందని పేర్కొన్నది. ఆయన ఆందోళన వ్యక్తం చేసినంత తీవ్రంగా జీడీపీ వృద్ధి రేటు గణాంకాలు లేవని ఎస్బీ...
ఆపిల్ ఐఫోన్ ఈసారి సరికొత్తగా ఎల్లో కలర్లో వచ్చేస్తుంది. ఐఫోన్ 14(iPhone 14), 14 ప్లస్(iPhone 14 Plus) వేరియంట్లు మార్చి 14 నుంచి భారతదేశంలో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ఫీచర్లు ఎంటో ఇప్పుడు చుద్దాం.
Meta layoffs:కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. కంపెనీలు స్మార్ట్‌గా ఆలోచిస్తున్నాయి. తమ ఖర్చులు తగ్గించుకునే పనిలో ఉన్నాయి. అందుకే ఉద్యోగాలకు కోత పెడుతున్నాయి. ఒక కంపెనీ చూసి.. మరో కంపెనీ ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ చేపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే 12 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించిన ‘మెటా’ (meta) మరికొందరినీ పంపించే పనిలో ఉంది.
మనం రోజూ ఉపయోగించే పెన్ను(Pen) ధర పదో పాతికో ఉంటుంది. కొన్ని ప్రత్యేక కార్యక్రమాలప్పుడు గిఫ్ట్ గా పెన్ను ఇవ్వాలనుకుంటే వందో రెండొందలో పెట్టి పెన్నును కొనుగోలు చేస్తాం. కానీ ఇక్కడ మాత్రం ఓ పెన్ను(Pen) ధర ఏకంగా రూ.22.47 లక్షలు. ఇది విన్నాక మీరు అవాక్కయ్యారు కదా. వినేందుకు విడ్డూరంగా ఉన్నా ఇదే నిజమండి. అక్షరాల ఆ పెన్ను(Pen) ధర రూ.22 లక్షలపైనే.
పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షల కారణంగా రష్యాలో నగదు నిల్వలు తగ్గుతున్నాయని అక్కడి ఇంధన లోహ రంగ వ్యాపారవేత్త రష్యా ఒలిగార్చ్ ఒలేగ్ డెరిపాస్కా తెలిపారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది నాటికి “స్నేహపూర్వక” దేశాల నుంచి పెట్టుబడులు రాకపోతే నగదు నిల్వలు సున్నా స్థాయికి చేరుకుంటాని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్(ap) రాష్ట్రానికి పెట్టుబడల వెల్లువ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి 13 లక్షల కోట్ల రూపాయలు వస్తున్నాయని ఏపీ సీఎం జగన్(cm jagan) తెలిపారు. ఈ క్రమంలో తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) ఏపీకి 20 వేల కోట్ల రూపాయలు ప్రకటించారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం వారంతంలో(friday) భారీ లాభాలతో (heavy losses)తో కొనసాగుతున్నాయి. మరోవైపు అదానీ గ్రూప్ సంస్థల షేర్లు సైతం వృద్ధి బాటలోనే ఉన్నాయి. ఈ క్రమంలో ఒక దశలో బీఎస్ఈ(BSE) సెన్సెక్స్ 810 పాయింట్లను తాకగా, ఎన్ఎస్ఈ(NSE) నిప్టీలో 230కిపైగా పాయింట్లు పెరిగాయి. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ(BANK NIFTY) సూచీ ఒక సమయంలో ఏకంగా 830 పాయింట్లు వృద్ధి చెందింది.
నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT) గురువారం రిలయన్స్ క్యాపిటల్ రుణదాతలు దాఖలు చేసిన పిటీషన్‌ను మరోసారి అనుమతి ఇచ్చింది.
దేశంలో ప్రస్తుతం ఎక్కువ బ్యాంకులు వారానికి (Bank working days) ఐదు నుండి ఆరు రోజులు పని చేస్తున్నాయి. రెండో, నాలుగో శనివారాలు ఉన్న రోజుల్లో ఐదు రోజులు, మిగతా రెండు వారాల్లో ఆరు రోజులు పని చేస్తాయి. అయితే త్వరలో కొత్త విధానం అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పెట్టుబడుల (Investments) సమీకరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Government of Andhra Pradesh) రేపటి నుండి (మార్చి 3, 4 తేదీలు) విశాఖపట్నం (Visakhapatnam)లో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ (Global Investors Summit) నేపథ్యంలో తెలంగాణ (Telangana) మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (IT Minister) తోటి తెలుగు రాష్ట్రానికి శుభాకాంక్షలు తెలిపారు.
గత ఏడాది డిసెంబర్‌లో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా ఎలాన్ మస్క్ తన స్థానాన్ని కోల్పోయి..తాజాగా మళ్లీ నంబర్ వన్ స్థానానికి వచ్చారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా స్టాక్స్ 100% పెరిగిన నేపథ్యంలో 187 బిలియన్ డాలర్ల నికర సంపదతో ఎలాన్ మస్క్ తిరిగి ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచాడని నివేదికలు చెబుతున్నారు.