లేఆఫ్‌ల బాటలో తాజాగా ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ కూడా చేరింది. ఈ క్రమంలో దేశంలోని గూగుల్ సంస్థలో పనిచేస్తున్న 453 మందిని గురువారం అర్థరాత్రి నుంచి తొలగించినట్లు తెలిసింది. తొలగించబడిన Google ఉద్యోగులకు అధికారిక మెయిల్‌లో CEO సుందర్ పిచాయ్ నుంచి సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం పెద్ద ఎత్తున నష్టాలతో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న ప్రతికూల ధోరణుల దృష్యా దేశీయ మార్కెట్లు కూడా దిగువకు పయనిస్తున్నాయి. దీంతో ఒక దశలో బీఎస్ఈ(BSE) సెన్సెక్స్ 400, ఎన్ఎస్ఈ(NSE) నిప్టీ 120కిపైగా, బ్యాంక్ నిఫ్టీ 710 పాయింట్లు కోల్పోయాయి.
ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI) అధిక రిటర్న్స్ అందించే సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ (Investment Scheme) అమృత్ కలష్ డిపాజిట్ పథకాన్ని (Amrit Kalash Deposit) లాంచ్ చేసింది.
వీడియో స్ట్రీమింగ్ సంస్థ యూట్యూబ్ (YouTube)కు ఇండియన్ అమెరికన్ నీల్ మోహన్ (Neal Mohan) సీఈవోగా నియమించబడ్డారు. ఈ సోషల్ మీడియా దిగ్గజానికి సూసన్ వొజిసికి (Susan Wojcicki) సుదీర్ఘకాలం అంటే తొమ్మిదేళ్ల పాటు సీఈవోగా పని చేశారు. ఇప్పుడు ఆమె వైదొలగడంతో నీల్ మోహన్‌ను నియమించింది.
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్‌ను(ITR Returns) ఏప్రిల్ 1వ తేదీ నుండి సమర్పించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (Central Board of Direct Taxes-CBDT) తెలిపింది.
అదానీ గ్రూప్ సంస్థపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ సంస్థపై దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్, సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పూరీ బుచ్‌లకు రెండు వేర్వేరుగా లేఖలు రాస్తూ డిమాండ్ చేశారు.
ప్రముఖ ఫుడ్ డెలివరీ(Food delivery App) టెక్ కంపెనీ అయిన జొమాటో(Zomato) షాకింగ్ విషయం చెప్పింది. తమ సంస్థ తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నట్లు జొమాటో(Zomato) తెలిపింది. ఈ నష్టాల వల్ల దేశంలోని 225 చిన్న నగరాల్లో తన సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది.
మూడీస్ మరో షాక్ ఇచ్చింది.. అదానీకి. ఈ గ్రూప్ లోని నాలుగు కంపెనీలకు నెగెటివ్ రేటింగ్ ఇచ్చింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ గ్రీన్ ఎనర్జీ రెస్త్రిక్టెడ్ గ్రూప్ 1, అదానీ ట్రాన్స్ మిషన్ స్టెప్ వన్, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్.. ఈ నాలుగు కంపెనీల రేటింగ్ ను స్థిరత్వం నుండి నెగెటివ్ కు మార్చింది
దేశంలోనే అత్యంత ఖరీదైన పెంట్ హౌస్ ను ముంబయి వర్లీలోని త్రీ సిక్స్టీ వెస్ట్‌లో వ్యాపార వేత్త వెల్స్పన్ గ్రూప్ అధినేత B K గోయెంకా 240 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు
పేటీఎం పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్… నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ భాగస్వామ్యంతో యూపీఐ ఆధారిత రూపే క్రెడిట్ కార్డును విడుదల చేసింది. కార్డు వెంట తీసుకు రావాల్సిన అవసరం లేకుండా క్యూఆర్ కోడ్, యూపీఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చునని తెలిపింది. యూపీఐ ఐడీకి రూపే క్రెడిట్ కార్డును లింక్ చేసుకుంటే సరిపోతుందని వెల్లడించింది. రూపే క్రెడిట్ కార్డుతో యూపీఐపై చెల్లింపుల సౌలభ్యం ఉంటుందని తెలిపింది. రూపే క్ర...
ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భాగంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఆర్థిక నిపుణులు ముందుగా ఊహించినట్లుగానే వడ్డీ రేట్ల పెంపుదలకే గవర్నర్ మొగ్గు చూపారు. ఈ క్రమంలో ఆరోసారి రెపోరేటు 25 బేసిస్ పాయింట్ల మేర పెంచారు. దీంతో రేపో రేటు 6.50కు చేరుకుంది. చివరిగా గత ఏడాది డిసెంబర్లో ద్రవ్యపరపతి విధాన సమీక్ష జరుగగా ఆ సమయంలో 35 బేసిస్ పాయింట్లు పెంచారు. ద్రవ్యోల్బణం కట్టడి...
ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. గూగుల్ నుంచి మొదలుకొని చిన్న కంపెనీల వరకు కాస్ట్ కటింగ్ బాట పట్టాయి. ఆర్థిక మాంద్యం, మార్కెట్ ప్రభావం నేపథ్యంలో తొలగిస్తున్నాయి. రోజు ఓ కంపెనీ తమ ఉద్యోగులను తొలగించి ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. తాజాగా అమెరికన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కంపెనీ జూమ్ కాస్ట్ కట్ చేసింది. తమ కంపెనీలో 15 శాతం ఉద్యోగులను తొలగించింది. మొత్తం 1,300 మంది ఉద్యోగులను ఇ...
కోవిషీల్డ్ టీకా(covishield vaccine) తీసుకున్న వారికి హార్ట్ ఎటాక్(heart attack) వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ప్రముఖ ప్రముఖ బ్రిటిష్-ఇండియన్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అసీమ్ మల్హోత్రా(aseem malhotra) తెలిపారు. బ్రిటన్లో ఈ టీకా వేసుకున్న వారిలో దాదాపు 10 శాతం మందికి ఇదే పరిస్థితి తలెత్తినట్లు చెప్పారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గుండెపోటుతోపాటు పక్షవాతం, రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు చిన్న,...
ఇప్పుడు అంతా డిజిటల్ ట్రాన్సాక్షన్స్.. పెద్ద నోట్లు రద్దు తర్వాత దేశంలో డిజిటల్ చెల్లింపులు భారీగా పెరిగాయి. యూపీఐ ద్వారా టీ స్టాల్, టిఫిన్ సెంటర్, చికెన్ సెంటర్.. ఒక్కటేమిటి అన్నీ చోట్ల స్కాన్ చేసి చెల్లింపులు చేస్తున్నారు. డిజిటల్ చెల్లింపుల్లో ఫోన్ పేను ఎక్కువ ఉపయోగిస్తున్నారు. తన సేవలను ఫోన్ పే మరింత విస్తరించింది. విదేశాల్లో కూడా అందుబాటులోకి తీసుకొంది. యూఏఈ, సింగపూర్, మారిషస్, నేపాల్, భూట...
తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద సిటీ అయిన వరంగల్లో ఐటీ కంపెనీలు క్రమంగా పెరుగుతున్నాయి. ఓరుగల్లులో ఇప్పటికే మూడుకుపైగా ప్రముఖ ఐటీ కంపెనీలు తమ సంస్థలను ఏర్పాటు చేశాయి. తాజాగా మరో సంస్థ అయిన ఎల్టీఐ మైం డ్ ట్రీ(LTI mindtree) ఈ నెలాఖరు నాటికి తమ డెలివరీ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ క్రమంలో హైదరాబాద్లో మంత్రి ...