Sensex: బూమ్..556 పాయింట్లు వృద్ధి..18 వేల ఎగువన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్(indian stock market) సూచీలు గురువారం మంచి లాభాలతో ముగిశాయి. 30 షేర్ల బిఎస్ఈ సెన్సెక్స్ 555.95 పాయింట్లు లేదా 0.91 శాతం పెరిగి 61,749.25 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ కూడా 166 పాయింట్లు పెరిగింది.
Stock market in huge gains Sensex 872 points plus december 14th 2023
దేశీయ ఈక్విటీ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో పూర్తయ్యాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో నిఫ్టీ(nifty) 18,066.70 వద్ద రోజు కనిష్ట స్థాయిని తాకిన తర్వాత 18,250 మార్కుకు చేరి ఎగువన స్థిరపడింది. నిఫ్టీ ఎఫ్ఎంసిజి ఇండెక్స్ మినహా, ఎన్ఎస్ఇ(NSE)లోని అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. NSEలో వారం వారీ ఇండెక్స్ ఎంపికల గడువు ముగియడంతో ట్రేడింగ్ అస్థిరంగా కొనసాగింది.
ఈ క్రమంలో BSE సెన్సెక్స్ 555.95 పాయింట్లు లేదా 0.91% వృద్ధి చెంది 61,749.25 పాయింట్లకు చేరుకుంది. మరోవైపు నిఫ్టీ 50 ఇండెక్స్ 165.95 పాయింట్లు లేదా 0.92% పెరిగి 18,255.80 వద్ద స్థిరపడింది. ఈ నేపథ్యంలో మార్కెట్లో BSE మిడ్-క్యాప్ ఇండెక్స్ 0.82% పురోగమించగా, BSE స్మాల్-క్యాప్ ఇండెక్స్ 0.83% లాభపడింది.
ఇదే క్రమంలో బీఎస్ఈలో 2,246 షేర్లు లాభపడగా.. 1,275 షేర్లు నష్టపోయాయి. మరో 119 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. NSE నిఫ్టీ 165.95 పాయింట్లు లేదా 0.92 శాతం ర్యాలీ చేసి 18,255.80 వద్ద ముగిసింది. 2023లో 18,200 కంటే ఎగువన ఇది రెండో ముగింపు. జనవరి 3న బెంచ్‌మార్క్ ఇండెక్స్ 18,232.55 వద్ద పూర్తైంది.
అయితే యుఎస్ ఫెడరల్ రిజర్వ్(us federal reserve) బ్యాంక్ ఊహించిన విధంగా 25 బేసిస్ పాయింట్లు రేట్లు పెంచిన నేపథ్యంలో ఆసియా స్టాక్స్ మిశ్రమంగా ముగిశాయి. మరోవైపు యూరప్‌లో షేర్లు మాత్రం పతనమయ్యాయి. ఇక జపాన్‌లో స్టాక్ మార్కెట్లు గురువారం సెలవు దినంగా ప్రకటించాయి.
ఈ నేపథ్యంలో బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, ఏషియన్ పెయింట్స్, ఎస్బిఐ, టిసిఎస్, ఎయిర్టెల్ కంపెనీల స్టాక్స్(stocks) అత్యధికంగా లాభపడ్డాయి. మరోవైపు ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా, పవర్ గ్రిడ్, ఐటీసీ, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, విప్రోల షేర్లు పెద్ద ఎత్తున నష్టపోయాయి.