పెట్రోల్(Petrol), డీజీల్ ధరలపై ప్రైవేటు రంగానికి చెందిన చమురు సంస్థ నయాగారా (Niagara) ఎనర్జీ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వరంగ చమురు సంస్థల కంటే రూ.1 తక్కువ ధరకే చమురును విక్రయించనున్నట్లు తెలిపింది. నయారా కంటే ముందు రిలయన్స్ (Reliance) – బీపీ సుపీరియర్ గ్రేడ్ క్వాలిటీ డీజిల్ ను రూ.1 తక్కువకే విక్రయించనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో నయారా నుండి కూడా ఇలాంటి స్వల్ప ఊరట ప్రకటన వచ్చింది. ప్రభుత్వరంగ సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ కంపెనీలు గత కొద్ది కాలంగా ధరలను స్థిరంగా కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వరంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) కంపెనీలు గత కొన్నాళ్లుగా పెట్రోల్, డీజిల్ రేట్లను స్థిరంగా ఉంచుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ (Ukraine) యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినా ఆయా సంస్థలు రేట్లను సవరించలేదు. ప్రస్తుతం రేట్లు దిగివచ్చినప్పటికీ.. అప్పటి నష్టాలను భర్తీ చేసుకుంటున్నాయి. సుపీరియర్ (Superior) క్వాలిటీని రూ.1 తక్కువకు విక్రయిస్తామని రిలయన్స్ – బీపీ ప్రకటించగా, ఇప్పుడు నయారా పెట్రోల్, డీజిల్ పైన కూడా తగ్గించనున్నట్లు ప్రకటించింది.