బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. గత కొన్ని రోజులుగా పెరిగిన పసిడి ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఆదివారం (జూన్ 4) ఉదయం పసిడి ఏకంగా 770 రూపాయలు తగ్గింది. దీంతోపాటు వెండి రేటు కూడా పడిపోయింది.
పాకిస్తాన్‌లో ప్రస్తుతం విదేశీ మారక ద్రవ్య నిలువలు నిండుకుంటున్నాయి. ఇప్పుడు ఆ దేశం కడు పేదరికాన్ని ఎదురుకుంటుంది. విదేశీ మారకద్రవ్య నిల్వలు పడిపోతున్నా వాటిని కాపాడే నాథుడు లేడు.
TRAI:టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) టెలికాం కంపెనీ(telecom company)లను 2 నెలల్లోపు డిజిటల్ ప్లాట్‌ఫారమ్(Digital platform)ను అభివృద్ధి చేయాలని ఆదేశించింది. తద్వారా అవాంఛిత కాల్స్, ఎస్‌ఎంఎస్(SMS)లను అడ్డుకోవాలని సూచించింది.
సామాన్యులకు శుభవార్త. దేశంలో త్వరలో వంటనూనెల(cooking oils) ధరలు తగ్గనున్నాయి. ఈ మేరకు వంటనూనె పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం(central government) సూచించింది. అంతర్జాతీయంగా వంటనూనె ధరలు తగ్గిన నేపథ్యంలో వంటనూనె ధర లీటరుకు రూ.8 నుంచి రూ.12 తగ్గనున్నట్లు సమాచారం.
Pebble Cosmos Smart Watchలో ఎన్నో ముఖ్యమైన ఫీచర్స్ ఉన్నాయి. గుండె పనితీరు, రుతు చక్రం, వాచ్ నుంచే ఫోన్ చేసుకునే వెసులుబాటు లాంటి చాలా ఫీచర్లు ఉన్నాయి. వాచ్‌ని సాధారణ వినియోగంతో ఏడు రోజుల వరకు వాడవచ్చని పేర్కొన్నారు. ఈ వాచ్ ఫీచర్లు ఇంకా ఎలా ఉన్నాయో ఓసారి ఇక్కడ చూసేయండి మరి
ఇండియన్ పోస్ట్ తమ ఖాతాదారుల కోసం కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. కొత్తగా రూపొందించిన ఈ కేవైసీ రూల్స్ వల్ల ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టేవారికి తీవ్ర ఇబ్బందులు తలెత్తవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈరోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల జోరు పెరిగిపోయింది. ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వాహనాలే కనిపిస్తున్నాయి. మార్కెట్లోకి కూడా కొత్త రకం ఎలక్ట్రిక్ వాహనాలు సందడి చేస్తున్నాయి. ఇప్పటి వరకు మనకు కార్లు, స్కూటర్లు మాత్రమే తెలుసు. తాజాగా ఎలక్ట్రిక్ త్రీవీలర్ వాహనం కూడా అడుగుపెట్టింది.
టాలీవుడ్ హీరోలు.. కేవలం హీరోలుగా మాత్రమే కాదు బిజినెస్ పరంగాను దూసుకుపోతున్నారు. దేశ విదేశాల్లో భారీ పెట్టుబడులు పెడుతున్నారు. అలాగే కమర్షియల్‌గా రెండో చేత్తో గట్టిగానే వెనకేసుకుంటున్నారు. అల్లు అర్జున్ కూడా రేసుగుర్రంలా పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటుతున్నాడు. ఇక ఇప్పుడు మల్టీప్లెక్స్ నిర్మాణంలోను అడుగు పెట్టాడు. ఆ మల్టీ ప్లెక్స్‌ను ప్రభాస్ కొత్త సినిమాతో లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
హైదరాబాద్ నగరానికి చెందిన మహిమ 75 ఏళ్ల చరిత్ర గల హైదరాబాద్ ఫార్మా దిగ్గజం బయోలాజికల్ ఇ లిమిటెడ్‌కు ప్రమోటర్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. 2022లో రూ.7700 కోట్లుగా ఉన్న మహిమా దాట్ల ఆస్తుల విలువ ఇప్పటి వరకూ రూ.8700 కోట్లకు చేరుకుంది.
ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ AJIO జూన్ 1, 2023 నుంచి ప్రారంభం కానున్న తన 'బిగ్ బోల్డ్ సేల్'ని ప్రకటించింది. ఈ మెగా సేల్ కోసం వినియోగదారులకు ముందస్తు యాక్సెస్ ఇవ్వబడుతుందని పేర్కొన్నారు.