భారత్ లో అత్యధికంగా అమ్ముడు పోయే ద్విచక్రవాహనాల్లో షైన్ ఒకటి . హోండా బైక్స్ (Honda bikes) లో అత్యంత విజయవంతమైన మోడల్ షైన్. 2006లో ఈ మోటార్ సైకిల్ లాంచ్ అయినప్పటినుంచి వాహన ప్రియుల మనస్సు దోచింది. తాజాగా హోండా తన షైన్ (Shine) ను అప్ డేట్ చేసి నూతన వెర్షన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ నయా షైన్ 125 బీఎస్-6 స్టేజ్ 2 ప్రమాణాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంది. తాజా షైన్ బైక్ లో డ్రమ్ బ్రేక్(Drum brake), డిస్క్ బ్రేక్ వేరియంట్ ఉన్నాయి. ఈ రెండు వేరియంట్ల ధర మధ్య రూ.4 వేల తెడా ఉంది. ఇందులో సింగిల్ సిలిండర్(Single cylinder), ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ సహితమైన ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అమర్చారు.
ఎన్ హాన్స్ డ్ స్మార్ట్ పవర్ (ఈఎస్ సీ), ఏసీజీ స్టార్టర్ కూడా పొందుపరిచారు. 5 స్పీడ్ గేర్ బాక్స్(5 speed gear box), ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, రియర్ సైడ్ 5 స్టేజ్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ సస్పెన్షన్ ఇచ్చారు. కంటైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్(Contained braking) system, ట్యూబ్ లెస్ టైర్లు, హైబీమ్ ఫ్లాషర్, అదనంగా హెడ్ లైట్ కౌల్, సైడ్ ప్యానెల్ ఏర్పాటు చేశారు. ఈ కొత్త హోండా షైన్ 5 రంగుల్లో లభ్యం కానుంది. బండిని అప్ డేట్ చేసినప్పటికీ డిజైన్ ప్యాట్రన్ (Design Pattern) లో ఎలాంటి మార్పులు చేయలేదు. ధర విషయానికొస్తే డ్రమ్ బ్రేక్ వేరియంట్ రూ.79,800… డిస్క్ బ్రేక్ (Disc brake) వేరియంట్ రూ.83,800గా పేర్కొన్నారు. ఇవి ఎక్స్ షోరూం ధరలు. ఇటీవల హోండా తన బైక్, స్కూటర్ల మోడళ్లను వరుసగా అప్ డేట్ చేసుకుంటూ వస్తోంది. ఇటీవలే యూనికార్న్(Unicorn), డియోలను మరింత కొత్తగా ముస్తాబు చేసి మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ కోవలోనే షైన్ ను కూడా ఆధునికీకరించింది.