త్వరలో పోస్టాఫీసు మీ ఇంటికి పప్పులు, బియ్యంతో పాటు పిండి లేదా ఎలక్ట్రానిక్ వస్తువులను డెలివరీ చేస్తుంది. ఇందుకోసం ఓఎన్‌సీడీ (Open Network For Digital Commerce) తో త్వరలో ఒప్పందం కుదుర్చుకోనుంది. ట్రేడర్స్ అసోసియేషన్ క్యాట్‌తో తపాలా శాఖ ఎంఓయూ కుదుర్చుకుంది.
ఇప్పటి వరకు మనం వాడే బైకులన్నీ పెట్రోల్ సాయంతోనే నడుస్తాయి. ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ బైక్ ల వాడకం విపరీతంగా పెరిగింది. ఇలా పెట్రోల్, కరెంటుతో అమెరికాకు చెందిన ఓ వ్యక్తి కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు.
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ టూ వీలర్ సింపుల్ వన్(Simple One Electric Scooter) మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమైంది. మే 23న అధికారికంగా కస్టమర్లకు అందించనున్నారు. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 236 కిలోమీటర్లు తిరుగుతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇక రోడ్లపైకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి.
ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) భారత్‌పే మాజీ మేనేజింగ్ డైరెక్టర్ అష్నీర్ గ్రోవర్(Ashneer Grover)పై 81 కోట్ల రూపాయల మోసానికి సంబంధించి ఎఫ్‌ఐఆర్(FIR) నమోదు చేసింది. భారత్‌పే సంస్థ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో అతని భార్య మాధురీ జైన్ గ్రోవర్, ముగ్గురు బంధువులు కూడా ఉన్నారు.
భారతీయ రైల్వేల ద్వారా ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణిస్తున్నారు. ఇది సురక్షితమైన, చౌకైన ప్రయాణ మార్గంగా పరిగణించబడుతుంది. కానీ, రైలులో ప్రయాణించే విషయంలో చాలా రకాల నియమాలు ఉన్నాయి. ప్లాట్‌ఫారమ్‌పై రైలు కోసం వేచి ఉండే సమయంలో రైల్వే నియమాలు పాటించాలి లేకుంటే భారీ జరిమానా చెల్లించుకోవాల్సి ఉంటుంది.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) కంపెనీ దేశంలోని సామాన్యుల దగ్గరనుంచి సంపన్నుల వరకు వారి అవసరాలకు అనుగుణంగా పాలసీలను రూపొందిస్తుంది. బ్యాంకుల తర్వాత ప్రజల్లో నమ్మకం కలిగిన బీమా కంపెనీ ఎల్ ఐసీ. తాజాగా ఖాతాదారుల కోసం నూతన పథకాన్ని తీసుకొచ్చింది.
బెంగళూరు నగరంలో ఐఫోన్ మ్యాన్ ఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టనున్నారా? అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదు. ఐఫోన్ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ బెంగళూరు శివార్లలో భారీ భూమిని కొనుగోలు చేసింది. దాదాపు 300 ఎకరాల భూమిని కొనుగోలు చేయడం గమనార్హం. ఈ విషయాన్ని లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు తెలియజేసింది.
మీరు తక్కువ బడ్జెట్లో మంచి 5జీ ఫోన్ కొనాలని చుస్తున్నారా? అయితే ఈ వార్తను మీరు చదవాల్సిందే. ఎందుకంటే 20 వేల రూపాయల లోపు మంచి ఫీచర్లు ఉన్న టాప్ 8 స్మార్ట్ ఫోన్లను ఇక్కడ అందిస్తున్నాం. వీటి గురించి ఓసారి తెలుసుకోండి మరి.
స్మార్ట్ ఫోన్(Smart Phone) వినియోగదారులకు శుభవార్త. ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ (Bharti Airtel) తన యూజర్ల(Users) కోసం ఫ్రీ 5జీ అపరిమిత డేటా(Unlimited Data)ఆఫర్‌ను ప్రకటించింది.
boAt బ్లాటూత్ Airdopes 141(Boat Bluetooth 141 Earbuds) బంపర్ ఆఫర్ ధరకు లభిస్తున్నాయి. కేవలం వెయ్యి రూపాయలకు అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలను ఇప్పుడు చుద్దాం.
తెలంగాణ(Telangana)లో సరిపడ కరెంటు, నీళ్లు, భూములు ఉన్నాయని, పరిశ్రమలు పెట్టుకోవడానికి సరైన ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నట్లు మంత్రి కేటీఆర్(KTR) తెలిపారు. అమరరాజా యూనిట్ రావడం వల్ల ఇక్కడ ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని, దీని వల్ల చుట్టుపక్కల ప్రాంతాల రూపురేఖలు కూడా మారిపోతాయని మంత్రి కేటీఆర్ అన్నారు.
ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా తన సమ్మర్ సేల్(Amazon Great Summer Sale 2023)తో తిరిగి వచ్చింది. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్‌లపై ఉన్న భారీ డిస్కౌంట్ ఆఫర్లను ఇప్పుడు చుద్దాం.
భారతీయ విమానయాన సంస్థ గో ఫస్ట్(Go first) తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా మే 9, 2023 వరకు అన్ని విమానాలను రద్దు(closed) చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ విమానయాన సంస్థ మంగళవారం దివాలా దాఖలు ప్రకటన చేసిన తర్వాత తెలిపింది. మరోవైపు అప్పటికే టిక్కెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులకు తిరిగి డబ్బులు పంపనున్నట్లు వెల్లడించారు.