జూలై నెలలో 15 రోజులు బ్యాంకులు(Banks) మూతపడనున్నాయి. ఐదు ఆదివారాలు, రెండు శనివారాలతో కలిపి 7 వారాంతపు సెలవులు(Bank Holidays) ఉంటాయి. వాటితోపాటుగా వివిధ కారణాల వల్ల దేశంలోని కొన్ని ప్రాంతాల్లో 8 రోజులు బ్యాంకులు పని చేయవు. మరి ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవు ఉంటుందో ఇప్పుడు చూద్దాం.
జూలైలో బ్యాంకు సెలవులివే: జూలై 2: ఆదివారం – సెలవు. జూలై 5: గురు హర్ గోవింద్ సింగ్ జయంతి -జమ్ము, శ్రీనగర్ లలో సెలవు. జూలై 6: మీజో హ్మెచ్చే ఇన్సుహిఖావ్ పాల్ (ఎంహెచ్ఐపీ) – మిజోరం అంతటా బ్యాంకులు పని చేయవు. జూలై 8: రెండో శనివారం – సెలవు. జూలై 9: ఆదివారం – సెలవు. జూలై 11: కెర్-పూజ – త్రిపురలో బ్యాంకులకు సెలవు. జూలై 13: భానూ జయంతి – సిక్కింలో బ్యాంకులు మూత. జూలై 16: ఆదివారం – సెలవు. జూలై 17: యూ టిరోట్ సింగ్ డే – మేఘాలయలో సెలవు. జూలై 21 : ద్రుక్ప షేజీ – సిక్కింలో బ్యాంకులకు సెలవు. జూలై 22: నాలుగో శనివారం – సెలవు. జూలై 23: ఆదివారం – సెలవు. జూలై 28 : అశూరా – జమ్ము కశ్మీర్ లో బ్యాంకులు పని చేయవు. జూలై 29 : మొహర్రం – సెలవు. జూలై 30 : ఆదివారం – సెలవు.