అమెజాన్ (Amazon) రెండోదశ ఉద్యోగాల తొలగింపునకు సిద్ధమైంది. రానున్న కొన్ని వారాల్లో ఉద్యోగులను తొలగించనున్నట్టు అమెజాన్ సీఈవో ఆండీ జస్సీ తెలిపారు. ఈ మేరకు ఆయన ఉద్యోగులకు మెమో పంపించారు.
హ్యాండ్‌సెట్ 6.1-అంగుళాల డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 50-మెగాపిక్సెల్ ప్రైమరీ వైడ్ యాంగిల్ సెన్సార్ నేతృత్వంలోని ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది
చాట్ చేసిన సమాచారాన్ని లాక్ చేసుకునేందుకుగాను సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది వాట్సాప్. ఇప్పుడు ఎవరి చాట్ నైనా లాక్ చేసుకోవచ్చు. అందుకుగాను ప్లే స్టోర్ లో అప్డెటెడ్ వర్షన్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది.
ఏప్రిల్‌లో మొత్తం ధరలలో తగ్గుదల కారణంగా దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఇండియాలో టోకు ధర బేస్ ద్రవ్యోల్బణం (WPI) మైనస్ లోకి మారిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో 1.34 శాతం నుంచి - 0.92%కి చేరుకుందని వెల్లడించింది.
ఇక్కడ కనిపిస్తున్న షార్ట్ ధర అక్షరాలా రూ.90 వేలు. ఎందుకంత రేటు.. మామూలుగా షార్ట్ ధర అధికంగా 5వేల రూపాయలు ఉండవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ షార్ట్ ను సులబ్రిటీలు ఫిదా అయ్యూ ఇటాలియన్ బ్రాండ్ లోరో పియానా తయారు చేసింది. ఇందులో ఉపయోగించిన కాటన్ అత్యంత ఖరీదైనది. ఇలాంటి కాటన్ తో తయారుచేసిన ఓ తెల్ల రంగు షార్ట్ ను ఇటీవల రిలీజ్ చేసింది సదరు సంస్థ. ఇంట్లో, విహారయాత్రలకు వెళ్లినప్పుడు హాయిగా ఉ...
ప్రముఖ కమ్యూనికేషన్ యాప్ వాట్సాప్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడేవారే. ఎవరికైనా మెసేజ్ చేయాలన్నా, వీడియో కాల్ చేయాలన్నా అందరూ వాట్సాప్ వాడుతున్నారు. ఈ మధ్య శుభకార్యాలకు పిలుపులు కూడా వాట్సాప్ లోనే జరుగుతున్నాయి.
ఈరోజుల్లో నెట్ ఫ్లిక్స్ గురించి ఎవరికీ చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఓటీటీ రాజ్యం ఏలుతోంది. వాటిలో నెట్ ఫ్లిక్స్ కూడా ఒకటి. ప్రతి ఒక్కరూ తమ స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీలలో ఈ ఓటీటీ ప్లాట్ ఫాంని వినియోగించేవారే. ఇందులో కొత్తగా విడుదలైన సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. పలు ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమ్ అవుతూ ఉంటాయి. కాగా, ఈ ఓటీటీ ప్లాట్ ఫాం పై తాజాగా భారత ఐటీ శాఖ కన్నేసింది.
గూగుల్ తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. గూగుల్ ఐఓ 2023 కార్యక్రమంలో సరికొత్త ఆవిష్కరణను విడుదల చేసింది. ఈ వేదికపైనే ఏఐ టూల్ గూగుల్ బార్డ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. గూగుల్ బార్డ్ ను భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోకి అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది.
భారత వ్యాపార దిగ్గజం అంబానీ రిలయన్స్ జియో(reliance jio)ను దేశంలో తీసుకురావటం పెద్ద విప్లవానికి నాంది పలికింది. ఒకప్పుడు రూ.10 రీఛార్జ్(Recharge) చేసేందుకు వంద సార్లు ఆలోచించిన భారతీయులు ఇప్పుడు వందల రూపాయలతో నెలవారీ ప్యాకేజీలు కొనుగోలు చేస్తున్నారు.