ట్విట్టర్(Twitter)కు కర్ణాటక హైకోర్టు(Karnataka High Court) షాక్ ఇచ్చింది. కేంద్రం ప్రభుత్వం(central Government) ఆదేశాలపై ట్విట్టర్ సంస్థ అభ్యంతరాలను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ట్విట్టర్ పిటీషన్‌ను దాఖలు చేసింది. అయితే ఆ పిటీషన్‌ను కోర్టు తిరస్కరించింది. 2021 ఫిబ్రవరి నుంచి 2022 మధ్య కేంద్ర ప్రభుత్వం 10 సార్లు ట్విట్టర్‌ను బ్లాక్ చేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్ తన పిటీషన్లో తెలిపింది.
ఈ నేపథ్యంలో మరో 39 యూఆర్ఎల్స్(URL’s)ను తీసివేయాలని కేంద్ర ఐటీశాఖ(IT Department) ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలను తప్పుపడుతూ ట్విట్టర్(Twitter) పిటీషన్ వేయగా దానిని జస్టిస్ కృష్ణ దీక్షిత(Justice Krishna Deekshita) కొట్టిపారేశారు. దీంతో ట్విట్టర్ సంస్థపై రూ.50 లక్షల జరిమానాను విధించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఎటువంటి వివరణను ట్విట్టర్ ఇవ్వలేదని న్యాయమూర్తి దీక్షిత్ వెల్లడించారు.
ట్విట్టర్(Twitter) అనేది ఒక సాధారణ వ్యక్తి కాదని, రైతు కాదని, అదొక బిలియనీర్ కంపెనీ అని కోర్టు తెలిపింది. 45 రోజుల్లోగా కర్ణాటక లీగల్ సెల్ సర్వీసెస్(Karnataka legal cell services)కు ట్విట్టర్ రూ.50 లక్షలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను జస్టిస్ దీక్షిత(Justice Krishna Deekshita) తన తీర్పులో సమర్థించారు. ట్వీట్లను, అకౌంట్లను బ్లాక్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని కోర్టు వెల్లడించింది.