High Package For A Young Man Who Selling Biryani On Cart
Young Man: కొందరు కష్టపడుతుండగా.. వారికి సాయం అందుతుంది. దీంతో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ఢిల్లీలో (delhi) ఓ యువకుడు పరిస్థితి అలాంటిదే.. అవును బిర్యానీ అమ్ముకునే అతను ప్రతిష్టాత్మక కాలేజీలో ఎంబీఏ చేశాడు. తర్వాత మంచి ప్యాకేజీతో జాబ్ సంపాదించాడు. అతను పలువురికి స్ఫూర్తిగా నిలిచాడు.
సౌత్ ఈస్ట్ ఢిల్లీలో గల జామియా నగర్లో షకీర్ (shakeer) ఉంటాడు. పని చేసుకుంటూనే చదివేవాడు. షకీర్ అమితీ (amity) వర్సిటీలో సీటు సంపాదించడంతో అతని లైఫ్ టర్న్ తిరిగిపోయింది. అతనికి అసీం ఆషా ఫౌండేషన్ అండగా నిలిచింది. క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సేకరించి.. ఫీజు చెల్లించింది. దీంతో అతని ఎంబీఏ (mba) చదువు పూర్తయ్యింది.
ఇటీవల బ్యాంక్ జాబ్ (bank job) సంపాదించాడు. ప్రైవేట్ బ్యాంక్లో రూ.8.5 లక్షల ప్యాకేజీతో (pack) జాబ్ కొట్టాడు. దీంతో అతని కష్టాలు తీరిపోయాయి. కష్టపడి చదవడమే కాదు.. అతనికి ఆషా ఫౌండేషన్ తోడుగా నిలిచింది. బంగారు భవిష్యత్ అందించింది. షకీర్ (shakeer) లాంటి మెరికలను వెలికితీసి.. మంచి భవిష్యత్ అందజేయడమే తమ విధి అని అసీం ఆషా ఫౌండేషన్ చెబుతోంది. నిజమే మరీ.. ఓ జీవితం నిలబెట్టడం అంటే మాటలు కాదు. దీంతో అతని కుటుంబం రుణపడి ఉంటుంది.