OnePlus 10R 5G: వన్ ప్లస్ (OnePlus) కంపెనీ ప్రీమియం ఫోన్లతోపాటు బడ్జెట్ సెగ్మెంట్‌పై ఫోకస్ చేసింది. గత ఏడాది వన్ ప్లస్ 10ఆర్ 5జీ (OnePlus 10R 5G) మొబైల్ రిలీజ్ చేసింది. రెండు వెర్షన్లలో మొబైల్ రిలీజ్ చేయగా.. టాప్ మోడల్ ఫోన్ ధర తగ్గిస్తూ సేల్ చేస్తోంది. ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్ (amazon)లో మొబైల్ అందుబాటులో ఉంది.
5000 ఎంఏహెచ్ బ్యాటరీ 80 వాట్స్ సూపర్ వీఓఓసీ ఫాస్ట్ చార్జీంగ్ గల మొబైల్ 8జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరెజ్ వేరియంట్, 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరెజ్ వేరియంట్లో లభిస్తోంది. ఈ రెండు మొబైల్స్ రూ.34,999, రూ.38,999 ధర ఉంది. రెండింటికీ రూ.4 వేల డిస్కౌంట్ కూపన్ ఇస్తోంది. దీంతోపాటు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ (icici bank credit card) వినియోగదారులకు అడిషనల్‌గా రూ.2 వేల డిస్కౌంట్ రానుంది. దీంతో 8జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరెజ్ గల మొబైల్ రూ.28,999కి రానుంది. 12జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరెజ్ గల మొబైల్ రూ.32,999కి వస్తోంది.
వన్ ప్లస్ 10ఆర్ 5జీ 6.7 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంది. 2.5డీ కర్వ్డ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఇచ్చారు. వెనకాల త్రిపుల్ కెమెరా ఇచ్చారు. 50 మెగా పిక్సెల్ సోని ప్రైమరీ సెన్సార్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టాబిలేషన్ సపోర్ట్, 8 మెగా పిక్సెల్ సోని సెన్సార్ విత్ అల్ట్రా వైడ్ లెన్స్, 2 మెగా పిక్సెల్ మాక్రొ లైన్స్‌తో రియర్ కెమెరాస్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫ్రంట్ కెమెరా 16 మెగా పిక్సెల్ సామ్ సంగ్ సెన్సార్ కలిగి ఉంది.