»Nestle Adds 3 Grams Of Sugar In Every Serving Of Cerelac Sold In India A Report Said
Nestle: నెస్లే సెరెలాక్‌లో అధికంగా షుగర్ లెవెల్స్
శిశువుల ఆహారంగా పేరొందిన నెస్లే సెరెలాక్‌లో మోతాదుకు మించి చక్కరలు ఉన్నట్లు ఓ నివేదికలో తేలింది. అయితే భారత్ లో దొరుకుతున్న సెరెలాక్‌తో పోలిస్తే బ్రిటన్, జర్మనీ, స్విట్జర్లాండ్ తదితర దేశాల్లో దొరుకుతున్న దానిలో చక్కెర స్థాయిలు సాధారణంగానే ఉన్నాయిట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Nestle Cerelac : శిశువులు ఉన్న ప్రతి ఇంట్లోనూ దాదాపుగా సెరెలాక్ని వాడుతూ ఉంటారు. పసి వారికి బలవర్ధకమైన పోషకాలు అందించేందుకుగాను చాలా మంది దీన్ని వినియోగిస్తూ ఉంటారు. అందుకనే ఇది బేబీ ఫుడ్ విభాగంలో టాప్ సెల్లింగ్ ఉత్పత్తిగా ఉంది. అయితే నెస్లే కంపెనీ ఉత్పత్తి చేసే ఈ సెరెలాక్‌లో మోతాదుకు మించి చక్కెరలు ఉన్నట్లుగా ఓ అధ్యయనంలో తేలింది.
బ్రిటన్, జర్మనీ, స్విట్జర్లాండ్ తదితర దేశాల్లో దొరికే సెరెలాక్‌లో(Cerelac) చక్కెర స్థాయిలు సాధారణంగానే ఉన్నాయి. కానీ భారత్‌తో దొరికే ఈ ఉత్పత్తిలో మాత్రం చక్కెర అధికంగా ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. భారత్‌తోపాటు(India) ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో అమ్మే నెస్లే ఉత్పత్తుల్లో చక్కెర ఎక్కువగా ఉంటున్నట్లు నిర్ధారణ జరిగింది. దీంతో అంతర్జాతీయ మార్గదర్శకాలను సదరు సంస్థ ఉల్లంఘిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి.
ఇలా శిశువుల ఆహారంలో చక్కెర ఎక్కవగా ఉండటం వల్ల శిశువుల్లో దీర్ఘకాలంలో ఊబకాయం లాంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. భారత దేశంలో ఉన్న 15 సెరెలాక్ రకాల్లో సగటున మూడు గ్రాముల చక్కెర అధికంగా ఉందని తేలింది. అయితే ఈ విషయాన్ని నెస్లే ఇండియా కంపెనీ అధికారులు కొట్టిపారేశారు. గడచిన ఐదేళ్లలో తమ నెస్లే(Nestle) సంస్థ సెరెలాక్‌లో చక్కెర శాతాన్ని 30 శాతానికి పైగా తగ్గించి తయారు చేస్తోందని చెప్పారు. శిశు ఆహారం కచ్చితంగా నాణ్యంగా ఉండాలన్న ఉద్దేశంతోనే తాము ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు వివరించారు.