»More Than 1 Lakh Crore Business Happen On Ram Mandir Pran Pratistha Day
Ram Mandir: ప్రాణ ప్రతిష్ఠ రోజు అత్యధికంగా ఏమి అమ్ముడుపోయాయో తెలుసా ?
అయోధ్యలో రాములోరి ప్రాణ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థలో రామ మందిర ప్రతిష్ట బలంగా ముడిపడి ఉంది. దేశవ్యాప్తంగా దాని వేగవంతమైన విస్తరణకు గొప్ప అవకాశం ఉంది.
Ram Mandir: అయోధ్యలో రాములోరి ప్రాణ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థలో రామ మందిర ప్రతిష్ట బలంగా ముడిపడి ఉంది. దేశవ్యాప్తంగా దాని వేగవంతమైన విస్తరణకు గొప్ప అవకాశం ఉంది. స్థూల అంచనా ప్రకారం శ్రీరామ మందిరం వల్ల దేశంలో సుమారు రూ.1.25 లక్షల కోట్ల భారీ వ్యాపారం జరిగిందని దేశ వ్యాపారవేత్తల సంస్థ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ పేర్కొంది. ఇందులో ఒక్క ఢిల్లీలోనే దాదాపు రూ.25 వేల కోట్లు, ఉత్తరప్రదేశ్‌లో దాదాపు రూ.40 వేల కోట్లు వస్తు సేవల ద్వారా వ్యాపారం జరిగింది.
క్యాట్ జాతీయ అధ్యక్షుడు బిసి భారతియా, ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. దేశంలోనే విశ్వాసం, భక్తి కారణంగా వ్యాపారం ద్వారా ఇంత పెద్దమొత్తంలో జరిగి డబ్బు మార్కెట్లోకి రావడం ఇదే తొలిసారి అన్నారు. అయోధ్య ఆలయం కారణంగా దేశంలో అనేక కొత్త వ్యాపార అవకాశాలు వచ్చాయి. ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఉపాధి పొందుతారు. ఇప్పుడు వ్యాపారవేత్తలు, స్టార్టప్‌లు తమ వ్యాపారానికి కొత్త కోణాలను జోడించడానికి ప్రయత్నించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ అంశంపై త్వరలో న్యూఢిల్లీలో క్యాట్ సెమినార్ నిర్వహించనుంది. హర్ షహర్ అయోధ్య-హర్ ఘర్ అయోధ్య జాతీయ ప్రచారం కింద జనవరి 1 నుండి జనవరి 22 వరకు దేశంలోని 30 వేలకు పైగా చిన్న, పెద్ద వ్యాపార సంస్థలు దేశవ్యాప్తంగా 1.5 లక్షలకు పైగా కార్యక్రమాలను నిర్వహించాయి. ఇందులో ఒక్క జనవరి 22వ తేదీన లక్షకు పైగా కార్యక్రమాలు నిర్వహించారు.
దేశవ్యాప్తంగా కోట్లాది శ్రీరామ మందిర నమూనాలు, పూలమాలలు, లాకెట్లు, కంకణాలు, బిందెలు, రాముడి జెండాలు, రాముడి టోపీ, రాముడి పెయింటింగ్స్, రాముడి చిత్రాలు అమ్ముడు పోయినట్లు భారతియా, ఖండేల్వాల్ చెప్పారు. ఇందులో అయోధ్య నమూనా మందిరాలు, రాముడి చిత్రాలు విపరీతంగా అమ్ముడయ్యాయి. పండిట్లు, బ్రాహ్మణులు కూడా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆదాయం పొందారు. కోట్ల కిలోల మిఠాయిలు, డ్రైఫ్రూట్స్ ప్రసాదంగా విక్రయించారు. కోట్లాది రూపాయల విలువైన క్రాకర్లు, మట్టి దీపాలు, ఇత్తడితో చేసిన దీపాలు, ఇతర వస్తువులు కూడా దేశవ్యాప్తంగా విరివిగా అమ్ముడయ్యాయి. రానున్న కాలంలో శ్రీరామ మందిరాన్ని ప్రజలు కానుకగా ఇచ్చే అవకాశం ఉందన్నారు. పెళ్లిళ్లలో వచ్చే అతిథులకు శ్రీరాముడి ఆలయాన్ని బహుమతిగా ఇవ్వడం ఇప్పటికే ప్రారంభమైంది.